న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా హైడ్రా ట్రేడింగ్ 1.24 శాతం వాటాను విక్రయించింది. బ్యాంక్ పబ్లిక్ వాటాదారులలో ఒకటైన హైడ్రా షేరుకి రూ. 203 సగటు ధరలో 75.11 లక్షల షేర్లను అమ్మివేసింది. వీటి విలువ రూ. 152.5 కోట్లుకాగా.. క్రోనస్ మెర్కండైజ్ ఎల్‌ఎల్‌పీ కొనుగోలు చేసింది. 2024 జూన్‌కల్లా ఆర్‌బీఎల్‌లో హైడ్రా వాటా 1.25 శాతంగా నమోదైంది.
సైయెంట్ డీఎల్‌ఎం, స్పైస్‌జెట్‌లో..
బీఎస్‌ఈ వివరాల ప్రకారం మరో లావాదేవీలో ప్లూటస్ వెల్త్ మేనేజ్‌మెంట్ స్పైస్‌జెట్‌లో 0.66 శాతం వాటా(85 లక్షల షేర్లు)ను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 60 సగటు ధరలో వీటిని దాదాపు రూ. 51 కోట్లకు సొంతం చేసుకుంది. స్పైస్‌జెట్ షేర్ల విక్రయదారుల వివరాలు వెల్లడికాలేదు. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం మోర్గాన్ స్టాన్లీ సైయెంట్ డీఎల్‌ఎంలో 4.34 లక్షల షేర్లను విక్రయించింది. షేరుకి రూ. 667 సగటు ధరలో వీటిని రూ. 29 కోట్లకు అమ్మివేసింది. హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్ 0.5 శాతం వాటాకు సమానమైన 4 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. దీంతో సైయెంట్ డీఎల్‌ఎంలో హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్ వాటా 4.79 శాతం నుంచి 5.29 శాతానికి బలపడింది.
Comments
Please login to add a commentAdd a comment