haldiram
-
హల్దీరామ్‌లో వాటాపై కన్ను.. రేసులో మూడు కంపెనీలు
న్యూఢిల్లీ: ప్యాక్డ్ స్వీట్లు, స్నాక్స్, రెస్టారెంట్ల నిర్వాహక కంపెనీ హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్‌లో మైనారిటీ వాటా కొనుగోలుపై మూడు కంపెనీలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం 15–20 శాతం వాటా కొనుగోలు రేసులో బ్లాక్‌స్టోన్‌కు పెట్టుబడులున్న బెయిన్ క్యాపిటల్ కన్సార్షియం ముందుంది.అయితే అల్ఫా వేవ్ గ్లోబల్ సైతం ఆసక్తి చూపడతో ప్రస్తుతం మూడు సంస్థల మధ్య పోటీ నెలకొంది. బిలియన్ డాలర్ల(సుమారు రూ. 8,400 కోట్లు) విలువైన బైండింగ్ ఆఫర్ ద్వారా అల్ఫా వేవ్ పోటీని తీవ్రతరం చేసింది. హల్దీరామ్ ప్రమోటర్లు అగర్వాల్ కుటుంబం కొత్త ఏడాది జనవరిలో వాటా విక్రయాన్ని పూర్తిచేయవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: వొడాఫోన్ ఐడియా షేర్ల జారీతొలుత మెజారిటీ వాటాను విక్రయించాలని భావించిన ప్రమోటర్లు తదుపరి మైనారిటీ వాటా విక్రయానికి కట్టుబడ్డారు. తద్వారా సమీకరించిన నిధులను విస్తరణకు వినియోగించే యోచనలో ఉన్నారు. అంతేకాకుండా తదుపరి దశలో ఐపీవోవైపు సైతం దృష్టిసారించనున్నట్లు అంచనా. టెమాసెక్ భాగస్వామ్యంతో బెయిన్ క్యాపిటల్, అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, సింగపూర్ సంస్థ జీఐసీ వాటా కొనుగోలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. -
బ్లాక్‌స్టోన్ చేతికి హల్దీరామ్స్!
న్యూఢిల్లీ: స్నాక్స్ తయారీ దిగ్గజం హల్దీరామ్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి ప్రయివేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే ప్రారంభించిన చర్చలు తుది దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, సింగపూర్ సంస్థ జీఐసీతో జత కట్టిన బ్లాక్‌స్టోన్ కొద్ది నెలలుగా హల్దీరామ్స్ ప్రమోటర్లు అగర్వాల్ కుటుంబంతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే బిజినెస్ విలువ విషయంలో అంగీకారం కుదరకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. కాగా.. స్నాక్స్ విభాగంలో దేశీయంగా ప్రధాన కంపెనీగా నిలుస్తున్న హల్దీరామ్స్‌లో నియంత్రిత వాటాను సొంతం చేసుకునేందుకు బ్లాక్‌స్టోన్ ఇంక్ ప్రస్తుతం చర్చల్లో ఇటీవల పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం రూ. 70,000 కోట్ల విలువలో హల్దీరామ్స్ కొనుగోలుకి డీల్ కుదిరే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 76%పై కన్ను హల్దీరామ్స్‌లో 76 శాతం వాటా కొనుగోలుపై బ్లాక్‌స్టోన్ కన్సార్షియం కన్నేసినట్లు తెలుస్తోంది. అయితే అగర్వాల్ కుటుంబం భారీ వాటా విక్రయానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ విలువ నిర్ధారణలోనూ అంగీకారం కుదరనట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రమోటర్లలో కొంతమంది 51 శాతం వాటా విక్రయానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. ఒకవేళ బ్లాక్‌స్టోన్‌తో ఒప్పందం కుదిరితే దేశీయంగా అతిపెద్ద పీఈ డీల్‌గా చరిత్ర సృష్టించే వీలున్నట్లు పేర్కొన్నాయి. చర్చలు ఏక్షణమైనా విఫలమైతే ఇతర ప్రత్యామ్నాయాలను సైతం అగర్వాల్ కుటుంబం సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ ఇష్యూకి సైతం తెరతీసే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. అగర్వాల్ కుటుంబం ఢిల్లీ, నాగ్‌పూర్ బ్రాంచీల ఎఫ్ఎంసీజీ బిజినెస్‌ను విలీనం చేసే ప్రణాళికల్లో ఉంది. హల్దీరామ్ స్నాక్స్ పీవీటీ లిమిటెడ్, హల్దీరామ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ పీవీటీ లిమిటెడ్ విలీనం ద్వారా హల్దీరామ్ స్నాక్ ఫుడ్స్ పీవీటీ లిమిటెడ్‌గా ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీలో ఢిల్లీ బ్రాంచ్ 56 శాతం, నాగ్‌పూర్ బ్రాంచ్ 44 శాతం చొప్పున వాటాను తీసుకోనున్నాయి. -
హల్దీరామ్స్‌పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
న్యూఢిల్లీ: 1937లో ఓ చిన్న షాప్‌గా ప్రారంభమైన హల్దీరామ్స్.. ఇప్పుడు దేశంలో అతిపెద్ద స్నాక్స్ తయారు చేసే సంస్థగా అవతరించింది. అయితే ఇప్పుడు కంపెనీలో సింహభాగం వాటాను కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ ఆధ్వర్యంలో గ్లోబుల్ కన్సార్టీయం బ్లాక్‌స్టోన్ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది.గత వారం హల్దీరామ్స్ స్నాక్స్ ఫుడ్ విభాగంలో 76 శాతం వాటాను ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్, అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అధారిటీ (ఏడీఏఐ), సింగపూర్ జీఐసీలు బిడ్డింగ్‌లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ బిడ్డింగ్‌పై హల్దీరామ్స్, గ్లోబుల్ కన్సార్టీయంలో అధికారంగా వెల్లడించాల్సి ఉంది.కాగా ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ ప్యాకేజీ ఫుడ్ బిజినెస్‌పై కన్నేసింది. స్నాక్స్ తయారు చేసే హల్దీరామ్స్ కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపాయి. అయితే, హల్దీరామ్స్ వాల్యుయేషన్ అధికంగా పేర్కొంటుండడంపై టాటా గ్రూప్ అనాసక్తి వ్యక్తం చేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
హల్దీరామ్స్‌పై టాటా కన్జ్యూమర్ కన్ను! ఇదే జరిగితే..
న్యూఢిల్లీ: ప్రముఖ ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫుడ్స్ తయారీ సంస్థ ‘హల్దీరామ్స్’లో వాటా కొనుగోలుకు టాటా కన్జ్యూమర్ ఆసక్తి చూపిస్తోంది. ఈ మేరకు కొన్ని కథనాలు వెలుగు చూశాయి. హల్దీరామ్స్‌లో కనీసం 51 శాతం వాటా కొనుగోలుకు టాటా కన్జ్యూమర్ సుముఖత చూపుతుండగా.. విలువల వద్దే ఏకాభిప్రాయం కుదరలేనట్టు సమాచారం. హల్దీరామ్స్ ప్రమోటర్లు 10 బిలియన్ డాలర్ల వ్యాల్యూషన్ (రూ.83,000 కోట్లు) కోరుతున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. కానీ, ఇది చాలా ఎక్కువ అని టాటా కన్జ్యూమర్ ప్రతినిధులు హల్దీరామ్స్తో చెప్పినట్టు తెలిపాయి. మొత్తం మీద వ్యాల్యూషన్ విషయంలోనే టాటా సంస్థ సౌకర్యంగా లేదని తెలిసింది. ఒకవేళ ఏకాభిప్రాయం కుదిరి హల్దీరామ్స్‌లో మెజారిటీ వాటా టాటా కన్జ్యూమర్ చేతికి వస్తే.. అది కంపెనీ చరిత్రలో పెద్ద డీల్ అవుతుంది. టాటా సంస్థ పెప్సీ, ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్‌తో నేరుగా పోటీపడే అవకాశం లభిస్తుంది. ఈ వార్తల నేపథ్యంలో టాటా కన్జ్యూమర్ షేరు బుధవారం 4 శాతం వరకు లాభపడింది. మరోవైపు హల్దీరామ్స్ బెయిన్ క్యాపిటల్ సహా పలు ప్రైవేటు ఈక్విటీ సంస్థలతో 10 శాతం వాటా విక్రయమై చర్చలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. భారీ అవకాశం.. హల్దీరామ్స్ ఆదాయం 1.5 బిలియన్ డాలర్లు ఉండగా, గత ఆర్థిక సంవత్సరానికి టాటా కన్జ్యూమర్ ఆదాయం 1.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. టాటా కన్జ్యూమర్ టాటా సంపన్న్ పేరుతో పప్పు ధాన్యాలు, టీ, సోల్‌ఫుల్ పేరుతో ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్టార్‌బక్స్ భాగస్వామ్యంతో కాఫీ రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. ‘‘టాటా కన్జ్యూమర్‌కు హల్దీరామ్స్ ఎంతో ఆకర్షణీయమైన అవకాశం. టాటా కన్జ్యూమర్‌ను టీ కంపెనీగా చూస్తారు. హల్దీరామ్స్ అనేది విస్తృతమైన మార్కెట్ వాటా కలిగిన కన్జ్యూమర్ కంపెనీ’’అని ఈ వ్యవహారం తెలిసిన ఓ వ్యక్తి తెలిపారు. 6.2 బిలియన్ డాలర్ల సంఘటిత స్నాక్ మార్కెట్లో హల్దీరామ్స్కు 13 శాతం వాటా ఉంది. లేస్ బ్రాండ్‌పై స్నాక్స్ విక్రయించే పెప్సీకి సైతం 13 శాతం మార్కెట్ ఉంది. హల్దీరామ్స్ తన ఉత్పత్తులను సింగపూర్, అమెరికా తదితర దేశాల్లోనూ విక్రయిస్తోంది. స్థానిక ఫుడ్, స్వీట్లను విక్రయించే 150 రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ‘‘ఒకేసారి మార్కెట్ పెంచుకోవాలంటే హల్దీరామ్స్కు మించిన అవకాశం మరొకటి ఉండదు. ఈ స్థాయిలో ప్యాకేజ్డ్ ఫుడ్, ఫుడ్ సర్వీసెస్ నిర్వహించే సంస్థ వేరొకటి లేదు’’అని కన్సల్టెన్సీ సంస్థ టెక్నోప్యాక్ కన్జ్యూమర్ హెడ్ అంకుర్ బిసేన్ అభిప్రాయపడ్డారు. చర్చలు నిర్వహించడం లేదు.. ఈ కథనాలపై టాటా కన్జ్యూమర్ స్పందించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఓ వివరణ ఇచ్చింది. ‘‘కథనాల్లో పేర్కొన్నట్టుగా మేము చర్చలు నిర్వహించడం లేదు. కంపెనీ వ్యాపారం విస్తరణ, వృద్ధి కోసం వ్యూహాత్మక అవకాశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. అవసరం ఏర్పడినప్పుడు నిబంధనల మేరకు ప్రకటిస్తుంది’’అని పేర్కొంది. మార్కెట్ స్పెక్యులేషన్‌పై స్పందించబోమని టాటా కన్జ్యూమర్ అధికార ప్రతినిధి సైతం ప్రకటించారు. -
11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!
సాధారణంగా ఫుడ్ కంపెనీ అనగానే చాలా మందికి డామినోస్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ వంటివి గుర్తుకు వస్తాయి. కానీ అలాంటి కంపెనీలకు సైతం గట్టి పోటీ ఇచ్చిన ఇండియన్ బ్రాండ్ 'హల్దీరామ్' (Haldiram) గురించి బహుశా తెలియకపోవచ్చు. ప్రపంచంలో దాదాపు 80 దేశాలలో ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ గురించి.. దీనికి మూల కారకుడైన వ్యక్తి గురించి ఈ కథనంలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. 'గంగ బిషన్ అగర్వాల్' (Ganga Bishan Agarwal) 1937లో బికనీర్‌లో చిన్న స్నాక్స్ వ్యాపారంగా మొదలు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని స్నాక్స్ ఫుడ్స్ వ్యాపారంలో రెండవ స్థానానికి చేరుకునేలా చేసాడు, అంటే దీని వెనుక ఉన్న అతని కృషి పట్టుదల స్పష్టంగా తెలుస్తాయి. నిజానికి ఒక చిన్న భుజియా దుకాణంతో ప్రారంభమైన ఆయన వ్యాపారం, కుటుంబ కలహాలు, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ రోజు ప్రపంచమే గుర్తించే స్థాయికి ఎదిగింది. గంగ బిషన్ ఉరఫ్ అగర్వాల్‌ని తన తల్లి ముద్దుగా 'హల్దీరామ్' అని పిలుచుకునేది. ఆ పేరే తరువాత కంపెనీ బ్రాండ్‌గా మారింది. వీరి కుటుంబానికి చెందిన ఒక మహిళ తరచుగా బికనీరీ భుజియా తయారు చేసేదని, దాన్ని తన తల్లి ద్వారా బిషాన్ నేర్చుకున్నట్లు సమాచారం. భుజియాతో విజయం.. గంగా బిషన్ అగర్వాల్ 1919లో కేవలం 11 ఏళ్ల వయసులోనే కంపెనీ స్థాపించాలని కలలు కనేవాడు. చిన్న తనం నుంచి భుజియా తయారు చేయడం మీద ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ఎందుకంటే ఆ సమయంలో భుజియా బాగా ప్రసిద్ధి చెందింది. అయితే వ్యాపారులు డబ్బు మీద పెట్టే ద్రుష్టి.. రుచి మీద పెట్టేవారు కాదు. కావున బిషన్ మార్కెట్లో మంచి రుచిని అందించే చిరుతిండి వ్యాపారాలను సృష్టించడానికి కంకణం కట్టుకున్నాడు. దీంతో అనేక ప్రయత్నాలు చేసి బికనీర్ ప్రజలు మునుపెన్నడూ రుచి చూడని కొత్త రకం భుజియాను రూపొందించడంలో అతను విజయం సాధించాడు. (ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..) కలకత్తాలో దుకాణం.. మార్కెట్లో మంచి పేరు సంపాదించిన తరువాత అమ్మకాల పరంగా వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. అతడు ఏడు పదుల వయసులోనూ ఊరంతా సైకిల్ మీదే తిరిగేవారట, అంతే కాకుండా ఆయన ఒకసారి కోల్‌కతాలో పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక దుకాణం ఏర్పాటు చేయాలనుకుని, అక్కడ షాప్ ప్రారంభించారు. బికనీర్‌లో కాకుండా బయట ప్రారంభించిన మొట్టమొదటి దుకాణం అదే. ఈ విధంగా క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఆయన మనవళ్లు కూడా దీని అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. (ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్‌ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..) 80 దేశాల్లో విక్రయాలు.. భారతదేశంలో నాగపూర్, ఢిల్లీ ప్రాంతాల్లో వీరికి బ్రాంచీలు ఉన్నాయి. విదేశాల్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. వీరి ఉత్పత్తులు ప్రపంచంలోని దాదాపు 80 దేశాల్లో విక్రయానికి ఉన్నట్లు సమాచారం. హల్దీరామ్ బ్రాండ్‌లో వెజ్ షమీ కెబాబ్, సోయా షమీ కెబాబ్, దహీ కెబాబ్, హరాభరా కెబాబ్లను తయారు చేసేవారు. ఆ తరువాత రసగుల్లా, సోమ్ పాపిడీ, పానీపురీ వంటివి కూడా ప్రారంభించారు. హల్దీరామ్ ప్రస్తుత చైర్మన్ మనోహర్ లాల్ అగర్వాల్. ప్రస్తుతం వీరు రూ. వేల కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ చేస్తున్నట్లు సమాచారం. -
గరం గరం వడ సాంబార్.. తింటే షాక్..!
ముంబై : పొద్దుగళ్ల పొద్దుగళ్ల వడ సాంబార్ తినాలని ప్రతిఒక్కరు ఆరాటపడతారు. ఇక నాగ్‌పూర్‌లోని అజానీ స్క్వేర్‌లో స్నాక్స్ తయారీలో పాపులర్ అయిన హల్దీరామ్ నిర్వహిస్తున్న ఓ హోటల్‌కు జనం ఎగబడతారు. అక్కడ టిఫిన్స్ శుచిగా శుభ్రంగా ఉంటాయిన క్యూ కడతారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా అదే చేశాడు. తన భార్యతో కలిసి వడ సాంబార్ ఆర్డర్ చేశాడు. సగం తిన్న తర్వాత ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. సాంబార్లో బల్లి ప్రత్యక్షమవడంతో విషయం హోటల్ నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చారు. నిర్వాహకులు బాధితులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, సాంబార్లో బల్లిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ విషయమై సదరు హోటల్‌ను తనిఖీ చేశారు. ఘటనపై విచారణ చేపట్టామని ఎఫ్‌డీఏ (నాగ్‌పూర్) కమిషనర్ మిలింద్ దేశ్‌పాండే తెలిపారు. కిచెన్‌లో ఉన్న లోపాలను గుర్తించామని, ఆహార భద్రతా, నాణ్యతా ప్రమాణాలకు లోబడి హోటల్ నడుచుకునే విధంగా ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు. కిటీకీలకు తెరలు బిగించాలని ఆదేశాలు జారీచేశామని వెల్లడించారు. అప్పటివరకు హోటల్‌ను మూసేయించామని వివరించారు. ఇక కస్టమర్ లేవెనెత్తిన ఆరోపణలపై తమకు అనుమానాలు ఉన్నాయని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. బాధితులకు చికిత్సనందించామని.. వారికి ఆరోగ్యానికి బాగానే ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయని వెల్లడించారు. హోటల్ నిర్వహణకు సంబంధించి అధికారులకు తగు పత్రాలు అందిచామని తెలిపారు. ఇక బాధితులు ఈ ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. వారు ఎవరిపైనా ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. -
101 కోల్డ్ చెయిన్ ప్రాజెక్టులకు ఓకే..
⇒ కేంద్ర ప్రభుత్వం ఆమోదం ⇒ రూ. 3,100 కోట్ల పెట్టుబడులు ⇒ లిస్టులో తిరుమల మిల్క్, అమూల్ తదితర సంస్థల ప్రాజెక్టులు న్యూఢిల్లీ: కూరగాయలు, పండ్ల వృథాను అరికట్టే లక్ష్యంతో కేంద్రం కొత్తగా 101 కోల్డ్ చెయిన్ ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది. సుమారు రూ. 3,100 కోట్ల పెట్టుబడులతో అమూల్, హల్దీరామ్, బిగ్ బాస్కెట్, తిరుమల మిల్క్ తదితర సంస్థలు వీటిని ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి తమ శాఖ రూ. 838 కోట్లు గ్రాంట్ కింద ఇస్తుందని, మిగతా రూ. 2,200 కోట్లు ప్రైవేట్ రంగం నుంచి వస్తాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ సోమవారం తెలిపారు. 101 కొత్త కోల్డ్ చెయిన్ ప్రాజెక్టుల సామర్థ్యం 2.76 లక్షల టన్నులుగా ఉంటుందని ఆమె వివరించారు. హట్సన్ ఆగ్రో, స్టెర్లింగ్ ఆగ్రో, ప్రభాత్ డైరీ, బామర్ లారీ, దేశాయ్ బ్రదర్స్, ఫాల్కన్ మెరీన్ (ఒరిస్సా) మొదలైన సంస్థల ప్రాజెక్టులు కూడా లిస్టులో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 21 ప్రాజెక్టులు, ఉత్తరప్రదేశ్ 14, గుజరాత్ 12, ఆంధ్రప్రదేశ్ 8, పంజాబ్..మధ్యప్రదేశ్‌లలో చెరి ఆరు ప్రాజెక్టులు రానున్నాయి. 53 ప్రాజెక్టులు కూరగాయలు.. పండ్లవి కాగా, డెయిరీలో 33, మాంసం.. పౌల్ట్రీ.. మెరీన్ విభాగాల్లో 15 ప్రాజెక్టులు ఉండనున్నాయి. 2.6 లక్షల మంది రైతులకు ప్రయోజనకరం.. సుమారు 2.6 లక్షల రైతులకు వీటివల్ల ప్రయోజనం చేకూరనుందని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 60,000 మందికి ఇవి ఉపాధి కల్పించగలవని బాదల్ పేర్కొన్నారు. వీటిలో సుమారు రూ. 12,000 కోట్ల విలువ చేసే 4.7 మిలియన్ టన్నుల అగ్రి, హార్టికల్చర్ ఉత్పత్తుల ప్రాసెసింగ్ జరుగుతుందని, 13 శాతం మేర వృథాను అరికట్టవచ్చని మంత్రి తెలిపారు. ఇప్పటిదాకా ఆమోదించిన కోల్డ్ చెయిన్స్ సంఖ్య 234కి చేరిందని, కొత్తగా మరో 50 ప్రాజెక్టులు కూడా మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు. 2014 టోకు ధరల ప్రాతిపదికన చూస్తే దాదాపు రూ. 92,000 కోట్ల విలువ చేసే పండ్లు, కూరగాయలు వృ«థా అవుతున్నట్లు బాదల్ తెలిపారు.