అప్రమత్తంగా ఉండాలి
రవివర్మ, డిఐజీ, క్రైమ్
నాంపల్లి: రాష్ట్రంలో ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిపట్ల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని క్రైమ్స్ డీఐజీ రవి వర్మ అన్నారు. శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో ఫ్యాప్సీ, సీసీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ‘సైబర్ క్రైమ్ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ సాంకేతిక అభివృద్ధే సైబర్ నేరాల పెరుగుదలకు కారణమని, ప్రతి రోజూ 20 మంది బాధితులు సీసీఎస్‌ను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.
ఇంటర్నెట్‌తో చెడే ఎక్కువగా జరుగుతున్నదని, వ్యాపారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సెల్‌ఫోన్లకు వచ్చే లాటరీ ఎస్‌ఎంఎస్‌లపై ఎట్టి పరిస్థితుల్లో స్పందించరాదని సూచించారు. నైజీరియన్లే సైబర్ నేరాలకు ఎక్కువగా పాల్పడుతున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ షాపింగ్, హోటల్స్, పెట్రోలు బంకుల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు.
బ్యాంకు అకౌంట్ నంబరు, క్రెడిట్‌కార్డు, డిబిట్ కార్డులను విచ్చలవిడిగా వినియోగించరదని సూచించారు. ఫ్యాప్సీ అధ్యక్షులు వెన్నం అనీల్‌రె డ్డి మాట్లాడుతూ వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు బ్యాంకులతో జరిపే లావాదేవీల పట్ల నిర్లక్ష్యం వ హించవద్దని, ఎప్పటికప్పుడు మీ అకౌంట్లలో నిల్వ ఉన్న మొత్తాలను సరిచూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్సీ బ్యాంకింగ్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ గౌర శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.