
రాజగంగు (ఫైల్)
సాక్షి, మోర్తాడ్(నిజామాబాద్): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని కోడలు తన అత్తకు ఉరివేసి హత్య కు పాల్పడిన ఘటన మండలంలోని సుంకెట్‌లో చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఘటన జరగగా, ఆదివారం అంత్యక్రియలు పూర్తిచేశారు. సోమవారం ఆలస్యంగా హత్యోదంతం వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును ము మ్మరం చేశారు. వివరాలు ఇలా.. సుంకెట్ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించగా, అతని కుమారుడు మధురెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఇంట్లో కృష్ణారెడ్డి భార్య రాజగంగు (55), ఆమె కోడలు సుజా త, మనుమడితో కలిసి ఉంటున్నారు.
సుజాతకు కొందరితో వివాహేతర సంబంధం ఏర్పడగా ఈ విషయంలో అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో రాజగంగు మృతిపై అనుమానం ఉ న్నట్లు మృతురాలి తల్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. రాజగంగు హత్యకు సుజాత ఒక్కరే కారణమా లేక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాజగంగు అంత్యక్రియలు పూర్తి కాగా అస్తికలు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment