శాన్ ఫ్రాన్సిస్కో: 74 ఏళ్ల భారత సంతతి వ్యక్తి తన కోడలిని తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. సదరు వ్యక్తి సితాల్ సింగ్ దోసాంజ్‌గా పోలీసులు గుర్తించారు. సౌత్‌శాన్ జోస్‌పార్కింగ్‌లోని వాల్‌మార్ట్ వద్ద ఆమె శవమై కనిపించిందని తెలిపారు. బాధితురాలు గురుప్రీత్ కౌర్ దోసంజ్‌గా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు సితాల్ సింగ్ విచారణలో ఆమె తన కొడుకు నుంచి విడాకులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తుండటంతో కోపంతో షూట్ చేసి చంపేశానని చెప్పాడు.
అంతేగాదు భాధితురాలు ఫోన్‌లో తన మామా తనను చంపడం కోసం వెతుకుతున్నాడంటూ భయపడినట్లు ఆమె మేనమామ పోలీసులకు చెప్పాడు. ఆమె తన ఆఫీస్‌లో విరామ సమయంలో బయటకు వచ్చి తనకు కాల్ చేసిందని, అదే సమయంలో తన మామా తన కారు వద్దకు వస్తున్నాడంటూ భయపడుతూ చెప్పిందని తెలిపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కాల్ డిస్ కనక్డ్ అయ్యిందని వివరించాడు. సుమారు ఐదు గంటల తర్వాత బాధితురాలి సహోద్యోగురాలు ఆమె తన కారులోనే చనిపోయి ఉన్నట్లు గుర్తించిందని తెలిపాడు.
గురుప్రీత్ ఆమె భర్త, మామ గారితో కలిసి ఫ్రెస్నోలో ఉంటోందని బాధితురాలి మేనమామ చెప్పాడు. ఐతే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు కూడా చెప్పాడు. ఈ మేరకు నిందితుడు సితాల్ సింగ్‌ని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఇంటి నుంచి క్యాలిబర్ బెరెట్టా పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసకున్నట్లు పేర్కొన్నారు. అలాగే బాధితురాలిని చివరిసారిగా ఆమె డ్రైవ్ చేస్తుంటే కలిసింది సితాల్ సింగ్ అని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని శాన్‌జోస్ జైలుకి తరలించినట్లు తెలిపారు. అతనిని నవంబర్14న కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు పోలీసులు.
(చదవండి: రావణుడి తలలు దహనం కాలేదని షోకాజ్ నోటీసులు, గుమస్తాపై వేటు)
Comments
Please login to add a commentAdd a comment