షాపర్స్‌ స్టాప్‌లో అమెజాన్‌ పెట్టుబడులు | Amazon Arm to pick 5% stake in Shoppers StopShoppers Stop | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 23 2017 7:28 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

 Amazon Arm to pick 5% stake in Shoppers StopShoppers Stop - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్‌ ఇండియా,  మరో రీటైల్‌ మేజర్‌ షాపర్స్‌ స్టాప్‌లో వాటాలను కొనుగోలు చేసింది. ఈ మేరకు షాపర్స్‌ స్టాప్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం అమెజాన్‌ రూ.179 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది.

షాపర్స్‌  స్టాప్‌లో 5 శాతం వాటాను అమెజాన్‌ కొనుగోలు చేయనుంది. రూ. 179.26 కోట్ల  విలువైన  వాటాను  షాపర్స్‌ స్టాప్‌  అమెజాన్‌కు  విక్రయించనుంది. ఈ నేపథ్యంలో ఎన్‌బీ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ చెందిన  షేర్లను  ప్రిఫెరెన్షియల్  బేసిస్‌ కింద అమెజాన్‌కు కేటాయించనుంది.

మరోవైపు అమెజాన్ ఇండియాలో  తమ ఉత్పత్తులను విక్రయించడానికి వాణిజ్యపరమైన ఒప్పందం కుదుర్చుకున్నామని షాపర్స్‌ స్టాప్‌  ఇటీవల బీఎస్‌ఈ  ఫైలింగ్‌ లో తెలిపింది.  దీంతో అధికారిక వెబ్‌సైట్లతో పాటు, ఇకపై అమెజాన్‌లో కూడా తమ   ఉత్పత్తులు ప్రత్యేకంగా లభ్యంకానున్నాయని తెలిపింది. మొత్తం పోర్ట్ఫోలియో జాబితాలో 500 బ్రాండ్లు అమెజాన్  మార్కెట్‌ లో లభ్యం కానున్నాయి. అలాగే  షాపర్స్‌  స్టాప్ లిమిటెడ్  కూడాతన ఫిజికల్‌ నెట్‌వర్క్‌లో  ఫ్యాషన్ కోసం ప్రత్యేకమైన అమెజాన్ అనుభవ కేంద్రాలను సృష్టిస్తుందని ఫైలింగ్‌లో తెలిపింది.  భారత్‌లో అభివృద్ధి చెందుతున్న కస్టమర్ బేస్‌ను మరింత పెంచుకోవడానికి ఇద్దరు భాగస్వాములు ఒకరిబలాన్ని మరొకరు  పెంచుకోనున్నామని   అమెజాన్ ఇండియా ఫాషన్ బిజినెస్ హెడ్ అరుణ్ సర్‌ దేశ్‌ముఖ్‌  వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement