Stake
-
ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికం వాటా పెంపు
న్యూఢిల్లీ: ప్రమోటర్ భారతీ టెలికం.. మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌లో తాజాగా 1.2 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఆఫ్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఈ వాటాను సొంతం చేసుకున్నట్లు భారతీ ఎయిర్టెల్ పేర్కొంది.అయితే డీల్ విలువను వెల్లడించనప్పటికీ.. ఎయిర్టెల్ మార్కెట్ విలువ ప్రకా రం వాటా విలువ రూ. 11,680 కోట్లుగా అంచనా. కాగా.. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికం వాటా 40.33 శాతానికి చేరింది. మరోవైపు ఇండియన్ కాంటినెంట్ వాటా 3.31 శాతానికి పరిమితమైంది. భారతీ టెలికంలో సునీల్ భారతీ మిట్టల్ వాటా 50.56 శాతంకాగా.. సింగ్టెల్ 49.44% వాటాను కలిగి ఉంది.ఇదీ చదవండి: అంబానీ, మిట్టల్‌లకు షాక్.. మస్క్ వైపే కేంద్రం మొగ్గు! -
ఆర్బీఎల్ బ్యాంక్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్‌లో ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా హైడ్రా ట్రేడింగ్ 1.24 శాతం వాటాను విక్రయించింది. బ్యాంక్ పబ్లిక్ వాటాదారులలో ఒకటైన హైడ్రా షేరుకి రూ. 203 సగటు ధరలో 75.11 లక్షల షేర్లను అమ్మివేసింది. వీటి విలువ రూ. 152.5 కోట్లుకాగా.. క్రోనస్ మెర్కండైజ్ ఎల్ఎల్పీ కొనుగోలు చేసింది. 2024 జూన్‌కల్లా ఆర్బీఎల్లో హైడ్రా వాటా 1.25 శాతంగా నమోదైంది. సైయెంట్ డీఎల్ఎం, స్పైస్‌జెట్‌లో.. బీఎస్ఈ వివరాల ప్రకారం మరో లావాదేవీలో ప్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్ స్పైస్‌జెట్‌లో 0.66 శాతం వాటా(85 లక్షల షేర్లు)ను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 60 సగటు ధరలో వీటిని దాదాపు రూ. 51 కోట్లకు సొంతం చేసుకుంది. స్పైస్‌జెట్ షేర్ల విక్రయదారుల వివరాలు వెల్లడికాలేదు. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం మోర్గాన్ స్టాన్లీ సైయెంట్ డీఎల్ఎంలో 4.34 లక్షల షేర్లను విక్రయించింది. షేరుకి రూ. 667 సగటు ధరలో వీటిని రూ. 29 కోట్లకు అమ్మివేసింది. హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ 0.5 శాతం వాటాకు సమానమైన 4 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. దీంతో సైయెంట్ డీఎల్ఎంలో హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వాటా 4.79 శాతం నుంచి 5.29 శాతానికి బలపడింది. -
సెంట్రో గ్రూప్ చేతికి రష్యా బ్యాంక్ - 50 శాతం వాటా కొనుగోలు
ముంబై: ఒక రష్యన్ బ్యాంకులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్ సంస్థ సెంట్రో గ్రూప్ తాజాగా పేర్కొంది. సోవియట్ శకం ముగిసిన తదుపరి ఏర్పాటైన బ్యాంక్‌లో 50.001 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. 29ఏళ్ల బ్యాంకును దక్కించుకోవడం ద్వారా రుపీ–రూబుల్ వాణిజ్యానికి తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. భారత్‌తో వాణిజ్యం, లావాదేవీలు పుంజుకుంటున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య లావాదేవీలను సులభతరం చేసే లక్ష్యంతో ఉన్నట్లు సెంట్రో గ్రూప్ పేర్కొంది. రష్యాకు ప్రాధాన్యతగల భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తున్నట్లు తెలియజేసింది. పరస్పర నోస్ట్రో, వోస్త్రో ఖాతాలకు వీలుగా భారత బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలతో జత కట్టే యోచనలో ఉన్నట్లు సెంట్రో గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ నవీన్ రావు వివరించారు. బ్రోకర్ లైసెన్స్, రష్యన్ రిటైల్ ఇన్వెస్టర్ లక్ష్యంగా ఎఫ్‌పీఐ లైసెన్స్ ద్వారా భారత్‌లో పెట్టుబడులకు వీలు కల్పించడం తదితర చట్టబద్ధ విధానాల ద్వారా బ్యాంకు సర్వీసులను విస్తరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. రూబుల్, రూపాయి చెల్లింపులకు మద్దతివ్వడం ద్వారా రెండు దేశాల వ్యక్తులు పరస్పర సందర్శనకు సహకరించనున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా యూపీఐ, రూపే కార్డ్ తదితర చెల్లింపుల విధానాలకు వీలు కల్పించనున్నట్లు వివరించారు. -
పూర్తిగా అదానీ చేతికి మరో ప్రముఖ మీడియా సంస్థ..
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం రాఘవ్ బెహల్ నెలకొల్పిన డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియాలో (క్యూబీఎంఎల్) మిగతా 51 శాతం వాటాను వ్యాపార దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేయనుంది. తమ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ (ఏఎంఎన్ఎల్) ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. లావాదేవీ పూర్తయ్యాక ఏఎంఎన్ఎల్కు క్యూఎంఎల్ పూర్తి అనుబంధ సంస్థగా మారుతుందని పేర్కొంది. బీక్యూ ప్రైమ్ పేరిట మీడియా ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించే క్యూబీఎంఎల్‌లో ఏఎంఎన్ఎల్ గతంలో రూ. 48 కోట్లకు 49% వాటాలను కొనుగోలు చేసింది. గతంలో బ్లూమ్‌బెర్గ్ క్వింట్గా పిలిచే బీక్యూ ప్రైమ్‌ను యూఎస్ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ మీడియా, భారత్‌కు చెందిన క్వింటిలియన్ మీడియా సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. అయితే, బ్లూమ్‌బెర్గ్ గత ఏడాది మార్చిలో ఆ భాగస్వామ్యం నుంచి వైదొలిగింది. -
యాంటిఫిన్ వాటా కొనుగోలు.. రూ. 53,957 కోట్లకు చేరిన పేటీఎం వ్యాల్యూ
న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండు ఫిన్‌టెక్ దిగ్గజం.. వన్97 కమ్యూనికేషన్స్‌లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాటా పెరగనుంది. యాంట్‌ఫిన్(నెదర్లాండ్స్) హోల్డింగ్స్ నుంచి 10.3 శాతం వాటాను విజయ్ సొంతం చేసుకోనున్నట్లు పేటీఎం తాజాగా పేర్కొంది. ఇందుకు ఎలాంటి నగదు చెల్లింపు ఉండదని, ఆఫ్‌మార్కెట్ లావాదేవీ ద్వారా వాటా బదిలీ ఉంటుందని తెలియజేసింది. అయితే ఈ వాటా ఎకనమిక్ రైట్స్ యాంట్‌ఫిన్ వద్దనే కొనసాగుతాయని వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా విదేశీ సొంత సంస్థ రెజిలియంట్ అసెట్ మేనేజ్మెంట్ బీవీ ద్వారా వాటాను శర్మ కొనుగోలు చేయనున్నట్లు వివరించింది. దీనికి బదులుగా మార్పిడికి వీలయ్యే(ఆప్షనల్లీ కన్వర్టిబుల్) డిబెంచర్లను యాంట్‌ఫిన్‌కు రెజిలియంట్ జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ లావాదేవీ కారణంగా కంపెనీ యాజమాన్య నియంత్రణలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోవని స్పష్టం చేసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ లావాదేవీతో పేటీఎంలో శర్మ వాటా 19.42 శాతానికి చేరనుంది. వెరసి కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా నిలవనున్నారు. మరోపక్క యాంట్‌ఫిన్ వాటా 23.79 శాతం నుంచి 13.5 శాతానికి తగ్గనున్నట్లు తెలుస్తోంది. కాగా.. పేటీఎం బోర్డులో యాంట్‌ఫిన్ నామినీ ఉండబోరు. యాంట్‌ఫిన్.. చైనా దిగ్గజం యాంట్ గ్రూప్ అనుబంధ కంపెనీ అన్న సంగతి తెలిసిందే. షేరు జూమ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాటా పెరగనున్న వార్తల నేపథ్యంలో ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం కౌంటర్లో లావాదేవీలు ఊపందుకున్నాయి. షేరు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 7 శాతం జంప్‌చేసి రూ. 851 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 12 శాతం దూసుకెళ్లి రూ. 888కు చేరింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,511 కోట్లు ఎగసి రూ. 53,957 కోట్లను అధిగమించింది. -
వేదాంతా చేతికి ట్విన్ స్టార్ బిజ్
న్యూఢిల్లీ: సహచర సంస్థ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ లిమిటెడ్ (టీఎస్‌టీఎల్) నుంచి సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్‌లను సొంతం చేసుకోనున్నట్లు వేదాంతా లిమిటెడ్ వెల్లడించింది. తద్వారా సమీకృత సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్‌లు కలిగిన తొలి కంపెనీగా వేదాంతా ఆవిర్భవించనుంది. వేదాంతాకు అల్టిమేట్ హోల్డింగ్ కంపెనీ అయిన టీఎస్‌టీఎల్.. వోల్కన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పూర్తి అనుబంధ సంస్థకావడం గమనార్హం! కాగా.. షేర్ల బదిలీ ద్వారా టీఎస్‌టీఎల్ సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్ యూనిట్లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వేదాంతా వెల్లడించింది. దీంతో వేదాంతా డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోకు సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ బిజినెస్ జత కలవనున్నాయి. -
శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి పిరమల్ ఔట్
ముంబై: యూఎస్ పీఈ దిగ్గజం టీపీజీ తదుపరి తాజాగా శ్రీరామ్ ఫైనాన్స్‌లో పిరమల్ ఎంటర్ప్రైజెస్ వాటా విక్రయాన్ని చేపట్టింది. ఓపెన్ మార్కెట్ ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్‌లో గల మొత్తం 8.34 శాతం వాటాను పిరమల్ విక్రయించింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంఎఫ్, కొటక్ మహీంద్రా ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్, బ్లాక్‌రాక్, బీఎన్పీ పరిబాస్, సొసైటీ జనరాలి తదితర సంస్థలకు 3.12 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది. బ్లాక్‌డీల్స్ ద్వారా రూ. 1,545 ధరలో రూ. 4,824 కోట్లకు వాటాను ఆఫర్ చేసింది. సోమవారం శ్రీరామ్ ఫైనాన్స్‌లో 2.65% వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా రూ. 1,390 కోట్లకు టీపీజీ విక్రయించిన సంగతి తెలిసిందే. ఎంఎఫ్‌లు, సంస్థాగత ఇన్వెస్టర్లు వీటిని కొనుగోలు చేశాయి. కాగా.. బ్లాక్‌డీల్ వా ర్తల ప్రభావంతో బుధవారం ఎన్ఎస్ఈలో శ్రీరామ్ ఫైనా న్స్ షేరు 11.3% దూసుకెళ్లి రూ. 1,736 వద్ద నిలిచింది. ఇక మంగళవారం 6% జంప్‌చేసి రూ. 838కు చేరి న పిరమల్ ఎంటర్ప్రైజెస్ బుధవారం మరింత అధికంగా 14.2% దూసుకెళ్లి రూ.958 వద్ద ముగిసింది. పునర్వ్యవస్థీకరణతో శ్రీరామ్ గ్రూప్ చేపట్టిన పునర్వ్యవస్థీకరణ తదుపరి పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు గ్రూప్‌లోని పలు కంపెనీలలో షేర్లు లభించాయి. ఈ బాటలో శ్రీరామ్ ఫైనాన్స్‌లో 8.34 శాతం వాటాను పొందగా.. శ్రీరామ్ జీఐ హోల్డింగ్స్, ఎల్ఐ హోల్డింగ్స్, ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్‌లోనూ 20 శాతం చొప్పున వాటాలు లభించాయి. దీంతో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 13.33 శాతం, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 14.91 శాతం వాటాను సొంతం చేసుకుంది. -
రిలయన్స్ రిటైల్ చేతికి లోటస్ చాకొలెట్లు
న్యూఢిల్లీ: చాకొలెట్లు, కోకోవా ప్రొడక్టుల కంపెనీ లోటస్ చాకొలెట్స్‌లో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ తాజాగా పేర్కొంది. 51 శాతం వాటా కొనుగోలుని తాజాగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ లోటస్ చాకొలెట్స్‌లో నియంత్రిత వాటా కొనుగోలు చేయనున్నట్లు గతేడాది డిసెంబర్లోనే ప్రకటించింది. ఈ బాటలో అనుబంధ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ద్వారా ఈ నెల 24కల్లా లోటస్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు తాజాగా తెలియజేసింది. షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రకారం లోటస్‌లో మొత్తం 77 శాతం వాటాను రిలయన్స్ కన్జూమర్ కొనుగోలు చేయనుంది. ప్రమోటర్లు ప్రకాష్ పి.పాయ్, అనంత్ పి.పాయ్ నుంచి 51 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇందుకు షేరుకి రూ. 113 చొప్పున రూ. 74 కోట్లు వెచ్చించింది. సెబీ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఇదీ చదవండి: 5,000 మందికి రిలయన్స్ చేయూత.. ఒక్కొక్కరికీ రూ.2 లక్షల వరకు.. -
యూనికెమ్ ల్యాబొరేటరీస్‌లో ఇప్కా ల్యాబ్స్‌కు 33.38% వాటా!
న్యూఢిల్లీ: ఔషధ రంగంలో ఉన్న ఇప్కా ల్యాబొరేటరీస్ తాజాగా యూనికెమ్ ల్యాబొరేటరీస్‌లో 33.38 శాతం వాటా కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ.1,034 కోట్లు. యూనికెమ్ ప్రమోటర్ నుంచి 2,35,01,440 షేర్లను ఒక్కొక్కటి రూ.440 చొప్పున ఇప్కా దక్కించుకుంటోంది. అలాగే యూనికెమ్లో పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి మరో 26 శాతం వరకు వాటాలను ఒక్కో షేరుకు రూ.440 చెల్లించి కొనుగోలు చేసేందుకు ఇప్కా ఓపెన్ ఆఫర్ ఇవ్వనుంది. ఎంచుకున్న వృద్ధి మార్కెట్లలో కంపెనీ పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడానికి తాము నిర్ధేశించుకున్న వ్యూహానికి అనుగుణంగా ఈ డీల్ ఉందని ఇప్కా ల్యాబొరేటరీస్ ప్రమోటర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రేమ్‌చంద్ గోధా ఈ సందర్భంగా తెలిపారు. 1949లో ఇప్కా ప్రారంభం అయింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఎగుమతుల వాటా 50 శాతం. ఫినిష్డ్ డోసెజెస్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను తయారు చేస్తోంది. -
ఎంజీ మోటార్లో జేఎస్డబ్ల్యూకి వాటా!
న్యూఢిల్లీ: ఆటోరంగ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియాలో వాటా కొనుగోలుకి డైవర్సిఫైడ్ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బీవైడీ ఇండియాలోనూ వాటాను సొంతం చేసుకునేందుకు స్టీల్ నుంచి స్పోర్ట్ వరకూ విభిన్న బిజినెస్‌లు కలిగిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అవకాశాలను అన్వేషిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గ్రూప్ స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఉత్సాహంగా చర్చిస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎఫ్‌వో శేషగిరి రావు పేర్కొన్న సంగతి తెలిసిందే. వెరసి ఫోర్ వీలర్స్ తయారీపై గ్రూప్ దృష్టి సారించినట్లు వెల్లడించారు. తద్వారా మరిన్ని రంగాలలోకి గ్రూప్ విస్తరించనున్నట్లు తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం అటు ఎంజీ మోటార్ ఇండియా, ఇటు బీవైడీ ఇండియాలతో వాటా కొనుగోలు నిమిత్తం ప్రాథమిక చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశాలపై స్పందించడానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ప్రతినిధి నిరాకరించడం గమనార్హం! మరోపక్క కంపెనీ విధానాల ప్రకారం ఇలాంటి అంచనాలపై స్పందించలేమంటూ ఎంజీ మోటార్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. -
వాల్‌మార్ట్ భారీ పెట్టుబడులు: ఫోన్‌పే రూ. 1,650 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే కొత్తగా 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,650 కోట్లు) సమీకరించింది. 12 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ప్రధాన వాటాదారు వాల్‌మార్ట్ ఈ మేరకు నిధులు సమకూర్చింది. సింగపూర్ నుంచి భారత్‌కు కార్యాలయాన్ని మార్చుకున్న నేపథ్యంలో ఫోన్‌పే 1 బిలియన్ డాలర్ల వరకూ మూలధనాన్ని సేకరించే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా అందిన నిధులతో ఇప్పటివరకూ 650 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5,360 కోట్లు) సమీకరించినట్లవుతుంది. (ఇదీ చదవండి: బిస్లెరీతో చర్చలకు ‘టాటా’: అసలేమైంది?) మిగతా పెట్టుబడులను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిధులను బీమా, వెల్త్ మేనేజ్మెంట్, రుణాలు, స్టాక్ బ్రోకింగ్ మొదలైన వ్యాపార విభాగాల వృద్ధికి ఉపయోగించుకోనుంది. గూగుల్ పే, పేటీఎంలతో ఫోన్‌పే పోటీ పడుతోంది. సరికొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్ -
అంబుజాలో అదానీ 4.5 శాతం వాటాల విక్రయం
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకోవడంపై అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా అంబుజా సిమెంట్స్‌లో 4.5 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని విలువ సుమారు 450 మిలియన్ డాలర్లుగా (దా దాపు రూ.3,380) ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఆర్థిక సంస్థలను కూడా సంప్రదించినట్లు పేర్కొన్నాయి. గతేడాది కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్‌లో అదానీకి 63 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం అదానీ గ్రూప్ రుణ భారం దాదాపు 24 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో గ్రూప్ కంపెనీల షేర్లు ఇటీవల భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అయితే, మళ్లీ కొన్ని క్రమంగా కోలుకుంటున్నాయి. -
వొడాఫోన్‌లో ప్రభుత్వానికి భారీ వాటా
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా వడ్డీ బకాయిల చెల్లింపుకింద ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఈక్విటీని జారీ చేయనుంది. సుమారు రూ. 16,133 కోట్లకుగాను రూ. 10 ముఖ విలువగల దాదాపు 1,613.32 కోట్ల షేర్లను కేటాయించనుంది. స్థూల సర్దుబాటు ఆదాయం(ఏజీఆర్) వాయిదా, స్పెక్ట్రమ్ వేలం చెల్లింపులపై వడ్డీ కింద వొడాఫోన్ ఐడియా ఈక్విటీ కేటాయింపునకు ప్రతిపాదించింది. ఇందుకు తాజాగా కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. వెరసి వడ్డీ.. ఈక్విటీగా మార్పు చెందనుంది. ఇది కంపెనీ మొత్తం విస్తారిత ఈక్విటీలో 33.44 శాతం వాటాకు సమానంకానుంది. కంపెనీ మొత్తం చెల్లించిన మూలధన రూ. 48,252 కోట్లను మించనుంది. కంపెనీలో ప్రమోటర్లు వొడాఫోన్ గ్రూప్ వాటా 32.29 శాతానికి, ఆదిత్య బిర్లా గ్రూప్ వాటా 18.07 శాతానికి చేరనున్నాయి. 2018లో విలీనం తదుపరి 43 కోట్ల మొబైల్ వినియోగదారులతో వొడాఫోన్ ఐడియా 35 శాతం మార్కెట్ వాటాను పొందింది. తద్వారా అతిపెద్ద కంపెనీగా నిలిచిన సంస్థ ప్రస్తుతం 24.3 కోట్లమంది కస్టమర్లతో 21.33 శాతానికి మార్కెట్ వాటాకు పరిమితమై మూడో ర్యాంకుకు చేరింది. ఈ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ షేరు బీఎస్ఈలో 4 శాతం పతనమై రూ. 7.94 వద్ద ముగిసింది. -
ఇండియన్ ఆయిల్ ట్యాంకింగ్‌లో ఏపీసెజ్‌కు వాటా, రూ.1,050 కోట్ల డీల్
ఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీ సెజ్) మరో కొనుగోలుకు తెరతీసింది. ఇండియన్ ఆయిల్ ట్యాంకింగ్ లిమిటెడ్‌లో 49.38 శాతం వాటాను రూ.1,050 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు బుధవారం ప్రకటించింది. ఇండియన్ ఆయిల్ ట్యాంకింగ్ సబ్సిడరీ అయిన ‘ఐవోటీ ఉత్కల్ ఎనర్జీ సర్వీసెస్’లో 10 శాతం వాటాను సైతం కొనుగోలు చేయడం ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నట్టు ఏపీ సెజ్ తెలిపింది. ఇందుకోసం తప్పనిసరిగా అమలు చేయాల్సిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. దేశంలోనే అతిపెద్ద రవాణా సదుపాయాల కల్పన కంపెనీగా అవతరించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఈ కొనుగోలు ఉన్నట్టు సంస్థ పేర్కొంది. లిక్విడ్ స్టోరేజీ (ద్రవరూప నిల్వ సదుపాయాలు)లో దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఉన్న ఇండియన్ ఆయిల్ ట్యాంకింగ్.. దేశవ్యాప్తంగా 2.4 మిలియన్ కిలో లీటర్ల చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ సామర్థ్యంలో ఆరు టెర్మినళ్లను కలిగి ఉన్నట్టు తెలిపింది. -
వీఐలో వాటా అప్పగించేందుకు రెడీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐ) లిమిటెడ్‌లో తమకున్న వాటాను ప్రభుత్వం లేదా ఏ ఇతర సంస్థకైనా అప్పగించేందుకు సంసిద్ధమంటూ కేఎం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. కంపెనీ కొనసాగింపునకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మేలు చేయగలదని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ జూన్ 7న కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గాబాకు బిర్లా లేఖ రాశారు. వీఐఎల్‌లో బిర్లాకు 27 శాతం వాటా ఉంది. అధికారిక సమాచారం ప్రకారం వీఐఎల్‌కున్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్) బకాయిలు(లయబిలిటీ) రూ. 58,254 కోట్లుకాగా.. వీటిలో రూ. 7,854 కోట్లకుపైగా చెల్లించింది. సుప్రీం నో: ఏజీఆర్ మదింపులో దిద్దుబాట్లకోసం భారతీ ఎయిర్‌టెల్‌సహా వీఐఎల్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ చుక్కెదురైంది. కాగా.. ఏజీఆర్ బకాయిలపై స్పష్టత లోపించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడులకు ముందుకురావడంలేదని లేఖలో బిర్లా పేర్కొన్నారు. స్పెక్ట్రమ్ చెల్లింపులపై అవసరమైనంత మారటోరియం విధింపు, ప్రధానంగా సర్వీసు వ్యయాలకు మించిన ఫ్లోర్ ధరల విధానాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భారీ రుణ భారం: రూ. 25,000 కోట్లు సమీకరించేందుకు 2020 సెప్టెంబర్‌లో బోర్డు వీఐఎల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే కంపెనీ నిధుల సమీకరణ చేపట్టలేకపోవడం గమనార్హం! లీజ్ లయబిలిటీలను మినహాయిస్తే కంపెనీకి స్థూలంగా రూ. 1,80,310 కోట్ల మేర రుణభారముంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ చెల్లింపులు రూ. 96,270 కోట్లుకాగా.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలు రూ. 23,080 కోట్లుగా నమోదయ్యాయి. -
ముంబై ఎయిర్‌పోర్టు : అదానీకే మెజారిటీ వాటా
సాక్షి,ముంబై: అంచనాలకు అనుగుణంగానే గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ముంబైలో భారతదేశపు రెండవ అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (మియాల్)లో 74 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ మేరకు అదానీ రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. ఈ లావాదేవీ కింద ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీవీకె గ్రూపులో 50.5 శాతం వాటాతోపాటు, మైనారిటీ భాగస్వాములైన ఎయిర్పోర్ట్ కంపెనీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (ఎసిఎస్ఎ) 10 శాతం, బిడ్వెస్ట్ 13.5 శాతంవాటా, మొత్తం 23.5 శాతం వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. మరో 26 శాతం ఎయిర్‌ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది. మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే ఈ వాటా అమ్మకాల ప్రయత్నాలను అడ్డుకోవాలని చూసిన ఇన్ఫ్రా దిగ్గజం జీవీకే కోర్టును ఆశ్రయించింది. కానీ రుణ భారంతో పాటు ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణతో చిక్కుల్లో పడ్డ జీవీకే నిధులను సమకూర్చుకోలేక వైఫల్యం చెందింది. కాగా పారిశ్రామిక దిగ్గజంగా వెలుగొందుతున్నఅదానీ గ్రూప్ ‘భారతదేశపు ప్రముఖ విమానాశ్రయ ఆపరేటర్’ కావాలనే ప్రణాళికలను బహిరంగంగా వెల్లడించిన అదానీ ఆవైపుగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే లక్నో, జైపూర్, గౌహతి, అహ్మదాబాద్, తిరువనంతపురం, మంగళూరుల్లో ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
అదానీ చేతికి ముంబై ఎయిర్పోర్ట్?
సాక్షి, ముంబై: అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) త్వరలోనే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏఎల్) లో భారీ వాటాను సొంతం చేసుకోనుంది. పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వహణ లీజును సొంతం చేసుకున్నఅదానీ తాజాగా మియాల్ లో 74 శాతం వాటాను దక్కించుకోనుంది. దీంతో దేశంలో జీఎంఆర్ గ్రూప్ తరువాత అదానీ గ్రూప్ అతిపెద్ద విమానాశ్రయాల ఆపరేటర్‌గా అవతరిస్తుంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో జీవీకే గ్రూప్‌నకు చెందిన 50.5 శాతం వాటాను అదానీ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఈ వారాంతంలో అదానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. అలాగే 23.5 శాతం ఇతర వాటాలను కూడా కొనుగోలు చేయనుంది. బిడ్వెస్ట్ కు చెందిన 13.5 శాతం వాటా, ఏసీఎస్ఏ 10 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. దీంతో ఎంఐఏఎల్‌లో అదానీ వాటా 74 శాతానికి చేరుతుంది. ఇందుకోసం అదానీ గ్రూప్ దాదాపు 15 వేల కోట్ల రూపాయలను చెల్లించనుంది. తద్వారా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ, బ్రాండింగ్ అదానీ గ్రూప్ చేతిలోనే ఉండనుంది. కాగా 50 సంవత్సరాల లీజుకు ఆరు విమానాశ్రయాలను అదానీకి అప్పగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని సంస్థ అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అదానీ గ్రూప్ ఈ 6 విమానాశ్రయాలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య రీతిలో నిర్వహించడానికి, అభివృద్ధికి హక్కులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
ఎయిర్‌టెల్‌తో అమెజాన్ జోడీ?
