![Reliance retail completes acquisition of 51 pc stake in Lotus Chocolate Company - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/26/reliance_lotus_chocolets.jpg.webp?itok=Ha0hovf8)
న్యూఢిల్లీ: చాకొలెట్లు, కోకోవా ప్రొడక్టుల కంపెనీ లోటస్ చాకొలెట్స్‌లో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ తాజాగా పేర్కొంది. 51 శాతం వాటా కొనుగోలుని తాజాగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ లోటస్ చాకొలెట్స్‌లో నియంత్రిత వాటా కొనుగోలు చేయనున్నట్లు గతేడాది డిసెంబర్‌లోనే ప్రకటించింది.
ఈ బాటలో అనుబంధ ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ద్వారా ఈ నెల 24కల్లా లోటస్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు తాజాగా తెలియజేసింది. షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రకారం లోటస్‌లో మొత్తం 77 శాతం వాటాను రిలయన్స్ కన్జూమర్ కొనుగోలు చేయనుంది. ప్రమోటర్లు ప్రకాష్ పి.పాయ్, అనంత్ పి.పాయ్ నుంచి 51 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇందుకు షేరుకి రూ. 113 చొప్పున రూ. 74 కోట్లు వెచ్చించింది. సెబీ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
ఇదీ చదవండి: 5,000 మందికి రిలయన్స్ చేయూత.. ఒక్కొక్కరికీ రూ.2 లక్షల వరకు..
Comments
Please login to add a commentAdd a comment