న్యూఢిల్లీ : ప్రపంచంలో అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్, రిలయన్స్ రిటైల్, వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్‌లకు చెక్‌పెట్టబోతుంది. వాటిపై పోటీకి ఆదిత్య బిర్లా గ్రూప్‌ను టార్గెట్ చేసింది. ఆదిత్య బిర్లాకు చెందిన రిటైల్ స్టోర్ మోర్‌లో వాటాను కొనుగోలు చేసేందుకు అమెజాన్ సిద్ధమైంది. ఫుడ్, గ్రోసరీ సూపర్‌మార్కెట్ మోర్‌ను కొనుగోలు చేసేందుకు గోల్డ్ మ్యాన్ సాచ్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సమర క్యాపిటల్‌తో కన్సోర్టియం ఏర్పాటు చేస్తోంది. మోర్‌లో వాటాను కొనుగోలు చేసే డీల్ రూ.4500 కోట్ల నుంచి రూ.5000 కోట్ల మధ్యలో ఉంటుందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. ఇప్పటికే సమర, ఆదిత్య బిర్లా రిటైల్ లిమిటెడ్ ఈ ఎక్స్‌క్లూజివ్ అగ్రిమెంట్‌పై జూన్‌లోనే సంతకాలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల చివరిలో లేదా వచ్చే నెలలో దీనిపై తుది ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సమర అనేది దేశీయ ఫండ్. ఈ నిధి సంస్థ గోల్డ్‌మ్యాన్ సాచ్చ్, అమెజాన్‌ను కలిసినట్టు కూడా వెల్లడైంది. ఈ మూడు కలిసి ప్రత్యేక కంపెనీని లేదా ప్రత్యేక ప్రయోజన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాయి. దీనిలో వ్యూహాత్మక భాగస్వామ్యదారిగా 49 శాతం వాటాను దక్కించుకోవాలని అమెజాన్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇండియన్ ఓవర్‌సీస్ ఇన్వెస్ట్‌మెంట్ చట్టాల ప్రకారం, విదేశీ కంపెనీలు మల్టి బ్రాండ్ రిటైలర్లలో కేవలం 49 శాతం వాటాను మాత్రమే కలిగి ఉండాలి. క్యాష్ అండ్ క్యారీ రిటైలింగ్‌లో సంస్థలను ఏర్పాటు చేస్తూ.. 100 శాతం విదేశీ యజమాన్యాన్ని అనుమతిస్తున్నాయి. ఈ ఫ్రాంచైజీలకు దేశీయ గ్రూప్‌లు, సంస్థలు ముందుండి నడిపిస్తుంటాయి. గతేడాదిలోనే అమెజాన్, షాపర్స్ స్టాప్‌లో 5 శాతం వాటాను దక్కించుకుంది. అమెరికాలో కూడా హోల్ ఫుడ్స్ అనే సంస్థను అమెజన్ 13.7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment