ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్(ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: యస్ సంక్షోభం, ఆర్‌బీఐ డ్రాప్ట్ ప్లాన్ల తదితర పరిణామాల నేపథ్యంలో ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. యస్ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు ఎస్‌బీఐ బోర్డు సూత్ర ప్రాయ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. బ్యాంక్ పునర్నిర్మాణ ముసాయిదా పథకం ఎస్‌బీఐ వద్దకు చేరిందని తెలిపారు. ఈ ముసాయిదా పథకంపై తమ పెట్టుబడి, న్యాయ బృందం కృషి చేస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన ఫైనల్ నిర్ణయాలను రెగ్యలేటరీలకు అందిస్తామని పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ.2450 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. అలాగే మూడు సంవత్సరాల కాలానికి తమ రూ.5500 కోట్లుగా (26 శాతం) వుంటుందని అంచనా వేస్తున్నామన్నారు. పెట్టుబడుల నిమిత్తం దేశీయ, అంతర్జాతీయంగా 23 మంది పెట్టుబడిదారులు తమను సంప్రదించారని ఎస్‌బీఐ చైర్మన్ చెప్పారు.
తమ ప్రతిపాదనలకు మార్చి 9వ తేదీ వరకు సమయం ఉందని ఆ లోపు ఆర్‌బీఐ ముందు ఉంచుతామని చైర‍్మన్ చెప్పారు. 30 రోజుల గడువు లోపలే యస్ బ్యాంకును రక్షించే పథకాన్ని సిద్ధం చేస్తామని, ఇందుకు 24 గంటలూ పని చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకులో నగదు పూర్తి భద్రంగా వుంటుందని యస్ బ్యాంకు కస్టమర్లు, డిపాజిట్‌దారులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ హామీ ఇచ్చినవిషయాన్ని ఆయన మరో సారి గుర్తు చేశారు. అలాగే ఎస్‌బీఐ వాటాదారులు, వినియోగదారులపై తాజా పరిణామాల ప్రభావం వుండబోదమని ఆయన స్పష్టం చేశారు.
చదవండి : ‘యస్’ సంక్షోభం : రాణా కపూర్‌కు లుక్ అవుట్ నోటీసు
Comments
Please login to add a commentAdd a comment