chocolate company
-
'మనం' చాక్లెట్ తిన్నామంటే.. మైమరిచిపోవాలంతే!
సాక్షి, సిటీబ్యూరో: మీకు చాక్లెట్లంటే ఇష్టమా..? అసలు చాక్లెట్లు చూస్తేనే నోరూరుతుందా..? డిఫరెంట్ చాక్లెట్లను టేస్ట్ చేయడం మీకు అలవాటా? అయితే మీరు తప్పకుండా నగరంలోని ‘మనం’ చాక్లెట్ కార్ఖానాను ఒక్కసారైనా సందర్శించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ దాదాపు 60కి పైగా వెరైటీ చాక్లెట్లు నోరూరిస్తుంటాయి. ఒకే దగ్గర పెరిగిన కోకో చెట్ల నుంచి తయారైన చాక్లెట్లను వీరు విక్రయిస్తున్నారు.టైమ్ మ్యాగజైన్ జాబితాలో చోటు..ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల’ జాబితాను ప్రచురించింది. ఆయా రంగాలతో పాటు ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచే 100 అద్భుతమైన ప్రదేశాలు, కంపెనీలను ఇందులో చేర్చింది. హోటళ్లు, క్రూజ్‌లు, రెస్టారెంట్స్, పర్యాటక స్థలాలు, మ్యూజియాలు, పార్క్‌లను గుర్తించింది. పలు మార్గాల్లో స్వదేశీ పదార్థాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు మనం చాక్లెట్ కార్ఖానా పనిచేస్తోందని కొనియాడింది.అంతర్జాతీయ గుర్తింపు..భారత్‌లో పండించిన కోకోతో చాక్లెట్ల తయారీకి ‘మనం చాక్లెట్’ ప్రసిద్ధి పొందింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఈ సంస్థ ఉత్పత్తులకు ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇక్కడ తయారైన చాక్లెట్లకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. 2023 ఆగస్టులో మనం చాక్లెట్ కార్ఖానాను ముప్పల చైతన్య స్థాపించారు. ఆల్మండ్ హౌజ్ మిఠాయి దుకాణం వీరి కుటుంబానికి చెందినది కావడం విశేషం.ఎన్నో రకాల వెరైటీలు.. డార్క్ చాక్లెట్లు, చాక్లెట్ ట్యాబ్లెట్స్, స్నాక్స్, ఒకే ప్రదేశంలో పండించినవి, అంతర్జాతీయంగా పండించిన కోకో నుంచి తయారైనవి, పాల మిశ్రమంతో చేసినవి ఇలా ఎన్నో రకాల వెరైటీ చాక్లెట్లు ఈ కార్ఖానాలో లభిస్తుంటాయి. పండ్లు, ప్లేన్, వీగన్ వంటి చాక్లెట్ల రకాలు కూడా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన పది రకాల చాక్లెట్లను అవార్డులు కూడా వరించాయి.వర్క్‌షాప్స్‌తో పిల్లలకు నేరి్పస్తూ..చాక్లెట్ల తయారీలో మనం చాక్లెట్ కార్ఖానా అప్పుడప్పుడూ వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటుంది. సొంతంగా క్లస్టర్లు, కేక్ పాప్స్ తయారు చేసే విషయంలో పిల్లలకు శిక్షణ కూడా ఇస్తుంటుంది. కొన్నిసార్లు అసలు చాక్లెట్లు ఎలా తయారు చేస్తారో తెలుసుకునేలా టూర్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. చాక్లెట్ కుకీస్, చాక్లెట్ ఇంక్లూజన్ స్లాబ్స్ తయారీలో 5–10 ఏళ్ల పిల్లలకు మెళకువలు నేర్పిస్తుంటారు.ఇవి చదవండి: అంతా స్మార్ట్.. ఆరోగ్యంపై ముందస్తు సమాచారం! -
సమయాన్ని చాక్లెట్‌గా మార్చుకున్నాడు! కోటీశ్వరుడయ్యాడు
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సామాన్యులు సైతం కోటీశ్వరులు కావచ్చని నిరూపించి చూపిస్తున్నాడు పదహారేళ్ల యువకుడు దిగ్విజయ్ సింగ్. అతడు సమయాన్ని చాక్లెట్‌గా మార్చుకున్నాడు! కరోనా కారణంగా ఇళ్లలోనే జైల్లోలా కష్టంగా గడిపిన రోజులవి. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా హఠాత్తుగా దొరికిన బోలెడంత సమయాన్ని ఏం చేయాలో అర్థంకాని అయోమయ పరిస్థితులు. ఉదయపూర్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దిగ్విజయ్ సింగ్ కూడా ఏమి తోచుబాటుగాని ఆ సమయంలో.. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నాడు. అనుకున్న వెంటనే యూట్యూబ్‌లో చాక్లెట్స్ తయారీ గురించి చూశాడు. చాక్లెట్స్ తయారీ సులభంగా ఉండడంతో ఇంట్లో తయారు చేశాడు. దిగ్విజయ్ చేసిన చాక్లెట్లు రుచిగా ఉన్నాయని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పడంతో మరిన్ని చాక్లెట్స్ తయారు చేసి అమ్మాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడు మహవీర్ సింగ్‌కు చెప్పడం, అతనికి ఆసక్తి ఉండడంతో ఇద్దరూ కలిసి చాక్లెట్లు తయారు చేద్దామని నిర్ణయించుకున్నారు. గిఫ్ట్‌బాక్స్‌ను చూసి... పదహారేళ్ల తన స్నేహితుడితో కలిసి యూట్యూబ్ సాయంతో చాక్లెట్స్, వివిధ రకాల డిజర్ట్లు తయారు చేసి స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంచేవాళ్లు. దీపావళికి దిగ్విజయ్ తండ్రి కారు కొన్నాడు. కారు షోరూం వాళ్లు కారుతోపాటు చాక్లెట్ బాక్స్‌ను గిప్ట్గా ఇచ్చారు. షోరూంలో కారు కొనే కస్టమర్లందరికీ చాక్లెట్ బాక్స్‌లు గిప్ట్గా ఇస్తున్నారని దిగ్విజయ్‌కి తెలిసింది. వెంటనే హోటల్, కార్షోరూం యజమానులను కలిసి కాంప్లిమెంటరీగా ఇచ్చేందుకు తాను ఇంట్లో తయారు చేసిన చాక్లెట్స్ ఇస్తానని చెప్పాడు. అందుకు వారు ఒప్పుకోవడంతో చాక్లెట్స్ తయారీ మొదలుపెట్టాడు. రెండేళ్లలో రెండుకోట్లు ఒక కార్ షోరూం వాళ్లు వెయ్యి చాక్లెట్స్ కావాలని 2021లో తొలి ఆర్డర్ ఇచ్చారు. అప్పుడే ‘సరామ్’అనే పేరుతో చాక్లెట్ విక్రయాలు ప్రారంభించాడు. చాక్లెట్స్ రుచిగా ఉండడంతో .. విక్రయాలు క్రమంగా పెరిగి ఏడాదిలోనే మంచి ఆదాయం వచ్చింది. దేశవ్యాప్తంగా రెండు టన్నులకు పైగా చాక్లెట్ విక్రయాలు జరిగాయి. దీంతో రెండేళ్లలోనే ‘సరామ్’ రెండు కోట్లను ఆర్జించింది. సరికొత్తగా... సాదా సీదాగా కాకుండా దేశంలో దొరికే రకరకాల పండ్లు, మసాలాలను ఉపయోగించి చాక్లెట్స్‌ను సరికొత్తగా తయారు చేసి విక్రయిస్తున్నాడు దిగ్విజయ్. కేరళ, తమిళనాడునుంచి కోకోపొడి, చాక్లెట్స్‌లో వాడే పండ్లను బాగా పండే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని నాణ్యమైన రుచికరమైన చాక్లెట్స్‌ను తయారు చేస్తున్నాడు. ఢిల్లీ, బెంగళూరు, ఉదయ్‌పూర్, జైపూర్లలో సరామ్ కస్టమర్లు చాలామంది ఉన్నారు. ఉదయ్‌పూర్, జైపూర్లలో స్టోర్లు, ఆఫ్లైనేగాక, ఆన్లైన్లో చాక్లెట్ విక్రయాలు జరుగుతున్నాయి. సమయాన్ని సక్రమంగా వినియోగిస్తే కోట్లు సంపాదించవచ్చుననడానికి దిగ్విజయ్ ఉదాహరణగా నిలుస్తున్నాడు. (చదవండి: కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే ) -
రిలయన్స్ రిటైల్ చేతికి లోటస్ చాకొలెట్లు
న్యూఢిల్లీ: చాకొలెట్లు, కోకోవా ప్రొడక్టుల కంపెనీ లోటస్ చాకొలెట్స్‌లో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ తాజాగా పేర్కొంది. 51 శాతం వాటా కొనుగోలుని తాజాగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ లోటస్ చాకొలెట్స్‌లో నియంత్రిత వాటా కొనుగోలు చేయనున్నట్లు గతేడాది డిసెంబర్లోనే ప్రకటించింది. ఈ బాటలో అనుబంధ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ద్వారా ఈ నెల 24కల్లా లోటస్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు తాజాగా తెలియజేసింది. షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రకారం లోటస్‌లో మొత్తం 77 శాతం వాటాను రిలయన్స్ కన్జూమర్ కొనుగోలు చేయనుంది. ప్రమోటర్లు ప్రకాష్ పి.పాయ్, అనంత్ పి.పాయ్ నుంచి 51 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇందుకు షేరుకి రూ. 113 చొప్పున రూ. 74 కోట్లు వెచ్చించింది. సెబీ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఇదీ చదవండి: 5,000 మందికి రిలయన్స్ చేయూత.. ఒక్కొక్కరికీ రూ.2 లక్షల వరకు.. -
రిలయన్స్ చేతికి లోటస్ చాకొలేట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చాకొలేట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన లోటస్ చాకొలేట్ కంపెనీలో రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ 51 శాతం వాటా తీసుకోనుంది. అలాగే మరో 26 శాతం వరకు వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నట్టు రిలయన్స్ గురువారం వెల్లడించింది. లోటస్ ప్రమోటర్లు ప్రకాశ్ పి పాయ్, అనంత్ పి పాయ్, ఇతరులతో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. 51 శాతం వాటాకు సమానమైన 65,48,935 షేర్లను ఒక్కొక్కటి రూ.113 చొప్పున మొత్తం రూ.74 కోట్లు చెల్లించి దక్కించుకోనున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్, లోటస్ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ.10 ముఖ విలువ కలిగిన 5,07,93,200 నాన్ క్యుములేటివ్ రెడీమేబుల్ ప్రిఫరెన్స్ షేర్లను సబ్‌స్క్రైబ్ చేసుకుంటాయి. వీటి ద్వారా వచ్చే నిధులను కంపెనీ వృద్ధికి వినియోగించనున్నారు. ప్రముఖ సినీ నటి టి.శారద, ఇంజనీర్ ఎన్.విజయరాఘవన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సమీపంలోని దౌలతాబాద్ వద్ద కోకో ప్రాసెసింగ్, చాకొలేట్ తయారీ కేంద్రం 1992లో ప్రారంభం అయింది. ఈ కంపెనీ 2008లో పజ్జొలానా గ్రూప్ పరమైంది. -
వావ్ అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్.. రుచి చూస్తే చాలు నెలకు రూ.6 లక్షలు!
చదివిన చదువుకు నచ్చిన ఉద్యోగం పొందేందుకు యువత అహర్నిశలు శ్రమిస్తుంటారు. అనుకున్నది సాధిస్తారు. అదే సమయంలో కొన్ని కంపెనీలు తమకు కావాల్సిన ఉద్యోగి కోసం అంతే శ్రమ పడుతుంటాయి. ఒక్కోసారి కొన్ని ఉద్యోగాలు భలే తమాషాగా ఉంటాయి. వీటికి కూడా జీతం ఇస్తారా అనిపిస్తుంటుంది. తాజాగా అమెరికాకు చెందిన ఓ సంస్థ అలాంటి జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంతకీ ఆ జాబ్ ఏంటో తెలుసా? ఆఫీస్‌లో కూర్చొని తినడమే. పైగా భారీ ఎత్తున శాలరీ పే చేసేందుకు సిద్ధమైంది. ఆ..ఏంటీ..తినేందుకు జాబ్.. పైగా అందుకు కళ్లు చెదిరిపోయే శాలరీ ఇస్తారా అని ఆశ్చర్యపోకండి. వివరాల్లోకి వెళితే..ఉత్తర అమెరికాలో అతిపెద్ద ఆన్లైన్ క్యాండీ రిటైలర్ కంపెనీ తమ సంస్థకి చీఫ్ కాండీ ఆఫీసర్ పోస్ట్ కోసం ఉద్యోగి కావాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు ఈ కంపెనీలో తయారయ్యే చాక్లెట్‌ను రుచి చూసి రేటింగ్ ఇస్తే చాలు. ఇందుకు అర్హతగా ఐదేళ్లు నిండిన వారెవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తూ చేసుకోవచ్చని తెలిపింది. ఎంపిక కాబడిన వారికి ఏడాదికి రూ. 1లక్ష డాలర్లు జీతం ఇస్తామని తెలిపింది. -
కల్తీ పదార్థాలపై ప్రభుత్వ చర్యలూ కల్తీనే..
-
అమెరికా విద్యార్థికి చాక్లెట్ కంపెనీ బంపర్ ఆఫర్
-
ఉద్యోగం పేరుతో అంధుడికి టోకరా
జీడిమెట్ల, న్యూస్‌లైన్: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన కన్సల్టెన్సీలను మనం చూశాం... అయితే, ఉద్యోగం పేరుతో ఓ అంధుడినీ మోసం చేశారు కొందరు ఘనులు. న్యాయం చేయమని బాధితుడు ఐదు రోజుల క్రితం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయిస్తే ఇదిగో.. అదిగో.. అంటూ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు. దీంతో బాధితుడు ఆదివారం ‘న్యూస్‌లైన్’ ను ఆశ్రయించి తన గోడు చెప్పుకున్నాడు. బాధితుడి కథనం ప్రకారం... అనంతపురం జిల్లా కమలానగర్‌కు చెందిన శేఖర్, సుబ్బలక్ష్మిల కుమారుడు లక్ష్మణ్ (18) పుట్టుకతోనే అంధుడు. అనంతపురంలోని ఆర్డీటీ అంధుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం బళ్లారికి వెళ్లగా, ఇతను స్వగ్రామంలో నానమ్మతో కలిసి ఉంటున్నాడు. చిత్తు కాగితాలు ఏరి నానమ్మ పోషిస్తుండటంతో తాను కూడా ఏదో ఒక ఉద్యోగం చేసి నాన్నమ్మకు ఆసరాగా ఉంటానని స్నేహితులకు చెప్పాడు. ‘చాక్లెట్ కంపెనీలో ఉద్యోగం, 18 వేల జీతం, భోజన వసతి కూడా కల్పిస్తాం’ అంటూ ఈనెల 10న ఓ పత్రికలో వచ్చిన ప్రకటను చూసి స్నేహితులు లక్ష్మణ్‌కు తెలిపారు. ప్రకటనలో ఉన్న నెంబర్‌కు లక్ష్మణ్ ఫోన్ చేసి.. ‘నేను అంధుడిని.. ఉద్యోగం ఇస్తారా?’ అని అడిగాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి ‘మీలాంటి వారికి కూడా ఉద్యోగాలున్నాయి. రూ.1000 కన్సల్టేషన్ ఫీజు నిమిత్తం ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ (నెం 044410100074130)లో జమ చేసి.. తర్వాత నేరుగా హైదరాబాద్ వచ్చి కలవండి’ అని చెప్పాడు. డబ్బు చెల్లించిన లక్ష్మణ్.. 15న నాంపల్లికి వచ్చి ఫోన్ చేయగా మరుసటి రోజు రమ్మని చెప్పారు. 16న సికింద్రాబాద్.. ఆపై జీడిమెట్లకు రమ్మని చెప్పారు. చివరకు కన్సల్టెన్సీ ఆఫీస్‌కు వెళ్లగా నువ్వు అంధుడివి నీకు ఉద్యోగం లేదని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన లక్ష్మణ్ స్థానికుల సహాయంతో జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సొంత ఊరుకు వెళ్లలేక ఐదు రోజులుగా తనకు న్యాయం చేయండంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తూ.. రాత్రి ఎక్కడో ఒక చోట తలదాచుకుంటున్నాడు. పోలీసుల తీరుతో విసుగు చెందిన బాధితుడు ఆదివారం ఉదయం ‘న్యూస్‌లైన్’ను ఆశ్రయించి తన గోడు చెప్పుకున్నాడు. పోలీసులు ఇతనికి న్యాయం చేస్తారని ఆశిద్దాం.