భారత్లో అమెజాన్, వాల్మార్ట్ బిగ్ ఫైట్
న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఎఫ్ డీఐ పాలసీతో అమెరికన్ దిగ్గజాలు అమెజాన్, వాల్ మార్ట్ ల మధ్య ఇండియన్ వర్షెన్ లో బిగ్ ఫైట్ ప్రారంభం కాబోతోంది. ఈ-కామర్స్ వేదికలు సహా ఇతర మార్గాల్లో ఆహార ఉత్పత్తుల ట్రేడింగ్‌కు సంబంధించి కూడా నూరు శాతం ఎఫ్‌డీఐలకు సర్కారు ద్వారాలు తెరిచింది. దీంతో అమెరికన్ సూపర్ సెల్లర్స్ గా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, రిటైల్ సంస్థ వాల్ మార్ట్ లు భారత్ లో తమ వ్యాపారాలను పెంచుకోవడానికి మార్గం సుగుమమైంది. ఈ రెండు సంస్థలు ఆహార ఉత్పత్తులను కస్టమర్లకు అందించేందుకు కొత్త మోడల్స్ ను ఎంచుకుని, మార్కెట్లో తమ స్థానాలను బలపర్చుకోవడానికి తీవ్రంగా కృషిచేయనున్నాయి... ఆహారోత్పత్తులను డైరెక్టుగా కస్టమర్లకు విక్రయించేందుకు ఈ పాలసీ దోహదపడనునడంతో, ఆఫ్ లైన్, ఆన్ లైన్ ఏ మార్గంలోనైనా డైరెక్ట్ గా ఆహారోత్పత్తులను వినియోగదారులకు విక్రయించేందుకు ఈ దిగ్గజాలు పోటీపడనున్నాయి.. అమెజాన్ ప్రస్తుతం థర్డ్ పార్టీ అమ్మకదారులతో మార్కెట్ ప్లేస్ ను కలిగి ఉండగా.. వాల్ మార్ట్ చిల్లర వర్తకులకు అమ్మడం ద్వారా క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను నడుపుతోంది.
గ్రోసరీ, ఫ్రూట్, వెజిటేబుల్స్ ను తన మార్కెట్ ప్లేస్ ద్వారా ఆన్ లైన్ లో డైరెక్టుగా అమ్మేందుకు అమెజాన్ ఆసక్తికనబరుస్తుందని కంపెనీకి చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు. థర్డ్ పార్టీ ప్రమేయం లేకుండా తనుకు తానుగా అమ్మకందారుడిగా అమెజాన్ వ్యవహరించాలనుకుంటోంది. ఈ ప్రోగ్రామ్ ను ఇప్పటికే అమెరికాలో అమెజాన్ ఫ్రెష్ ద్వారా కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. వ్యవసాయదారులతో జతకట్టి ఈ అమ్మకాలను అమెజాన్ చేపడుతోంది. దీంతో అక్కడ వాల్ మార్ట్ కోర్ గ్రోసరీ బిజినెస్ లకు అమెజాన్ గట్టి పోటీని ఇస్తోంది. ఇదే మాదిరి ఇండియాలో కూడా చేపట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. భారత వినియోగదారులకు డైరెక్టుగా ఆహార ఉత్పత్తులు అమ్మేందుకు ఆసక్తి ఉన్నట్టు వాల్ మార్ట్ కూడా ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటివరకూ ఆన్ లైన్ కంపెనీలు డైరెక్ట్ గా కస్టమర్లకు మల్టీ బ్రాండ్లను అమ్మడానికి అనుమతి లేదు. థర్డ్ పార్టీ అమ్మకాలు చేపట్టానికే మాత్రమే ఇవి ప్లాట్ ఫామ్ లా ఉన్నాయి. ఎఫ్ డీఐ వేదికలుగా జరిగే ఆహార ఉత్పత్తులకు 100 శాతం ఎఫ్ డీఐలను అనుమతి ఇవ్వడం, ఈ ఉత్పత్తుల పరిశ్రమలపై పాజిటివ్ ప్రభావం చూపుతాయని అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి ఆశాభావం వ్యక్తంచేశారు.