సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ సేవల రంగంలో అడుగు పెట్టింది. మొదట బెంగళూరులో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. స్థానిక రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్ల నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తున్నామని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
వినియోగదారుల కోరిక మేరకు వారికి షాపింగ్ అనుభవంతో పాటు, భోజన ఆనందాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నామని అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై వుంటున్న ప్రస్తుత కాలంలో ఇది సందర్భోచితంగా వుంటుందని భావించామన్నారు. అలాగే సేఫ్టీ, పరిశుభ్రతకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ప్రముఖ రెస్టారెంట్ల నుంచి, అత్యున్నత ప్రమాణాలతో తాము ఫుడ్ డెలివరీ చేస్తామని, ఇందుకోసం ‘హైజీన్ సర్టిఫికేషన్ బార్’ ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం బెంగుళూరుకు పరిమితమైన తమ సేవలు క్రమంగా అన్ని నగరాలకు విస్తరిస్తామన్నారు.
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా నాలుగు దశల్లో లాక్డౌన్ అమలవుతున్నాయి. ఆన్ లైన్ సంస్థల సేవలపై ఆంక్షలకు సంభించి చాలా సడలింపులను ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అమెజాన్ తాజా నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావంతో స్విగ్గీ తన ఉద్యోగులలో 1100 మందిని తొలగించడంతోపాటు, క్లౌడ్ కిచెన్స్ వ్యాపారం నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. (కరోనా : ఉద్యోగులపై వేటు, క్లౌడ్ కిచెన్స్‌కు బ్రేక్)
చదవండి : జియోలో కేకేఆర్ పెట్టుబడులు : మరో మెగా డీల్?
బడ్జెట్ ధరలో మోటో జీ 8 పవర్ లైట్
Comments
Please login to add a commentAdd a comment