
సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్‌తో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా హాజరు కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు బలభద్రపురం చేరుకుంటారు. కుమార మంగళం బిర్లాతో కలిసి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా ప్లాంట్‌ను సందర్శిస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
రేపు ఒంగోలులో పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 22వ తేదీ శుక్రవారం ఒంగోలులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment