న్యూఢిల్లీ: 1937లో ఓ చిన్న షాప్‌గా ప్రారంభమైన హల్దీరామ్స్.. ఇప‍్పుడు దేశంలో అతిపెద్ద స్నాక్స్ తయారు చేసే సంస్థగా అవతరించింది. అయితే ఇప్పుడు కంపెనీలో సింహభాగం వాటాను కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ ఆధ్వర్యంలో గ్లోబుల్ కన్సార్టీయం బ్లాక్‌స్టోన్ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది.
గత వారం హల్దీరామ్స్ స్నాక్స్ ఫుడ్ విభాగంలో 76 శాతం వాటాను ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్, అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ అధారిటీ (ఏడీఏఐ), సింగపూర్ జీఐసీలు బిడ్డింగ్‌లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ బిడ్డింగ్‌పై హల్దీరామ్స్, గ్లోబుల్ కన్సార్టీయంలో అధికారంగా వెల్లడించాల్సి ఉంది.
కాగా ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ ప్యాకేజీ ఫుడ్ బిజినెస్‌పై కన్నేసింది. స్నాక్స్ తయారు చేసే హల్దీరామ్స్ కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపాయి. అయితే, హల్దీరామ్స్ వాల్యుయేషన్ అధికంగా పేర్కొంటుండడంపై టాటా గ్రూప్ అనాసక్తి వ్యక్తం చేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment