ఓబులవారిపల్లె: మంగంపేట ఏపీఎండీసీ నిర్వహించిన బెరైటీస్ రవాణా టెండర్లు మంగళవారం ముగిశాయి. టెండర్‌లో పాల్గొనేందుకు పన్నెండుమంది ట్రాన్స్‌పోర్టర్లు షెడ్యూల్‌ను కొనుగోలు చేశారు. స్థానిక రవాణాదారులు పది మంది, ఇద్దరు కడప ట్రాన్స్‌పోర్టర్లు టెండర్‌లో పాల్గొన్నారు. ఒకదశలో టెండర్‌లు ఏకపక్షంగా జరిగేందుకు సన్నహాలు జరిగాయి. రైల్వేకోడూరు ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు టెండర్లు ప్రశాంతంగా ముగించాలని పోటీదారులకు సూచించారు. ఏపీఎండీసీ మంగంపేట సీపీఓ కేదార్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3గంటల నుంచి రవాణా టెండర్ షెడ్యూల్‌ను పరిశీలించారు.
ఇందులో శ్రీవెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్ టన్నుకు రూ.792లు ధరను దాఖలు చేసి ఎల్‌వన్‌గా నిలిచింది. ఏఎస్ లాబిక్స్ రూ.1,050లు ధర దాఖలు చేసి ఎల్‌త్రీగా నిలిచింది. దీంతో రవాణా టెండర్లు ప్రశాంతంగా ముగిశాయి. ఇదే బెరైటీస్ పౌడర్‌ను గత నెలలో ట్రాన్స్‌పోర్టు కోసం ఏపీఎండీసీ యాజమాన్యం టెండర్లు పిలవగా పల్వరైజింగ్‌మిల్లుల యజమానులు మిల్లులకు రావాల్సిన బ్యాక్‌లాగ్ క్వాంటిటీ పై స్పష్టత వచ్చేంత వరకు టెండర్‌ను బాయ్‌ట్ చేయడంతో ఆగిపోయాయి. తిరిగి ఇదే టెండర్‌ను ఏపీఎండీసీ యాజమాన్యం నిర్వహించడంతో ట్రాన్స్‌పోర్టులు పోటీ పడి టెండర్‌లో పాల్గొన్నారు.
ముగిసిన బెరైటీస్ రవాణ టెండ ర్లు
Published Wed, Feb 18 2015 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM
Advertisement
Advertisement