న్యూఢిల్లీ: ఔషధ రంగంలో ఉన్న ఇప్కా ల్యాబొరేటరీస్ తాజాగా యూనికెమ్ ల్యాబొరేటరీస్‌లో 33.38 శాతం వాటా కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ.1,034 కోట్లు. యూనికెమ్ ప్రమోటర్ నుంచి 2,35,01,440 షేర్లను ఒక్కొక్కటి రూ.440 చొప్పున ఇప్కా దక్కించుకుంటోంది. అలాగే యూనికెమ్‌లో పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి మరో 26 శాతం వరకు వాటాలను ఒక్కో షేరుకు రూ.440 చెల్లించి కొనుగోలు చేసేందుకు ఇప్కా ఓపెన్ ఆఫర్ ఇవ్వనుంది.
ఎంచుకున్న వృద్ధి మార్కెట్లలో కంపెనీ పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడానికి తాము నిర్ధేశించుకున్న వ్యూహానికి అనుగుణంగా ఈ డీల్ ఉందని ఇప్కా ల్యాబొరేటరీస్ ప్రమోటర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రేమ్‌చంద్ గోధా ఈ సందర్భంగా తెలిపారు. 1949లో ఇప్కా ప్రారంభం అయింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఎగుమతుల వాటా 50 శాతం. ఫినిష్డ్ డోసెజెస్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను తయారు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment