సాక్షి, ముంబై: భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఇ-కామర్స్ విభాగం లో పాగా వేస్తున్న గ్లోబల్ మల్టీ నేషనల్ ఈ కామర్స్‌కార్పొరేషన్ ఈ-బే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనంతో ఇండియా భారీగా లాభపడింది. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా వాటాను సొంతం చేసుకుంది. ఇటీవలి చేసుక్ను విలీనం ఒప్పందంలో భాగంగా ఈ వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఈ-బే భారత్‌లో తన వ్యాపార విస్తరణను మరింత వేగవంతం చేసింది.
ఫ్లిప్‌కార్ట్‌లోఈ బే ఇండియా విలీనం ద్వారా 167 మిలియన్ల డాలర్లు( సుమారు. రూ.1083 కోట్లు) లాభం చేకూరిందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈబే తెలిపింది. తద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో 5.44 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు తెలిపింది.
కాగా ఈ ఏడాది ఆగస్టులో పూర్తయిన విలీనంలో ఈక్విటీ స్టేక్ మార్పిడిలో భాగంగా.. ఈ-బే ఫ్లిప్‌కార్ట్‌లో 500 మిలియన్ డాలర్ల (రూ.3,242కోట్ల) ద్రవ్యపెట్టుబడులు పెట్టింది. దీంతో పాటు ఈ-బే ఇండియా బిజినెస్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించింది. తద్వారా ఫ్లిప్‌కార్ట్ గ్లోబల్ పేరుతో కొత్త పథకాన్ని ఇరు సంస్థలు లాంచ్ చేశాయి. దీంతో సుమారు 200 అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌కు అవకాశం లభించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment