న్యూఢిల్లీ: ప్యాక్‌డ్ స్వీట్లు, స్నాక్స్, రెస్టారెంట్ల నిర్వాహక కంపెనీ హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్‌లో మైనారిటీ వాటా కొనుగోలుపై మూడు కంపెనీలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం 15–20 శాతం వాటా కొనుగోలు రేసులో బ్లాక్‌స్టోన్‌కు పెట్టుబడులున్న బెయిన్ క్యాపిటల్ కన్సార్షియం ముందుంది.
అయితే అల్ఫా వేవ్ గ్లోబల్ సైతం ఆసక్తి చూపడతో ప్రస్తుతం మూడు సంస్థల మధ్య పోటీ నెలకొంది. బిలియన్ డాలర్ల(సుమారు రూ. 8,400 కోట్లు) విలువైన బైండింగ్ ఆఫర్ ద్వారా అల్ఫా వేవ్ పోటీని తీవ్రతరం చేసింది. హల్దీరామ్ ప్రమోటర్లు అగర్వాల్ కుటుంబం కొత్త ఏడాది జనవరిలో వాటా విక్రయాన్ని పూర్తిచేయవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: వొడాఫోన్ ఐడియా షేర్ల జారీ
తొలుత మెజారిటీ వాటాను విక్రయించాలని భావించిన ప్రమోటర్లు తదుపరి మైనారిటీ వాటా విక్రయానికి కట్టుబడ్డారు. తద్వారా సమీకరించిన నిధులను విస్తరణకు వినియోగించే యోచనలో ఉన్నారు. అంతేకాకుండా తదుపరి దశలో ఐపీవోవైపు సైతం దృష్టిసారించనున్నట్లు అంచనా. టెమాసెక్ భాగస్వామ్యంతో బెయిన్ క్యాపిటల్, అబు ధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, సింగపూర్ సంస్థ జీఐసీ వాటా కొనుగోలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment