శ్రీసిటీలో యూనిఛామ్ పరిశ్రమకు భూమిపూజ
తడ, న్యూస్‌లైన్: శ్రీసిటీ సెజ్‌లో జపాన్‌కు చెందిన కంపెనీ యూనిఛామ్ రూ.250 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు సోమవారం సెజ్‌లో భూమిపూజ నిర్వహించారు. యూనిఛామ్ కంపెనీ సీఎండీ మియాభహి మాట్లాడుతూ తమ పరిశ్రమలో నాప్కిన్స్ ఉత్పత్తి చేస్తామని తెలిపారు. నాలుగు దశలుగా నిర్మించే పరిశ్రమలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
మొదట 400 మందికి, పరిశ్రమ నిర్మాణం పూర్తయిన తర్వాత వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే తమ సంస్థ 20 కేంద్రాల్లో విస్తరించిందన్నారు. భారతదేశంలో రెండో యూనిట్‌కు శ్రీకారం చుట్టామని, 2020 నాటికి రూ.90 వేల కోట్ల వ్యాపారం చేయడం తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో యూనిఛామ్ భారత్ యూనిట్ ఎండీ కిమురా, శ్రీసిటీ డెరైక్టర్ పోచారెడ్డి ముకుందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.