ముంబై: వ్యాపార సామ్రాజ్యంలో చరిత్ర సృష్టించిన రెండు దిగ్గజ కంపెనీలు త్వరలో జోడీ కట్టనున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ త్వరలోనే టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో రూ. 200కోట్ల డాలర్ల వాటాను విక్రయించనుంది. వీటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారతి ఎయిర్టెల్ దేశంలో రూ. 30కోట్ల వినియోగదారులతో మూడో టెలికాం సంస్థగా పేరొందిన విషయం తెలిసిందే. కాగా అమెజాన్, ఎయిర్టెల్ సంస్థలు తమ ఒప్పందాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. అయితే ఒప్పందాలకు సంబంధించిన ఊహాగానాలను కొందరు సంస్థ ప్రతినిధులు కొట్టిపారేశారు. మరోవైపు అమెజాన్, ఎయిర్‌టెల్‌కు సంబంధించిన ఒప్పందాలపై సంస్థ ఉన్నతాధికారులను ప్రశ్నించగా.. భవిష్యత్తులో జరిగే ఒప్పందాలపై తామిప్పుడే స్పందించలేమని తెలిపారు. కాగా ఒప్పందాల అంశంలో సంస్థ వర్గాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడంతో.. సరియైన సమాచారం కోసం మరికొంత సమయం వేచిచూడాల్సిందేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఎయిర్టెల్ పోటీ సంస్థ జియో పెట్టుబడులను ఆకర్శించడంలో దూసుకెళ్తుంది. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో అబుదాబికి చెందిన ముబాదాలా ఇన్వెస్ట్మెంట్ సంస్థ బిలియన్ (100 కోట్ల )డాలర్ల మెగా డీల్‌కు సానుకూలత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే మొబైల్ రంగంలో రిలయన్స్, ఎయిర్టెల్ తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెజాన్‌తో కలవడం వల్ల సంస్థ వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చదవండి: జియో దెబ్బ : భారీగా ఎగిసిన ఎయిర్టెల్ సంపద -
‘యస్’ వాటాల కొనుగోలుకు ఎస్బీఐ ఆమోదం
సాక్షి, ముంబై: యస్ సంక్షోభం, ఆర్బీఐ డ్రాప్ట్ ప్లాన్ల తదితర పరిణామాల నేపథ్యంలో ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. యస్ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు ఎస్బీఐ బోర్డు సూత్ర ప్రాయ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. బ్యాంక్ పునర్నిర్మాణ ముసాయిదా పథకం ఎస్బీఐ వద్దకు చేరిందని తెలిపారు. ఈ ముసాయిదా పథకంపై తమ పెట్టుబడి, న్యాయ బృందం కృషి చేస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన ఫైనల్ నిర్ణయాలను రెగ్యలేటరీలకు అందిస్తామని పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ.2450 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. అలాగే మూడు సంవత్సరాల కాలానికి తమ రూ.5500 కోట్లుగా (26 శాతం) వుంటుందని అంచనా వేస్తున్నామన్నారు. పెట్టుబడుల నిమిత్తం దేశీయ, అంతర్జాతీయంగా 23 మంది పెట్టుబడిదారులు తమను సంప్రదించారని ఎస్బీఐ చైర్మన్ చెప్పారు. తమ ప్రతిపాదనలకు మార్చి 9వ తేదీ వరకు సమయం ఉందని ఆ లోపు ఆర్బీఐ ముందు ఉంచుతామని చైర్మన్ చెప్పారు. 30 రోజుల గడువు లోపలే యస్ బ్యాంకును రక్షించే పథకాన్ని సిద్ధం చేస్తామని, ఇందుకు 24 గంటలూ పని చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకులో నగదు పూర్తి భద్రంగా వుంటుందని యస్ బ్యాంకు కస్టమర్లు, డిపాజిట్‌దారులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ హామీ ఇచ్చినవిషయాన్ని ఆయన మరో సారి గుర్తు చేశారు. అలాగే ఎస్బీఐ వాటాదారులు, వినియోగదారులపై తాజా పరిణామాల ప్రభావం వుండబోదమని ఆయన స్పష్టం చేశారు. చదవండి : ‘యస్’ సంక్షోభం : రాణా కపూర్‌కు లుక్ అవుట్ నోటీసు -
వాటా కొనుగోలు : యస్ బ్యాంకుకు ఊరట
సాక్షి, ముంబై: సంక్షోభంలో పడిన ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకుకు ఊరట లభించనుంది. యస్ బ్యాంకులో వాటాను కొనుగోలు చేసే కన్సార్షియంకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ నాయకత్వం వహించనుందని బ్లూం బర్గ్ నివేదించింది. దీనికి భారత ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిందని పేర్కొంది. దీంతో గురువారం నాటి మార్కెట్లో యస్ బ్యాంకు షేర్లు 29 శాతం ర్యాలీ అయ్యాయి. యస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేసేందుకు ఒక కన్సార్షియం ఏర్పాటుకు ఆమోదం లభించిందని కన్సార్షియంలో సభ్యులను ఎంపిక చేసేందుకు కూడా ఎస్బీఐ గ్రీన్ సిగ్నల్ లభించిందన్న వార్తలు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అటు యస్ బ్యాంకు కానీ, ఇటు ఎస్బీఐ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. మరోవైపు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కనీసం ఒక నెల ఆలస్యంగా ప్రకటించనున్నామని యస్ బ్యాంకు ఫిబ్రవరిలో రెగ్యులేటరీకిచ్చిన సమాచారంలో తెలిపింది. కాగా బ్యాడ్ లోన్ల బెడదకు తోడు, బోర్డులో ఏర్పడ్డ విభేదాలతో యస్ బ్యాంకు ఇటీవల కష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలోమూలధనాన్ని సమకూర్చుకోవడానికి చాలా కష్టపడుతోంది. దీంతో గత కొన్ని నెలలుగా ఈ స్టాక్‌గా భారీ పతనాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ఫ్లిప్‌కార్ట్‌లో 5.4 శాతం వాటా ఈ-బేకి
సాక్షి, ముంబై: భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఇ-కామర్స్ విభాగం లో పాగా వేస్తున్న గ్లోబల్ మల్టీ నేషనల్ ఈ కామర్స్కార్పొరేషన్ ఈ-బే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనంతో ఇండియా భారీగా లాభపడింది. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా వాటాను సొంతం చేసుకుంది. ఇటీవలి చేసుక్ను విలీనం ఒప్పందంలో భాగంగా ఈ వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఈ-బే భారత్‌లో తన వ్యాపార విస్తరణను మరింత వేగవంతం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లోఈ బే ఇండియా విలీనం ద్వారా 167 మిలియన్ల డాలర్లు( సుమారు. రూ.1083 కోట్లు) లాభం చేకూరిందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈబే తెలిపింది. తద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో 5.44 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు తెలిపింది. కాగా ఈ ఏడాది ఆగస్టులో పూర్తయిన విలీనంలో ఈక్విటీ స్టేక్ మార్పిడిలో భాగంగా.. ఈ-బే ఫ్లిప్‌కార్ట్‌లో 500 మిలియన్ డాలర్ల (రూ.3,242కోట్ల) ద్రవ్యపెట్టుబడులు పెట్టింది. దీంతో పాటు ఈ-బే ఇండియా బిజినెస్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించింది. తద్వారా ఫ్లిప్‌కార్ట్ గ్లోబల్ పేరుతో కొత్త పథకాన్ని ఇరు సంస్థలు లాంచ్ చేశాయి. దీంతో సుమారు 200 అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌కు అవకాశం లభించిన సంగతి తెలిసిందే. -
షాపర్స్ స్టాప్‌లో అమెజాన్ పెట్టుబడులు
సాక్షి, ముంబై: ప్రముఖ ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ ఇండియా, మరో రీటైల్ మేజర్ షాపర్స్ స్టాప్‌లో వాటాలను కొనుగోలు చేసింది. ఈ మేరకు షాపర్స్ స్టాప్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం అమెజాన్ రూ.179 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. షాపర్స్ స్టాప్‌లో 5 శాతం వాటాను అమెజాన్ కొనుగోలు చేయనుంది. రూ. 179.26 కోట్ల విలువైన వాటాను షాపర్స్ స్టాప్ అమెజాన్‌కు విక్రయించనుంది. ఈ నేపథ్యంలో ఎన్బీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ చెందిన షేర్లను ప్రిఫెరెన్షియల్ బేసిస్ కింద అమెజాన్‌కు కేటాయించనుంది. మరోవైపు అమెజాన్ ఇండియాలో తమ ఉత్పత్తులను విక్రయించడానికి వాణిజ్యపరమైన ఒప్పందం కుదుర్చుకున్నామని షాపర్స్ స్టాప్ ఇటీవల బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. దీంతో అధికారిక వెబ్సైట్లతో పాటు, ఇకపై అమెజాన్‌లో కూడా తమ ఉత్పత్తులు ప్రత్యేకంగా లభ్యంకానున్నాయని తెలిపింది. మొత్తం పోర్ట్‌ఫోలియో జాబితాలో 500 బ్రాండ్లు అమెజాన్ మార్కెట్ లో లభ్యం కానున్నాయి. అలాగే షాపర్స్ స్టాప్ లిమిటెడ్ కూడాతన ఫిజికల్ నెట్‌వర్క్‌లో ఫ్యాషన్ కోసం ప్రత్యేకమైన అమెజాన్ అనుభవ కేంద్రాలను సృష్టిస్తుందని ఫైలింగ్‌లో తెలిపింది. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న కస్టమర్ బేస్‌ను మరింత పెంచుకోవడానికి ఇద్దరు భాగస్వాములు ఒకరిబలాన్ని మరొకరు పెంచుకోనున్నామని అమెజాన్ ఇండియా ఫాషన్ బిజినెస్ హెడ్ అరుణ్ సర్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. -
ఎన్టీపీసీకి ఓఎఫ్ఎస్ షాక్!
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తిదారు ఎన్టీపీసీకి ఓఎఫ్ఎస్ షాక్ తగిలింది. ప్రభుత్వ డిజ్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. షేరుకు రూ .168 చొప్పున ప్రభుత్వం 7 వేల కోట్ల రూపాయల మేరకు 5 శాతం వాటాను విక్రయిస్తోంది. దీంతో ఎన్టీపీఎస్ షేరు 3 శాతానికి పైగా క్షీణించింది. ఓఎఫ్‌ఎస్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర సోమవారం ముగింపు రూ. 173తో పోలిస్తే 3 శాతం తక్కువ! ప్రప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం ఎన్టీపీసీలో ప్రభుత్వం 5 శాతం వాటాను విక్రయ ఆఫర్ ఫర్ సేల్ మొదలుకానుంది. షేరుకి రూ. 168 ధరలో 5 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 7,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఓవర్-సబ్ స్క్రిప్షన్ ద్వారా మరో 5 శాతం సాధించనున్నట్టు ఆ అధికారి తెలిపారు. కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ ఆఫర్ బుధవారం ఓపెన్ కానుంది. సంస్థాగత ఇన్వెస్టర్లు ఈరోజు బిడ్డింగ్ చేసుకునే అవకాశం. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.8,800 కోట్లను సాధించింది. ముఖ్యంగా ఎల్ అండ్ టిలో వాటాలు విక్రయం, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యుటిఐఐ), ఒక వాటాల పునర్ కొనుగోలు సహా ఆరు కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ నిధులను ఆర్జించింది. ప్రభుత్వ రంగాలలో వాటాల విక్రయాల ద్వారా 2017-18లో రూ. 72,500 కోట్ల లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మైనారిటీ వాటాల విక్రయాల నుండి 46,500 కోట్ల రూపాయలు, పంచవర్ష పెట్టుబడి సంస్థల జాబితా నుండి రూ. 15,000 కోట్లు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 11,000 కోట్లను సమకూర్చుకోనుంది. -
మాల్యా వాటాలను హీనెకెన్ కొనేస్తోందా?
న్యూఢిల్లీ: లిక్కర్‌కింగ్, రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త మార్కెట్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. బీరు తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమెటెడ్ లో విజయ్ మాల్యాకుచెందిన మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు డచ్ బ్రూవర్ హైనెకెన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. యునైటెడ్ బ్రూవరీస్లో విజయ్ మాల్య వాటాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనతొ రుణదాతలతో హీన్కెన్ సంప్రదించినట్టు సమాచారం. బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన మాల్యానుంచి రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు విశ్వ ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇది కీలక పరిణామమని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. హీనెకెన్ నిర్ణయం చాలా ముఖ్యమైనది, ఇది బ్యాంకులపై ఒత్తిడిని రేకెత్తిస్తుందని వ్యాఖ్యానించింది. హీనెకెన్, విజయ్ మాల్యా యూబిఎల్ కంపెనీలో ఉమ్మడి యజమానులుగా ఉన్నారు. మాల్యాకు 30శాతం వాటా వుండగా, హెన్‌కెన్ 43.4 శాతం వాటాకలిగి ఉంది. దీంతో మార్కెట్లో యూబీఎల్ షేర్లకు డిమాండ్ పుట్టింది. దాదాపు 6.23 శాతానికిపైగా లాభపడ్డాయి. మరోవైపు ఈ వార్తలతో స్టాక్ ఎక్సేంజ్ లు హెన్‌కెన్ సంస్థను వివరణ కోరింది. కాగా గత ఏడాది మార్చిలో ఇండియా నుంచి పారిపోయని మాల్యాను గత నెల ఏప్రిల్ 18న లండన్ లో స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు అటు ఆయన్ను భారత్‌కు రప్పించే ప్రయత్నాల్లో భాగంగా భారత ఈడీ, సీఐడి అధికారులు ప్రత్యేక బృందం ఇప్పటికే లండన్ చేరుకుంది. అక్కడి న్యాయవాదులతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. -
పేటీఎం వాటాను విక్రయించిన రిలయన్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ కాపిటల్ , పాపులర్ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం ద్వారా భారీ లాభాలను మూటగట్టుకుంది. అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ పేటీఎంలోని తన (దాదాపు 1 శాతం) వాటాను విక్రయించింది. చైనా కంపెనీ ఆలీబాబా గ్రూప్ కు రూ. 275 కోట్లకు పేటీఎం వాటాను అమ్మేసింది. ఈ విక్రయంతో భారీ లాభాలను రిలయన్స్ గ్రూప్ దక్కించుకుంది. ప్రపంచంలోని టాప్ ఈ-కామర్స్ సైట్లలో ఒకటైన పేటిఎంలో రిలయన్స్ గ్రూపునకు చెందిన ఫైనాన్షియల్ సంస్థ గతంలో రూ.10కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. తాజాగా ఈ వాటాను రూ.275కోట్లకు విక్రయించడం విశేషం. దీంతో ఇప్పటికే ఆలీబాబా ఒక వ్యూహాత్మక పెట్టుబడిదారుగా గాన్న పేటీఎం కంపెనీ విలువ 4 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే తన నాన్ కోర్ అసెట్స్ ను క్రమబద్ధీకరించే ప్రణాళికల్లో భాగంగా దాని యాజమాన్య పెట్టుబడులను తగ్గించుకోనున్నట్టు అంతకుముందు రిలయన్స్ కాపిటల్ తెలిపింది. గత ఏడాది డిసెంబర్ లో పేటీఎం స్థాపకుడు , సీఈవో విజయ్ శేఖర్ శర్మ మాతృ సంస్థ, వన్ 97 కమ్యూనికేషన్స్ లో 1 శాతం( రూ.325 కోట్ల) వాటాను విక్రయిచారు. కాగా ఈ పరిణామాలపై స్పందించడానికి రిలయన్స్, పేటిఎం ప్రతినిధులు నిరాకరించారు.