Aditya Birla Group company
-
తూర్పుగోదావరిలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్‌తో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా హాజరు కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు బలభద్రపురం చేరుకుంటారు. కుమార మంగళం బిర్లాతో కలిసి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా ప్లాంట్‌ను సందర్శిస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. రేపు ఒంగోలులో పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 22వ తేదీ శుక్రవారం ఒంగోలులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కార్పొరేట్ దిగ్గజాలు
సాక్షి, అమరావతి: ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు, అదానీ, సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వీ, సెంచురీ ఫ్లైవుడ్స్ భజాంకా, శ్రీ సిమెంట్స్ బంగర్ లాంటి కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. వివిధ వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూపు తూర్పు తీరప్రాంతంలో కీలకమైన కృష్ణపట్నం, గంగవరం ఓడరేవుల్లో భారీ పెట్టుబడులు పెట్టడమే కాకుండా సుమారు రూ.15,000 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, కన్వెన్షన్ సెంటర్లను నిర్మిస్తోంది. మరో కార్పొరేట్ దిగ్గజం బిర్లాలకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ సంస్థ వైఎస్సార్ జిల్లా పులివెందులలో రూ.110 కోట్లతో గార్మెంట్ తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా భలభద్రపురంలో రూ.2,700 కోట్లతో భారీ కాస్టిక్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. కృష్ణపట్నం వద్ద జిందాల్ గ్రూపు రూ.7,500 కోట్ల పెట్టుబడితో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచురీ ప్లై తొలుత రూ.600 కోట్లతో తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకు రాగా రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని చూసి పెట్టుబడులను రూ.2,600 కోట్లకు పెంచుతున్నట్లు సంస్థ చైర్మన్ సజ్జన్ భజాంక ప్రకటించడం పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. సన్‌ఫార్మా, శ్రీ సిమెంట్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. రెండేళ్లలో రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం వచ్చే రెండేళ్లలో రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కలిపి సుమారు 70 భారీ పరిశ్రమలు యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. వీటి ద్వారా 1,80,754 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ రంగంలోనే రూ.1.07 లక్షల పెట్టుబడులు రానున్నాయి. ఓఎన్జీసీ తూర్పు గోదావరి జిల్లాలో రూ.78,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా హిందుస్థాన్ పెట్రోలియం విశాఖలో రూ.28,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనుంది. రూ.6,700 కోట్లతో అన్‌రాక్ అల్యూమినియం, రూ.1,750 కోట్లతో జపాన్‌కు చెదిన ఏటీసీ టైర్స్, రూ.1,200 కోట్లతో కర్నూలులో రామ్‌కో సిమెంట్, రూ.1,404 కోట్లతో కాకినాడ జిల్లాలో శ్రావణ్ షిప్పింగ్ , రూ.2,000 కోట్లతో విశాఖలో సెయింట్ గోబియాన్ లాంటి భారీ సంస్థలు ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 92 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 92 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. ప్రభుత్వ సహకారంతో కియా మోటార్స్, కిసాన్ క్రాఫ్ట్, హీరో మోటార్స్, టీహెచ్‌కే ఇండియా, దివీస్ ఫార్మా, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లాంటి 92 భారీ పరిశ్రమలు ఈ కాలంలో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.36,313 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చగా 56,681 మందికి ఉపాధి లభించింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న రంగాల్లో ఆటోమొబైల్, బల్క్ డ్రగ్స్, ఫార్మా, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్, ఫుడ్– మెరైన్ ప్రోడక్టŠస్ ఉన్నాయి. పోర్టు ఆధారిత పెట్టుబడులపై దృష్టి 974 కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నందున రాష్ట్రంలో పోర్టు ఆధారిత పరిశ్రమలను ఆకర్షించేలా ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. కొత్తగా నాలుగు పోర్టులు నిర్మించడంతో పాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. పరిశ్రమలకు అన్ని వసతులతో కూడిన పారిశ్రామిక పార్కులతోపాటు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు, ఎయిర్‌పోర్టులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. – కరికల్ వలవన్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పెట్టుబడులకు అనువైన రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనువైన వాటిల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది. కరోనా సమయంలోనూ బిర్లా, అదానీ, జిందాల్, సంఘ్వీ తదితర పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతో అంతర్జాతీయ సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కృషి చేస్తాం. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి -
AP: బిర్లాతో ఉపాధికి ఊతం
ప్రగతి పతాకాలతో రెపరెపలాడుతున్న పులివెందుల సొంత గడ్డను, వైఎస్సార్ జగనన్న హౌసింగ్ లే అవుట్‌ను హెలికాప్టర్లో ప్రయాణిస్తూ చూస్తుంటే గర్వంగా ఉంది. నామీద మీకున్న అభిమానం, ప్రేమ, మమకారం, ఆప్యాయతల మధ్య ఈ రోజు వైఎస్సార్ జిల్లా పులివెందులలో 7,309 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. పక్కనే బ్రాహ్మణపల్లెలో మరో 733 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మొదట్లోనే (గత క్రిస్మస్ రోజున) అందరితోపాటు చేద్దామనుకున్నాం. కానీ రకరకాల కోర్టు కేసులు, గిట్టని వారు రకరకాల ఇబ్బందులు పెట్టిన పరిస్థితుల్లో ఆ చిక్కుముడులన్నింటినీ విప్పుకుని ఈ క్రిస్మస్ సందర్భంగా మొత్తం 8,042 మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో ఈ ఆస్తిని పెడుతున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కడప/ పులివెందుల/టౌన్/రూరల్: బిర్లా పరిశ్రమ రాకతో వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఆయన పులివెందులలోని సంయు గ్లాస్ ఫ్యాక్టరీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదిత్య బిర్లా గ్రూపు వస్త్ర ఉత్పత్తి కేంద్రం పులివెందులలో ఏర్పాటు చేయడం చరిత్రాత్మకమని, సంతోషదాయకమని అన్నారు. ప్రపంచంలోనే 500 పెద్ద కంపెనీల్లో ఆదిత్య బిర్లా కంపెనీ ఒకటి అని తెలిపారు. ఈ కంపెనీలో 85 శాతం మంది మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ సుమారు 2 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా 3031 ఫ్యాషన్ రిటైల్ స్టోర్స్ ఉన్నాయని, 25 వేల మల్టీ బ్రాండ్స్ దుకాణాలు, 6,500 డిపార్ట్మెంట్స్ స్టోర్స్‌ను నడుపుతోందన్నారు. వ్యాన్ హ్యుసేన్, అలెన్ సోలీ వంటి పెద్ద, పెద్ద బ్రాండ్లను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తూ.. 2020–21లో రూ.8,700 కోట్ల టర్నోవర్‌తో ముందుకు సాగిందని చెప్పారు. మా సహకారం ఎప్పుడూ ఉంటుంది పులివెందులలో రూ.110 కోట్ల పెట్టుబడితో 2112 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నందుకు కుమార మంగళం బిర్లా, అశిష్, చీఫ్ సప్లయ్ ఆఫీసర్ స్వామినాథన్, కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ వివేక్, అతని బృంద సభ్యులకు సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇక్కడికి సమీపంలో పెద్ద హౌసింగ్ కాలనీ రాబోతోంది. 7400 ఇళ్లు నిర్మించబోతున్నాం. దాదాపు 25 వేల మంది ప్రజలు ఇక్కడ నివసించబోతున్నారు. ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ప్రభుత్వమే స్కిల్ డెవలప్మెంట్ కళాశాలలు నిర్మిస్తోంది. ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని సహాయంతో మీరు మా వాళ్లకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. వీటన్నింటితో పాటు నేను కూడా అందుబాటులో ఉంటాను. భవిష్యత్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి, సత్సంబంధాలు నెలకొల్పే దిశగా ఇరువైపులా ఇది ఉపయోగపడుతుంది’ అని అన్నారు. అనంతరం ఆయన ఆదిత్య బిర్లా కంపెనీ ప్రతినిధులకు భూమి కేటాయింపు పత్రాలు అందజేశారు. వారు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటాన్ని సీఎం వైఎస్ జగన్‌కు అందించారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా ఎండీ ఆశిష్ దీక్షిత్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తమకు అన్ని విధాలా సహకరిస్తోందని చెప్పారు. త్వరలోనే పరిశ్రమను నెలకొల్పి ఎక్కువ శాతం మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో నాగలితో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం సీఎం వైఎస్ జగన్ శుక్రవారం పులివెందుల వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.10.50 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. చీనీ రైతుల సౌకర్యార్థం రూ.4 కోట్ల 79 లక్షలతో నిర్మించిన షెడ్డును ప్రారంభించారు. ఆర్అండ్బీ బంగ్లా ఎదురుగా రూ.3.64 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. పెద్దముడియం, శ్రీ అవధూత కాశినాయన మండలాల్లో పోలీసుస్టేషన్లను ఇక్కడి నుంచే ప్రారంభించారు. అంబకపల్లె రోడ్డులోని రాణితోపు పార్కు ఎదురుగా రూ.2.60 కోట్లతో నిర్మించిన ఫిష్ ఆంధ్ర అక్వా హబ్‌ను ప్రారంభించారు. నియోజకవర్గంలో 100కు పైగా ఫిష్ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు. రీటైల్ షాపులు త్వరలోనే అన్నిచోట్ల రాబోతున్నాయన్నారు. రాష్ట్రంలో 70 ఆక్వా హబ్‌లు, 14 వేల రీటైల్ షాపులు పెడుతున్నామన్నారు. దీనివల్ల చేపలు, రొయ్యలు పండించే రైతులకు మంచి ధర వస్తుందని చెప్పారు. మోడల్ పోలీస్‌స్టేషన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంతింటి కల నెరవేర్చడం ఆనందంగా ఉంది పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. పులివెందుల సమీపంలోని మెగా టౌన్షిప్ లే అవుట్ కాలనీలో 8,042 మంది మహిళలకు ఇంటి పట్టాలు, ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► హెలికాప్టర్లో వస్తున్నప్పుడు 323 ఎకరాల్లో ఉన్న ఈ కాలనీ మొత్తం చూశాను. ఇంత మందికి ఇక్కడ ఇళ్లు కట్టించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఒక్కో ఇంటి పట్టా విలువ రూ.2 లక్షలు.. ఇల్లు కట్టడానికి మరో రూ.2 లక్షలు.. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఏడు వార్డు సచివాలయాలు, రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఏడు ప్రాథమిక పాఠశాలలు, 15 ఎకరాల్లో మంచి పార్కులు, ఒక పోలీసుస్టేషన్, ఒక పోస్టాఫీసు, 10 ఎకరాల్లో మంచి ఆటస్థలం.. ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు అవుతున్నాయి. ► రూ.28 కోట్లతో నీటి సరఫరా, రూ.49 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ.69 కోట్లతో రోడ్ల నిర్మాణం మొత్తం కలిపి రూ.147 కోట్లు ఇక్కడ ఖర్చు చేస్తున్నాం. ఇందులో ఇంటికి సగటున మరో రూ.2 లక్షలు ఖర్చుపెడుతున్నాం. మొత్తంగా రూ.6 లక్షలు. ఇవన్నీ పూర్తయ్యాక ఇక్కడ ఇంటి విలువ కనీసం రూ.10 లక్షలు ఉంటుంది. ఈ మొత్తాన్ని అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టినట్లవుతుంది. మెగా టౌన్షిప్ లే అవుట్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ ఈ పక్కనే ఇండస్ట్రియల్ పార్క్ ఈ కాలనీ పక్కనే ఇండస్ట్రియల్ పార్కు రాబోతోంది. అపాచీ అంటే అడియాస్ షూ తయారు చేసే కంపెనీని తీసుకువచ్చాం. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. అక్కడ దాదాపు 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరకుతాయి. ఆదిత్య బిర్లా కంపెనీ కూడా ఇక్కడే వస్తుంది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక ఈ కంపెనీలకు నడుచుకుంటూ వెళ్లి ఉద్యోగాలు చేసుకోవచ్చు. నెలకు కనీసంగా రూ.10 వేలో, రూ.15 వేలో సంపాదించొచ్చు. మంచి జీతాలతో ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. ఫిష్ ఆంధ్ర ఆక్వా హబ్‌లో ఉత్పత్తులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ శరవేగంగా అభివృద్ధి పనులు ► పులివెందులలో రూ.500 కోట్లతో చేపట్టిన వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులు వేగంగా సాగుతున్నాయి. 500 పడకల ఈ మెడికల్ కాలేజీ 2023 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుంది. ► నూతన బస్సు డిపో, బస్సు స్టేషన్ నిర్మాణ పనులు, శిల్పారామం ఆధునీకరణ పనులు, పులివెందుల క్రీడా మైదానం (ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్) పనులు, ఉలిమెల్ల సరస్సు అభివృద్ధి పనులు, పులివెందుల యూజీబీ నిర్మాణ పనులు, సమగ్ర నీటి సరఫరా పథకం పనులు గడువులోగా పూర్తి చేస్తాం. ► ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్, వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్ అభివృద్ధి పనులు, గండి వీరాంజనేయస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు, వివిధ కళాశాలల్లో, పాఠశాలల్లో నిర్మాణ పనులు గడువులోగా పూర్తవుతాయి. ► రూ.480 కోట్లతో పులివెందుల నియోజకవర్గంలో వాటర్ గ్రిడ్ పనులు 2022 జూన్ నాటికి, రూ.5,036 కోట్లతో పులివెందుల, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని ఆయకట్టును స్థిరీకరించేందుకు చేపట్టిన జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ నుండి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు నీటి ఎత్తిపోతల పథకం పనులు 2023 జూన్ నాటికి పూర్తవుతాయి. ► రూ.1,100 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఎర్రబల్లి చెరువుకు నీటిని నింపడం ద్వారా వేంపల్లె మండలంలోని యురేనియం ప్రభావిత ఏడు గ్రామాలకు నీటి సరఫరా నిమిత్తం చేపట్టిన ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు 2022 డిసెంబరు నాటికి పూర్తవుతాయి. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ఎస్బీ అంజద్‌బాష, ధర్మాన కృష్ణదాస్, మంత్రులు ఆదిమూలపు సురేష్, రంగనాథరాజు, సీదిరి అప్పలరాజు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నన్ను గుండెల్లో పెట్టుకున్నారు సభ ప్రారంభంలో వైఎస్ జగన్.. చేతిలో ఉన్న మైకును చేతితో కొడుతూ.. ‘ఇలా పులివెందులలో కొట్టడం ద్వారా వచ్చే ఆనందం మరెక్కడా రాదు. నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఆప్యాయత చూపిస్తున్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ, తాత, ప్రతి సోదరుడు, స్నేహితుడికి శిరస్సు వంచి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అన్నారు. సభానంతరం ముఖ్యమంత్రి.. రేణుక, షేక్ అప్సాబి, ఓబిగారి బీల అనే మహిళలకు ఇంటి పట్టాలు, గృహ మంజూరు పత్రాలను అందజేశారు. జగనన్న మా దైవం.. మెగా టౌన్షిప్ లే అవుట్లో ఇంటి స్థలంతోపాటు ఇంటి మంజూరు పత్రాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవడం సంక్రాంతి పండుగ ఈరోజే వచ్చినంత సంబరంగా ఉంది. నా భర్త ఆటో డ్రైవర్. తొమ్మిదేళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు తిరిగినా మాకు ఇంటి పట్టా మంజూరు కాలేదు. అయితే జగనన్న పుణ్యమా అని ఇవాళ ఆయన చేతుల మీదుగా ఏకంగా ఇంటి మంజూరు పత్రాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అమ్మ ఒడి, ఆసరా వంటి ప్రభుత్వ పథకాల వల్ల మా లాంటి వాళ్లందరం చాలా సంతోషంగా ఉన్నాం. కరోనా సమయంలో జగనన్న చాలా బాగా ఆదుకున్నారు. ఆయన మేలు ఎప్పటికీ మరచిపోం. జగనన్న మా దైవం. ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు మేలు చేస్తున్న జగనన్నకు వందనం. – రేణుక, పులివెందుల -
ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటీ? తెలుసుకోండిలా..
స్టాక్‌మార్కెట్‌పై ఇండియన్లలో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న డిమ్యాట్ ఖాతాలే ఇందుకు నిదర్శనం. షేర్మార్కెట్లో తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి పొందడమనేది ఎంతో కీలకం. ఇందుకు అనుగుణంగా ఉండే వాటిలో ఫ్లెక్సీక్యాప్ పథకం ఒకటి. అసలు ఫ్లెక్సీక్యాప్ అంటే ఏంటీ ? ఇటీవల అధికంగా లాభాలు అందిస్తోన్న ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్కి సంబంధించిన వివరాలు... ఫ్లెక్సీక్యాప్ ఫ్లెక్సీక్యాప్ పథకాలు గతంలో మల్టీక్యాప్ ఫండ్స్ పేరుతో ఉండేవి. మల్టీక్యాప్ పథకాలు కచ్చితంగా స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ పథకాల్లో 25 శాతం చొప్పున కనీస పెట్టుబడులను నిర్వహించాల్సిందేనని.. లేదంటే ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి మారిపోవచ్చంటూ సెబీ గతేడాది నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో మల్టీక్యాప్ విభాగం నిబంధనలను కట్టుబడలేని పథకాలు ఫ్లెక్సీక్యాప్గా పేరు మార్చుకున్నాయి. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ గడిచిన కొన్నేళ్లలో ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇచ్చాయి. ఫ్లెక్సీ క్యాప్ విభాగంలో మార్కెట్ విలువ పరంగా తమకు అనుకూలం అనిపించిన, భవిష్యత్తులో మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకునే స్వేచ్ఛ ఫండ్ మేనేజర్లకు ఉంటుంది. ఫలానా విభాగంలో (స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్) కచ్చితంగా ఇంత మేర పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనలు ఈ పథకాలకు వర్తించవు. ఈ విభాగంలో కొన్ని పథకాలు గడిచిన ఏడాది కాలంలో గణణీయమైన రాబడులను అందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం (కనీసం పదేళ్లు అంతకుమించి) ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఫ్లెక్సీక్యాప్ పథకాలకు కొంత చోటు కల్పించుకోవచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ కూడా ఒకటి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ ఇన్వెస్టర్లకు 58 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఇదే కాలంలో ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడులు 51 శాతంగానే ఉండడాన్ని గమనించాలి. బీఎస్ఈ 500 సూచీ రాబడులు 53 శాతంతో పోల్చినా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ పథకం మెరుగైన పనితీరును చూపించినట్టు తెలుస్తోంది. ఇక గత మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 14 శాతానికి పైనే సగటు వార్షిక రాబడులను ఇచ్చింది. అంతేకాదు ఐదేళ్లలోనూ, ఏడేళ్లలోనూ, పదేళ్లలో కూడా వార్షిక సగటు రాబడులు 15 శాతం స్థాయిలోనే ఉన్నాయి. నిలకడైన పనితీరును ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. లక్ష ఇన్వెస్టే చేస్తే కోటి రూపాయలు ఆదిత్య బిర్లా ఫెక్సీక్యాప్ పథకంలో 22 ఏళ్ల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి అలాగే కొనసాగించి ఉంటే ప్రస్తుతం రూ.1.04 కోట్లు సమకూరేది. అంటే 104 రెట్లు వృద్ధి చెందేది. వార్షికంగా 22.57 శాతం చొప్పున కాంపౌండింగ్ రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో రిస్క్ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో ఈ రిస్క్‌ను మించి రాబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌పై దృష్టి ప్రస్తుతం ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ పథకం నిర్వహణలో రూ.14,571 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. 96.2 శాతం ఈక్విటీల్లో, డెట్ సాధనాల్లో 3.5 శాతం చొప్పున పెట్టుబడులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతానికి 65 స్టాక్స్‌ను నిర్వహిస్తోంది. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 68 శాతం, మిడ్‌క్యాప్‌లో 25 శాతం, స్మాల్‌క్యాప్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26 శాతం పెట్టుబడులు ఈ విభాగంలోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీల్లో 14 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 13 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. ఆయా రంగాల్లో దిగ్గజ కంపెనీలు, బలమైన యాజమాన్యాలు, కార్పొరేట్ పాలనలో పారదర్శకత, బలమైన బ్యాలన్స్ షీట్ ఇటువంటి అంశాల ఆధారంగా కంపెనీలను ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసుకుంటారు. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంకు 8.77 ఇన్ఫోసిస్ 8.46 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 7.05 డాక్టర్ రెడ్డీస్ 6.19 భారతీ ఎయిర్టెల్ 4.35 హెచ్‌సీఎల్ టెక్ 3.66 సన్‌ఫార్మా 2.75 బజాజ్ ఫైనాన్స్ 2.45 కోటక్ బ్యాంకు 2.24 ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ 2.22 -
స్టాక్స్ వ్యూ
ప్రస్తుత ధర: రూ.756 టార్గెట్ ధర: రూ.1,057 ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం నాలుగు విభాగాల్లో–వీఎస్ఎఫ్, సిమెంట్, రసాయనాలు, టెక్స్‌టైల్స్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటిల్లో వీఎస్ఎఫ్, సిమెంట్ కీలక విభాగాలు. ఈ కంపెనీ మొత్తం ఆదాయం, నిర్వహణ లాభాల్లో ఈ రెండు విభాగాల వాటా దాదాపు 90 శాతం. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. వీఎస్ఎఫ్, కాస్టిక్ సోడా ధరలు అంతర్జాతీయంగా బలహీనంగా ఉండటంతో నిర్వహణ లాభం(స్టాండ్అలోన్) అంచనాల మేరకు పెరగలేదు. వీఎస్ఎఫ్(విస్కోస్ స్టేపుల్ ఫైబర్–నూలు లాగానే ఉండే బయోడిగ్రేడబుల్ ఫైబర్. దుస్తులు, హోమ్ టెక్స్టైల్స్, డ్రెస్ మెటీరియల్, లో దుస్తుల తయారీలో దీనిని వినియోగిస్తారు) కు సంబంధించి ఉత్పత్తి సామర్థ్యం వంద శాతాన్ని వినియోగించుకున్నా, అమ్మకాలు 3 శాతమే పెరిగాయి. డిమాండ్ బలహీనంగా ఉండటం, దిగుమతులు పెరగడంతో కెమికల్స్ విభాగం పనితీరు అంచనాలను అందుకోలేకపోయింది. అమ్మకాలు 7 శాతం తగ్గగా, మార్జిన్లు 8 శాతం తగ్గి 20 శాతానికే పరిమితమైంది. దేశంలోనే అతి పెద్ద సిమెంట్ కంపెనీ అయిన అ్రల్టాటెక్ సిమెంట్‌లో 57.3 శాతం వాటా ఉండటం, స్టాండ్అలోన్ వ్యాపారాలు నిలకడైన వృద్ధిని సాధిస్తుండటం, వీఎస్ఎఫ్ వ్యాపారంలో దాదాపు గుత్తాధిపత్యం ఉండటం, వీఎస్ఎఫ్, రసాయనాల విభాగాల ఉత్పత్తి సామర్థ్యాలు పెరుగుతుండటం, ఏబీ క్యాపిటల్, ఇతర కంపెనీల్లో వాటాలుండటం... సానుకూలాంశాలు. మరో గ్రూప్ కంపెనీ వొడాఫోన్ ఐడియా రుణ భారం భారీగా ఉండటం, (ఈ రుణానికి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఎలాంటి కార్పొరేట్ గ్యారంటీని ఇవ్వకపోవడంతో ఇది పెద్ద ప్రతికూలాంశం కాబోదు), సిమెంట్, వీఎస్ఎఫ్ ధరలు తగ్గే అవకాశాలు, వీఎస్‌ఎఫ్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు పెరిగే అవకాశాలు.... ప్రతికూలాంశాలు. బాటా ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,736 టార్గెట్ ధర: రూ.1,955 ఎందుకంటే: బాటా ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థికఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. మందగమన నేపథ్యంలో కూడా ఈ కంపెనీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.722 కోట్లకు పెరిగింది. ప్రీమియమ్(ఖరీదైన) ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుండటం, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా స్థూల మార్జిన్లు 60 బేసిస్ పాయింట్లు పెరిగి 54.4 శాతానికి, నిర్వహణ లాభ మార్జిన్ అర శాతం పెరిగి 13.5 శాతానికి పెరిగాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా నికర లాభం 27 శాతం ఎగసి రూ.71 కోట్లకు పెరిగింది. కొత్త ట్రెండీ కలెక్షన్లను అందుబాటులోకి తెస్తుండటం, మార్కెటింగ్ వ్యయాలు పెంచుతుండటం, ప్రస్తుత స్టోర్ మోడళ్లను రీ డిజైనింగ్ చేయడం తదితర చర్యల కారణంగా ఈ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ‘మాస్’ నుంచి ‘ప్రీమియమ్’కు మారుతోంది. ఫ్రాంచైజీ స్టోర్స్‌తో కలుపుకొని దేశవ్యాప్తంగా 1,420 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. ఐదేళ్లలో 500 ఫ్రాంచైజీ స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు, యువత కేటగిరీలో కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుండటం, ప్రీమియమ్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుండటం, ప్రస్తుతమున్న స్టోర్లను నవీకరిస్తుండటం, ప్రకటనల కోసం అధికంగానే ఖర్చు చేస్తుండటం, స్థూల లాభం మెరుగుపడే అవకాశాలుండటం, ఎలాంటి రుణ భారం లేకపోవడం, రూ.800 కోట్ల మేర నగదు నిల్వలు ఉండటం....సానుకూలాంశాలు. రెండేళ్లలో ఆదాయం 11 శాతం, నికర లాభం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. -
వాల్‌మార్ట్, రిలయన్స్‌కు ప్రపంచ కుబేరుడు చెక్
న్యూఢిల్లీ : ప్రపంచంలో అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ అమెజాన్, రిలయన్స్ రిటైల్, వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్‌లకు చెక్పెట్టబోతుంది. వాటిపై పోటీకి ఆదిత్య బిర్లా గ్రూప్‌ను టార్గెట్ చేసింది. ఆదిత్య బిర్లాకు చెందిన రిటైల్ స్టోర్ మోర్లో వాటాను కొనుగోలు చేసేందుకు అమెజాన్ సిద్ధమైంది. ఫుడ్, గ్రోసరీ సూపర్‌మార్కెట్ మోర్‌ను కొనుగోలు చేసేందుకు గోల్డ్ మ్యాన్ సాచ్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సమర క్యాపిటల్‌తో కన్సోర్టియం ఏర్పాటు చేస్తోంది. మోర్లో వాటాను కొనుగోలు చేసే డీల్ రూ.4500 కోట్ల నుంచి రూ.5000 కోట్ల మధ్యలో ఉంటుందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. ఇప్పటికే సమర, ఆదిత్య బిర్లా రిటైల్ లిమిటెడ్ ఈ ఎక్స్‌క్లూజివ్ అగ్రిమెంట్‌పై జూన్‌లోనే సంతకాలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల చివరిలో లేదా వచ్చే నెలలో దీనిపై తుది ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమర అనేది దేశీయ ఫండ్. ఈ నిధి సంస్థ గోల్డ్‌మ్యాన్ సాచ్చ్, అమెజాన్‌ను కలిసినట్టు కూడా వెల్లడైంది. ఈ మూడు కలిసి ప్రత్యేక కంపెనీని లేదా ప్రత్యేక ప్రయోజన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాయి. దీనిలో వ్యూహాత్మక భాగస్వామ్యదారిగా 49 శాతం వాటాను దక్కించుకోవాలని అమెజాన్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇండియన్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ చట్టాల ప్రకారం, విదేశీ కంపెనీలు మల్టి బ్రాండ్ రిటైలర్లలో కేవలం 49 శాతం వాటాను మాత్రమే కలిగి ఉండాలి. క్యాష్ అండ్ క్యారీ రిటైలింగ్‌లో సంస్థలను ఏర్పాటు చేస్తూ.. 100 శాతం విదేశీ యజమాన్యాన్ని అనుమతిస్తున్నాయి. ఈ ఫ్రాంచైజీలకు దేశీయ గ్రూప్‌లు, సంస్థలు ముందుండి నడిపిస్తుంటాయి. గతేడాదిలోనే అమెజాన్, షాపర్స్ స్టాప్‌లో 5 శాతం వాటాను దక్కించుకుంది. అమెరికాలో కూడా హోల్ ఫుడ్స్ అనే సంస్థను అమెజన్ 13.7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. -
అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంట్ ప్లాంట్లు
* డీల్ విలువ దాదాపు రూ. 17,000 కోట్లు.. * సిమెంట్ రంగంలో అతిపెద్ద ఒప్పందంగా రికార్డు న్యూఢిల్లీ: దేశీ సిమెంట్ పరిశ్రమలో అతిపెద్ద డీల్ సాకారమైంది. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్.. జైప్రకాశ్(జేపీ) గ్రూపునకు చెందిన సిమెంట్ ప్లాంట్లను చేజిక్కించుకుంది. ఇందుకోసం దాదాపు రూ.17,000 కోట్లు చెల్లించనున్నామని.. ఈ మేరకు జేపీ అసోసియేట్స్‌తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు అల్ట్రాటెక్ సిమెంట్ ఆదివారం ప్రకటించింది. తాము కొనుగోలు చేస్తున్న సిమెంట్ ప్లాంట్లు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఉన్నాయని పేర్కొంది. వీటి వార్షిక ఉత్పాదక సామర్థ్యం 22.4 మిలియన్ టన్నులు(ఎంటీపీఏ). ఒప్పందం ఇలా... డీల్‌లో భాగంగా ఈ ప్లాంట్ల విలువను రూ.16,500 కోట్లుగా లెక్కించామని అల్ట్రాటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.470 కోట్ల పెట్టుబడితో మరో 4 ఎంటీపీఏ సామర్థ్యంగల ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించింది. వీటికోసం దేశీయంగా అదేవిధంగా విదేశీ సంస్థలు కూడా రేసులో ఉన్నప్పటికీ.. చివరికి తాము దక్కించుకున్నట్లు పేర్కొంది. సాత్నా, తూర్పు యూపీ, హిమాచల్‌ప్రదేశ్, కోస్తాంధ్రల్లో ఈ డీల్ వల్ల అల్ట్రాటెక్‌కు కొత్త మార్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ప్రతిపాదిత లావాదేవీ పూర్తయితే తమ మొత్తం వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 90.7 ఎంటీపీఏలకు(ప్రస్తుతం 68.3 ఎంటీపీఏ) పెరగనుందని అల్ట్రాటెక్ పేర్కొంది. నియంత్రణపరమైన అనుమతులకు లోబడి డీల్ పూర్తవుతుందని వెల్లడించింది. కాగా, గతంలో మధ్య ప్రదేశ్‌లోని రెండు సిమెంట్ ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు జేపీ అసోసియేట్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం.. ఈ తాజా ఎంఓయూతో రద్దవుతుందని పేర్కొంది. రుణ భారం తగ్గించుకోవడానికే... భారీగా ఉన్న రుణ భారాన్ని తగ్గించుకొని, బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరుచుకోవడం కోసమే తాము ఈ అమ్మకాలను చేపడుతున్నట్లు జేపీ అసోసియేట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. సిమెంట్, విద్యుత్ వంటి సాంప్రదాయ రంగాల్లో పెట్టుబడులకు రుణాలు తీసుకున్న అన్ని కంపెనీలపై ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి కారణంగా తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడిందని తెలిపింది. టారిఫ్‌లు ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోవడం, సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోవడం కారణంగా విద్యుత్ రంగం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని వెల్లడించింది. ఇకపై తాము ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్, రియల్టీ ప్రాజెక్టులపై మరిం త దృష్టిసారించున్నట్లు జేపీ అసోసియేట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మనోజ్ గౌర్ వ్యాఖ్యానించారు. -
హిందాల్కో, జిందాల్ పవర్‌కు బొగ్గు బ్లాకులు
-
హిందాల్కో, జిందాల్ పవర్‌కు బొగ్గు బ్లాకులు
న్యూఢిల్లీ: బొగ్గు గనుల వేలంలో గురువారం జిందాల్ పవర్ రెండు, ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ ఒకటి చొప్పున బ్లాకులను దక్కించుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో గనులకు జిందాల్ పవర్ రూ. 1,679 కోట్లు, గెరె పామా బ్లాకు కోసం హిందాల్కో రూ. 14,858.9 కోట్లు వెచ్చించనున్నట్లు బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్.. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. గెరె పామా 4/5 బ్లాకులో 42.43 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. టన్నుకు రూ. 3,502 మేర బిడ్డింగ్ చేసి హిందాల్కో దీన్ని దక్కించుకున్నట్లు అనిల్ స్వరూప్ పేర్కొన్నారు. ఈ బ్లాకు కోసం దాదాపు 12 గంటల పాటు సాగిన బిడ్డింగ్‌లో హిందాల్కోతో పాటు అంబుజా సిమెంట్స్, బాల్కో, హిందాల్కో తదితర సంస్థలు పోటీపడ్డాయి. ప్రభుత్వం మొదటి విడతగా 19 బొగ్గు బ్లాకులు వేలానికి ఉంచగా ఇప్పటిదాకా 15 బ్లాకులను కంపెనీలు దక్కించుకున్నాయి. బిఛర్పూర్ గనికి బిడ్డింగ్ కొనసాగుతోంది. తొలి విడత ఫిబ్రవరి 22న ముగియనుంది. జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ, రిలయన్స్ సిమెంట్, సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్, జైప్రకాష్ అసోసియేట్స్, బాల్కొ తదితర సంస్థలు బొగ్గు గనులను దక్కించుకున్నాయి. బొగ్గు బ్లాకుల వేలం ద్వారా ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రూ. 50,000 కోట్ల పైచిలుకు ఆదాయం రాగలదని అంచనా.