న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తమ వాటాలను మరింతగా పెంచుకుంది. ఇందులో భాగంగా నియంత్రణాధికారాలు లేని వాటాదారుల నుంచి షేర్ల కొనుగోలు కోసం జూలై 31తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో 3.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 28,953 కోట్లు) చెల్లించింది.
2018లో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 77 శాతం వాటాను దక్కించుకోగా తాజాగా దాన్ని 80.5 శాతానికి పెంచుకుంది. ఇందుకోసం హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్, యాక్సెల్ పార్ట్‌నర్స్, ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ నుంచి వాటాలు కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ను లిస్టింగ్ చేసే యోచనలో కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment