Unichem industries
-
యూనికెమ్ ల్యాబొరేటరీస్‌లో ఇప్కా ల్యాబ్స్‌కు 33.38% వాటా!
న్యూఢిల్లీ: ఔషధ రంగంలో ఉన్న ఇప్కా ల్యాబొరేటరీస్ తాజాగా యూనికెమ్ ల్యాబొరేటరీస్‌లో 33.38 శాతం వాటా కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ.1,034 కోట్లు. యూనికెమ్ ప్రమోటర్ నుంచి 2,35,01,440 షేర్లను ఒక్కొక్కటి రూ.440 చొప్పున ఇప్కా దక్కించుకుంటోంది. అలాగే యూనికెమ్లో పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి మరో 26 శాతం వరకు వాటాలను ఒక్కో షేరుకు రూ.440 చెల్లించి కొనుగోలు చేసేందుకు ఇప్కా ఓపెన్ ఆఫర్ ఇవ్వనుంది. ఎంచుకున్న వృద్ధి మార్కెట్లలో కంపెనీ పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడానికి తాము నిర్ధేశించుకున్న వ్యూహానికి అనుగుణంగా ఈ డీల్ ఉందని ఇప్కా ల్యాబొరేటరీస్ ప్రమోటర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రేమ్‌చంద్ గోధా ఈ సందర్భంగా తెలిపారు. 1949లో ఇప్కా ప్రారంభం అయింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఎగుమతుల వాటా 50 శాతం. ఫినిష్డ్ డోసెజెస్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను తయారు చేస్తోంది. -
ఐబీ హౌసింగ్ దూకుడు- ఎఫ్‌పీఐల పుష్
వారాంతాన దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. సెన్సెక్స్ 524 పాయింట్లు పెరిగి 34,792 వద్ద నిలవగా.. 153 పాయింట్లు జంప్‌చేసిన నిఫ్టీ 10,244 వద్ద స్థిరపడింది. కాగా.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కంపెనీలో వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడైన వార్తల నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ కౌంటర్ లాభాలతో దూసుకెళ్లగా.. గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడంతో యూనికెమ్ లేబొరేటరీస్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వివరాలు చూద్దాం.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా శుక్రవారం ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఎఫ్‌పీఐలు 2.6 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజీల డేటా పేర్కొంది. ఐబీ హౌసింగ్‌లో మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్) 1.05 శాతం వాటాకు సమానమైన దాదాపు 45.23 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. షేరుకి రూ. 184.76 సగటు ధరలో వీటిని కొనుగోలు చేయగా.. యూకే సంస్థ బ్లాక్‌రాక్ అడ్వయిజర్స్‌కు చెందిన ఐషేర్స్ 1.66 శాతం వాటాను రెండు ఈటీఎఫ్‌ల ద్వారా కొనుగోలు చేసింది. ఐబీ హౌసింగ్‌లో ఐషేర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ డివిడెండ్ ఈటీఎఫ్ UCITS 25.69 లక్షల షేర్లు, ఐషేర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ డివిడెండ్ ఈటీఎఫ్ 45.59 లక్షల షేర్లను.. షేరుకి 189.51 సగటు ధరలో సొంతం చేసుకున్నాయి. అయితే ఇంటిగ్రేటెడ్ కోర్ స్ట్రాటజీస్(ఏషియా) రూ. 202 ధరలో 21.69 లక్షలకుపైగా షేర్లను విక్రయించింది. ఈ నేపథ్యంలో వారాంతాన ఐబీ హౌసింగ్ కౌంటర్లో భారీ ట్రేడింగ్ నమోదైంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లి రూ. 202 ఎగువన ముగిసింది. ఇంట్రాడేలో రూ. 209ను సైతం అధిగమించింది. యూనికెమ్ క్యూ4 వీక్ హెల్త్‌కేర్ రంగ కంపెనీ యూనికెమ్ ల్యాబొరేటరీస్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో కంపెనీ రూ. 17 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 38 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 15 శాతం క్షీణించి రూ. 320 కోట్లకు పరిమితమయ్యాయి. వారాంతాన సమావేశమైన బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4 డివిడెండ్‌ను సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎన్ఎస్ఈలో యూనికెమ్ ల్యాబ్ షేరు దాదాపు 5 శాతం పతనమై రూ. 159 వద్ద ముగిసింది. తొలుత ఒక దశలో రూ. 150 వరకూ దిగజారింది. -
శ్రీసిటీలో యూనిఛామ్ పరిశ్రమకు భూమిపూజ
తడ, న్యూస్‌లైన్: శ్రీసిటీ సెజ్‌లో జపాన్‌కు చెందిన కంపెనీ యూనిఛామ్ రూ.250 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు సోమవారం సెజ్‌లో భూమిపూజ నిర్వహించారు. యూనిఛామ్ కంపెనీ సీఎండీ మియాభహి మాట్లాడుతూ తమ పరిశ్రమలో నాప్కిన్స్ ఉత్పత్తి చేస్తామని తెలిపారు. నాలుగు దశలుగా నిర్మించే పరిశ్రమలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. మొదట 400 మందికి, పరిశ్రమ నిర్మాణం పూర్తయిన తర్వాత వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే తమ సంస్థ 20 కేంద్రాల్లో విస్తరించిందన్నారు. భారతదేశంలో రెండో యూనిట్‌కు శ్రీకారం చుట్టామని, 2020 నాటికి రూ.90 వేల కోట్ల వ్యాపారం చేయడం తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో యూనిఛామ్ భారత్ యూనిట్ ఎండీ కిమురా, శ్రీసిటీ డెరైక్టర్ పోచారెడ్డి ముకుందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.