న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే కొత్తగా 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,650 కోట్లు) సమీకరించింది. 12 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ప్రధాన వాటాదారు వాల్‌మార్ట్ ఈ మేరకు నిధులు సమకూర్చింది. సింగపూర్ నుంచి భారత్‌కు కార్యాలయాన్ని మార్చుకున్న నేపథ్యంలో ఫోన్‌పే 1 బిలియన్ డాలర్ల వరకూ మూలధనాన్ని సేకరించే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా అందిన నిధులతో ఇప్పటివరకూ 650 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5,360 కోట్లు) సమీకరించినట్లవుతుంది.
(ఇదీ చదవండి: బిస్లెరీతో చర్చలకు ‘టాటా’: అసలేమైంది?)
మిగతా పెట్టుబడులను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిధులను బీమా, వెల్త్ మేనేజ్‌మెంట్, రుణాలు, స్టాక్ బ్రోకింగ్ మొదలైన వ్యాపార విభాగాల వృద్ధికి ఉపయోగించుకోనుంది. గూగుల్ పే, పేటీఎంలతో ఫోన్‌పే పోటీ పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment