న్యూఢిల్లీ: సహచర సంస్థ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ లిమిటెడ్ (టీఎస్‌టీఎల్) నుంచి సెమీకండక్టర్, డిస్‌ప్లే బిజినెస్‌లను సొంతం చేసుకోనున్నట్లు వేదాంతా లిమిటెడ్ వెల్లడించింది. తద్వారా సమీకృత సెమీకండక్టర్, డిస్‌ప్లే బిజినెస్‌లు కలిగిన తొలి కంపెనీగా వేదాంతా ఆవిర్భవించనుంది.
వేదాంతాకు అల్టిమేట్ హోల్డింగ్ కంపెనీ అయిన టీఎస్‌టీఎల్.. వోల్కన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పూర్తి అనుబంధ సంస్థకావడం గమనార్హం! కాగా.. షేర్ల బదిలీ ద్వారా టీఎస్‌టీఎల్ సెమీకండక్టర్, డిస్‌ప్లే బిజినెస్ యూనిట్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వేదాంతా వెల్లడించింది. దీంతో వేదాంతా డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోకు సెమీకండక్టర్, డిస్‌ప్లే గ్లాస్ బిజినెస్ జత కలవనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment