Sachin Bansal
-
‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీలో తనకున్న 7.5 వాటానంతా అమ్మేసుకుని ఆ సంస్థ నుంచి వైదొలిగారు. 2014 నుంచి ఏథర్ కంపెనీలో దాదాపు రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేసిన తొలి ఇన్వెస్టర్లలో బన్సాల్ ఒకరు.ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. తన వాటాలో 2.2 శాతం భాగాన్ని హీరో మోటోకార్ప్‌కు రూ .124 కోట్లకు విక్రయించిన సచిన్ బన్సాల్ మిగిలిన 5.3 శాతం వాటాను జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు సుమారు రూ .282 కోట్లకు విక్రయించారు. ఈ డీల్ తర్వాత ఈవీ స్టార్టప్‌లో హీరో మోటోకార్ప్ వాటా 40 శాతానికి పెరగనుంది.2024 ఆర్థిక సంవత్సరంలో ఏథర్ టర్నోవర్ రూ.1,753 కోట్లుగా ఉందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1,784 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తగ్గిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. -
దిగ్గజ సంస్థలో చీలిక.. కోఫౌండర్ కొత్త కంపెనీ..!
ఈ-కామర్స్ వ్యాపారంలో ఫ్లిప్‌కార్ట్ అగ్రగామిగా దూసుకెళ్తోంది. దాన్ని స్థాపించి విజయవంతంగా తీర్చిదిద్దిన బిన్నీ బన్సాల్ తాజాగా మరో ఈ-కామర్స్ బిజినెస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ గతంలోనే ఫ్లిప్‌కార్ట్‌లో తన మిగిలిన వాటాను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ పూర్తిగా వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కంపెనీను విడిచి బిన్నీ బన్సాల్ ఈ-కామర్స్ మార్కెట్లో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త కంపెనీ పెడుతున్నట్లు బిన్నీ ఇప్పటికే చెప్పారు. జనవరి 2024 ప్రారంభంలో ఆయన తన కొత్త కంపెనీ ‘ఆప్‌డోర్’ OppDoorను ప్రకటించారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ కంపెనీల అభివృద్ధి, విస్తరణకు ఎండ్ టూ ఎండ్ సోల్యూషన్స్‌ను అందించనుందని తెలిసింది. ‘ఆప్‌డోర్’ మొదట యూఎస్, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, సింగపూర్, జపాన్ , ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ-కామర్స్ కంపెనీలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: బిన్నీ బన్సల్ కూడా.. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫౌండర్లు ఇద్దరూ అవుట్! ఫ్లిప్‌కార్ట్ మరో కోఫౌండర్ సచిన్ బన్సాల్ నవీ అనే ఫిన్‌టెక్ వెంచర్ ఏర్పాటు కోసం కొన్ని సంవత్సరాల కిందటే ఫ్లిప్‌కార్ట్‌ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత 16 సంవత్సరాలుగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సాధించిన విజయాల పట్ల బిన్నీ బన్సల్ గర్వాన్ని వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వ బృందంతో కంపెనీ బలమైన స్థానంలో ఉందన్నారు. -
షాకిచ్చిన స్టార్టప్ కంపెనీ.. బిక్కు బిక్కుమంటున్న ఉద్యోగులు!
ఒక వైపు కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌లు చెబుతుంటే.. ప్రముఖ స్టార్టప్ కంపెనీ 'నవీ టెక్నాలజీ' (Navi Technologies) మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగానే 200 మంది ఉద్యోగులను తొలగించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు 'సచిన్ బన్సల్' నేతృత్వంలో ఉండే నవీ టెక్నాలజీ కంపెనీ తాజాగా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. ఇందులో దాదాపు 60 నుంచి 70 శాతం మంది ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ విభాగానికి చెందిన వారు కావడం గమనార్హం. మిగిలిన ఉద్యోగులు వివిధ విభాగాలకు చెందిన వారు. (ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్‌ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..) కంపెనీ రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2021 డిసెంబర్ నాటికి ఈ సంస్థలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 4680 మంది. అయితే గత కొన్ని రోజులుగా తొలగింపులు ప్రక్రియ మొదలైంది.. కావున ఈ సంఖ్య త్వరలో మరింత తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది పెద్ద పెద్ద కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగించినట్లు గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. -
ఫ్లిప్‌కార్ట్ మాజీ సీఈవోకి నో చెప్పిన ఆర్బీఐ?
ముంబై: స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో సహా బ్యాంకుల ఏర్పాటు కోసం వచ్చిన ఆరు దరఖాస్తులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తిరస్కరించింది. బ్యాంకుల ఏర్పాటుకు తగిన స్థాయి దరఖాస్తులు కాకపోవడంతో వీటిని తిరస్కరించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంక్ లైసెన్సులకు సంబంధించి తిరస్కరణ జాబితాలో యూఏఈ ఎక్సేంజ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ది రిపాట్రియాట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఆర్ఈపీసీఓ బ్యాంక్), చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, పంకజ్ వైష్ ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి వీసాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాలికట్ సిటీ సర్వీస్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లు ఉన్నాయి. కాగా, చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. మొత్తం 11 దరఖాస్తులు ‘ఆన్ ట్యాప్’ లైసెన్సింగ్ ఆఫ్ యూనివర్శ్ల్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మార్గదర్శకాల కింద బ్యాంకుల ఏర్పాటు 11 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో పైన పేర్కొన్న ఆరు దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, మరో ఐదు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఈ 5 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటుకు ఉద్దేశించినవి కావడం గమనార్హం. వెస్ట్ ఎండ్ హౌసింగ్ ఫైనాన్స్, అఖిల్ కుమార్ గుప్తా, ద్వార క్షేత్రీయ గ్రామీణ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, కాస్మియా ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దరఖాస్తుదారులలో ఉన్నాయి. చదవండి: Sachin Bansal: ఒక్క లోను పొందాలంటే వంద తిప్పలు.. అందుకే ‘నావి’ వచ్చింది -
ఈడీ నోటీసులను కోర్టులో సవాల్ చేసిన సచిన్ బన్సాల్
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 2009 - 2015 మధ్య విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించినందుకు 1.35 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 9,850 కోట్లు) జరిమానాను ఎందుకు విధించకూడదో వివరించాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జూలైలో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు, కొంతమంది పెట్టుబడిదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. (చదవండి: ఆన్లైన్లో ఐటీ రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?) చాలా కాలం తర్వాత నోటీసులు జారీ చేశారని.. వాటిని రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. దీన్ని విచారిస్తున్న న్యాయమూర్తి ఆర్ మహదేవన్ ఈ పిటిషన్‌పై ప్రతిస్పందన దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఆదేశించారు. ఫ్లిప్‌కార్ట్ గతం నుంచి "భారతీయ చట్టాలు & నిబంధనలకు అనుగుణంగా" నడుచుకుంటుంది, అధికారులకు సహకరిస్తుందని సంస్థ తెలిపింది. గత కొన్ని ఏళ్లుగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైనా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు విదేశీ పెట్టుబడుల సమీకరణలో నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ విషయంలోనే ఈడీ దర్యాప్తు చేస్తోంది. వాల్‌మార్ట్ 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను $16 బిలియన్లకు(సుమారు రూ.1,16,800 కోట్లు) కొనుగోలు చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఒప్పందం. -
ఒక్క లోను పొందాలంటే వంద తిప్పలు.. అందుకే ‘నావి’ వచ్చింది
Sachin Bansal Biography: ఫ్లిప్‌కార్ట్, ఇండియాలో ఇ కామర్స్‌కి రాచబాటలు వేసిన స్టార్టప్. సచిన్బన్సాల్, బిన్ని బన్సాల్ అనే ఇద్దరు యువ ఇంజనీర్లు స్థాపించిన ఇ కామర్స్ కంపెనీ మన దగ్గర రికార్డులు సృష్టించింది. 2007లో నాలుగు లక్షలతో ప్రారంభిస్తే 2018లో ఆ కంపెనీలో వాటా అమ్మినందుకు ప్రతిఫలంగా సచిన్ బన్సా్ల్కి వన్ బిలియన్ డాలర్లు ప్రతిఫలంగా దక్కాయి. మన కరెన్సీలో అయితే ఏకంగా 73 వేల కోట్ల రూపాయల పైమాటే. అయితే ఫ్లిప్‌కార్ట్‌ని అమ్మేసిన తర్వాత సచిన్ బన్సాల్ ఏం చేస్తున్నారు? అక్కడ వచ్చని సొమ్మును ఎలా వెచ్చిస్తున్నారు? సమస్య నుంచే పుట్టిందే ఫ్లిప్‌కార్ట్ ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్ చదివేప్పుడు అవసమైర పుస్తకాల కోసం బుక్‌స్టోర్స్ గాలించే వాడు సచిన్ బన్సాల్, ఒక్కో పుస్తకం ఒక్కో షాపులో దొరికేది. కొన్ని పుస్లకాల కోసం నగరంలోని మార్కెట్లను జల్లెడ పట్టాల్సి వచ్చేది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌ని అడిగి పక్క ఊరి నుంచి కూడా పుస్తకాలు తెప్పించుకునే వాడు. తాను పడ్డ ఇబ్బందులకు పరిష్కార మార్గం ఆలోచించే పనిలో పుట్టిందే ఫ్లిప్‌కార్ట్. పుస్తకాల కోసం ఎక్కడెక్కడో తిరగకుండా ఒకే చోట అన్ని లభించేలా ఆన్లైన్ బుక్‌స్టోర్‌గా ఫ్లిప్‌కార్ట్ ప్రారంభమైంది. నాలుగు లక్షల పెట్టుబడి ఇండియా ఐటీ సెక్టార్ క్యాపిటల్ బెంగళూరు కేంద్రంగా కేవలం రూ. 4,00,000 పెట్టుబడితో 2007లో ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో ఓ తప్పనిసరి యాప్‌గా ఫ్లిప్‌కార్ట్ మారింది. మెట్రో నగరాల నుంచి జిల్లా కేంద్రాలు, చిన్న మున్సిపాలిటీల వరకు ఫ్లిప్‌కార్ట్ సేవలు విస్తరించాయి. చివరకు 2018లో వాల్‌మార్ట్ సంస్థ 16 బిలియన్ డాలర్లకు ఈ కంపెనీని కొనుగోలు చేసింది. అప్పుడే ఫ్లిప్‌కార్ట్ నుంచి బయటకు వచ్చారు సచిన్ బన్సాల్. బ్యాంకులు ఇలా పని చేస్తాయా ! ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్‌గా ఉంటూ టెక్నోక్రాట్‌గా ఎంట్రప్యూనర్‌గా అంత వరకు గడిపిన లైఫ్ ఒకటైతే ఆ తర్వాత మరో లైఫ్ గడపాల్సి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ అమ్మగా వచ్చిన బోలెడంత డబ్బు చేతిలో ఉంది. అప్పటి వరకు తన ఆర్థిక వ్యవహారాలు నిర్వహించేందుకు సచిన్ బన్సాల్ ఓ పెద్ద బ్యాంక్‌కి చెందిన యాప్‌ని వినియోగించేవాడు. ఆ సమయంలో ఆ యాప్ క్రాష్ అయ్యింది. నాలుగు రోజుల పాటు పని చేయలేదు. ఆర్థిక లావాదేవీలన్నీ నాలుగు రోజుల పాటు నిలిచి పోయాయి. అప్పడే బ్యాంకులు, వాటి పనితీరు, వాటి నిర్వహాణ పద్దతుల మీద సచిన్‌లో ఆలోచన మొదలైంది. ఆరు నెలల పాటు.. ఫ్లిప్‌కార్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు బ్యాంకులు కష్టమర్ల ఎంపిక, లోన్లు ఇచ్చే తీరు, వసూలు చేసే పద్దతిలను జాగ్రత్తగా గమనించాడు. దాదాపుగా అన్ని బ్యాంకులు ఒకే పద్దతిని అనుసరిస్తూ లోన్లు ఇచ్చేప్పుడు విపరీతమైన ఆలస్యం చేస్తున్నాయనే అభిప్రాయానికి వచ్చాడు. అంతేకాదు అర్హత కలిగిన ఎంతో మందికి బ్యాంకుల ద్వారా లోన్లు పొందడం కష్టంగా ఉందనే విషయం అర్థమైంది. ఇక బ్యాంకుల డిజిటల్ లావాదేవీలు జటిలంగా ఉండటానికి గమనించాడు. నావికి రూపకల్పన సామాన్యుల నుంచి బిజినెస్ టైకూన్ల వరకు అందరి ఆర్థిక వ్యవహరాలు నిర్వర్తించడానికి వీలుగా ఉండేలా నావి పేరుతో డిజిటల్ ఫైనాన్సియల సర్వీసెస్ యాప్‌ని సచిన్ బన్సాల్ రూపకల్పన చేశారు. నావిగేటర్ అనే పదం నుంచి నావిని తీసుకున్నారు. హోం లోన్లు, పర్సనల్ లోన్లతో పాటు హెల్త్ ఇన్సురెన్స్ సేవలను అందివ్వడం నావి ప్రత్యేకత. 20 నిమిషాల్లోనే నావి ద్వారా లోన్లు పొందేందుకు బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ, వందల కొద్ది సంతకాలు, పదుల కొద్ది డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ఐదు నుంచి 20 నిమిషాల లోపే అన్ని పనులు నావి యాప్ ద్వారా చేసేయోచ్చని ఆ వెంటనే లోన్ పొందవచ్చని సచిన్ చెబుతున్నారు. తమ యాప్‌లోని ఆర్టిఫీషియల ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో పని త్వరగా పూర్తి అవుతుందని హామీ ఇస్తున్నారు. రికవరీ కూడా అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. వంద కోట్ల మందికి వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి నావి డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ద్వారా రూ. 4200 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా రూ. 900 కోట్లు రుణాలు ఇచ్చారు. కేవలం మైక్రోఫైనాన్స్లకే రూ.1500 కోట్లు ఇవ్వాలని లక్క్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలోనే నావి బ్యాంకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ బ్యాంకులు ప్రధానంగా ఆన్లైన్ వేదికగానే ఎక్కువ పనులు చక్కబెడతాయి. వంద కోట్ల మందికి సేవలు అందివ్వాలన్నదే లక్క్ష్యంగా నావి ముందుకు పోతుంది. భవిష్యత్తు డిజిటల్‌దే ఒకప్పుడు మన దగ్గర ఒక వస్తువు కొనేప్పుడు దాన్ని ముట్టుకుని, గట్టిగా పట్టుకుని సంతృప్తి చెందితేనే కొనే అలావాటు ఉండేది. అలాంటిది ఫ్లిప్‌కార్ట్ రాకతో నెట్లో చూసి నమ్మకంతో వేల రూపాయల వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. పదేళ్లలో బిలియన్ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దారు. అదే తీరులో నావి కూడా భవిష్యత్తులో ప్రతీ ఒక్కరికి చేరువ అవుతుందనే నమ్మకంతో సచిన్ ఉన్నారు. ఎందుకంటే 5జీ రాకతో డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని సచిన్ అంటున్నారు. మనీకంట్రోల్ సౌజన్యంతో చదవండి: Alibaba: అత్యాచార బాధితురాలికి అండగా పోస్టులు.. పది మంది ఎంప్లాయిస్ డిస్మిస్ -
అపుడు లాక్డౌన్ పరిస్థితి వచ్చి వుంటే..
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ మాజీ సీఈఓ సచిన్ బన్సల్ కరోనా వైరస్, లాక్డౌన్ పరిస్థితులపై మరోసారి స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన అనంతరం ఆయన చిన్న వ్యాపారులు, వారి ఆర్థిక కష్టాలపై వరుస ట్వీట్లలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన బాల్యంలో కోవిడ్-19 లాక్డౌన్ పరిస్థితులు వచ్చి వుంటే చిన్న వ్యాపారం చేసుకునే తన తండ్రి సంక్షోభంలో చిక్కుకునే వారనీ పేర్కొన్నారు. అంతేకాదు ఈ కారణంగా తాను మధ్య తరగతి జీవిగా కాకుండా పేదరికంలోకి జారిపోయేవాడినని ట్వీట్ చేశారు. తాను అనుకున్నది సాధించలేకపోయేవాడినని, ప్రస్తుతం లక్షలాది మంది పిల్లలు సంకట పరిస్థితుల్లో కూరుకుపోయా రంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.(ఆర్థికమంత్రి ప్యాకేజీ మొత్తం వివరాలు ప్రకటిస్తారా?) కరోనావైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రధాని మోదీ రూ .20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడం తోపాటు, నాలుగవ దశ లాక్డౌన్ వుంటుందనే సంకేతాలిచ్చిన తరువాత సచిన్ బన్సల్ వరుస ట్వీట్లు చేశారు. ప్రజలు వైరస్‌తో జీవించడం నేర్చుకోవలసి ఉంటుందని, టీకా కోసం ఎదురు చూస్తూ రెండు సంవత్సరాలు ఇళ్లలో బందీలుగా ఉండలేమంటూ గత నెలలో సచిన్ బన్సల్ ట్వీట్ చేసిన సంగతి విదితమే. I wouldn't have managed to achieve a fraction of what I did without that enabling environment. THIS is actually happening to lakhs of kids today. (2/2) — Sachin Bansal (@_sachinbansal) May 12, 2020 -
ఫ్లిప్‌కార్ట్ కో ఫౌండర్‌పై వరకట్న వేధింపుల కేసు
సాక్షి, బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్‌పై వరకట్నం వేదింపుల కేసు నమోదైంది. సచిన్ భార్య ప్రియా బన్సాల్ (35) బెంగళూరు కోరమంగళ పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఆస్తులను సచిన్‌కు బదిలీ చేయడానికి నిరాకరించడంతో అతని తల్లిదండ్రులు, సోదరుడు తనను మానసికంగా, శారీరకంగా వేధించారనేది ప్రధాన ఆరోపణ. భర్త సచిన్ బన్సాల్, మామ సత్య ప్రకాష్ అగర్వాల్, అత్త కిరణ్ బన్సాల్, సచిన్ సోదరుడు నితిన్ బన్సాల్ పై ఆమె ఫిర్యాదు నమోదు చేశారు. వృత్తిపరంగా దంత వైద్యురాలైన ప్రియ అందించిన సమాచారం ప్రకారం 2008లో ప్రియ, సచిన్‌ల వివాహమైంది. వివాహ సమాయంలో 50లక్షల రూపాయలను ఖర్చు చేసివివాహం చేయడంతోపాటు కట్నంగా రూ. 11 లక్షలు కట్నంగా ఇచ్చారు. గత కొంతకాలంగా ఆస్తులను తన పేరుతో మార్చాల్సిందిగా సచిన్ డిమాండ్ చేస్తున్నాడని, గత ఏడాది అక్టోబర్‌లో భర్త( సచిన్) తనపై శారీరకంగా దాడి చేశాడని, డబ్బు డిమాండ్ చేశాడని ప్రియ ఆరోపించారు. అలాగే ఢిల్లీ వెళ్లిన సందర్భంలో తన సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కూడా ఫిబ్రవరి 28 న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అసలు వివాహానికి ముందే కట్నం కోసం తనను వేధించారని ప్రియ ఆరోపించారు. దీంతో 498 ఎ (వరకట్న వేధింపులు), 34 (క్రిమినల్ ఉద్దేశం) వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నలుగురి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 29న సచిన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా దీనిపై నిర్ణయం గురువారం వెలువడనుందని సమాచారం. అయితే కొన్ని వారాల క్రితమే అత్త కిరణ్ బన్సాల్ కోడలు ప్రియపై కేసు నమోదు చేసినట్టు కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. కాగా 2018లో ప్రపంచ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్లిప్‌కార్ట్‌లో మేజర్ వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ నుంచి నిష్క్రమించిన సచిన్ బన్సాల్ తన వాటాను విక్రయించడం ద్వారా ఒక బిలియన్ డాలర్లను సొంతం చేసుకున్నారు. అనంతరం 450 మిలియన్ డాలర్లు పెట్టుబడులతో అంకిత్ అగర్వాల్‌తో కలిసి నవీ టెక్నాలజీస్ పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించాడు. దీంతోపాటు ఓలాలో 100 మిలియన్ల డాలర్లు పెట్టుబడులు సహా , ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ అథెర్, ఇన్‌షార్ట్స్, గ్రే ఆరెంజ్, యునా అకాడమీ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. మరోవైపు ఈ ఆరోపణలపై సచిల్ బన్సాల్ స్పందించాల్సి వుంది. -
క్రిడ్స్‌లో సచిన్ బన్సాల్ 739 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: చైతన్య రూరల్ ఇంటర్మీడియేషన్ డెవలప్మెంట్ సర్వీసెస్(క్రిడ్స్)లో సచిన్ బన్సాల్ రూ.739 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతేకాకుండా ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)కి ఆయన సీఈఓగా కూడా వ్యవహరించనున్నారు. బ్యాంకింగ్ సేవలందని వారికి క్రిడ్స్ రుణాలందిస్తోందని, ఈ సంస్థలో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక సేవల రంగంలోకి ప్రవేశిస్తున్నామని సచిన్ బన్సాల్ పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ ఆ సంస్థలో తన వాటాను విక్రయించాక జోరుగా స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఓలా, బౌన్స్ తదితర స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు. -
ఓలాలో సచిన్ బన్సల్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సల్, ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలాలో రూ.650 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ నిధుల దన్నుతో మరో ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్‌కు ఓలా మరింత గట్టిపోటీని ఇస్తుందని అంచనా. కాగా సచిన్ బన్సల్ వ్యక్తిగతంగా ఈ పెట్టుబడులు పెట్టారని ఓలా పేర్కొంది. ఓలాలో వ్యక్తిగత పెట్టుబడులు అత్యధికంగా పెట్టిందని సచిన్ బన్సలేనని ఓలా సీఈఓ భవీశ్ అగర్వాల్ పేర్కొన్నారు. సచిన్ బన్సల్ తమ కంపెనీలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎంటర్ప్రెన్యూర్షిప్కు సచిన్ ఒక నమూనా అని ప్రశంసించారు. సిరీస్ జే రౌండ్ నిధుల సమీకరణలో భాగంగా ఈ ఏడాది జనవరిలో ఓలా కంపెనీ సచిన్ బన్సల్‌కు రూ.150 కోట్ల విలువైన షేర్లను జారీ చేసింది. పదేళ్ల క్రితం బిన్నీ బన్సల్‌తో కలిసి సచిన్ బన్సల్ ఫ్లిప్‌కార్ట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ 1,600 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. -
ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్స్‌కు ఐటీ నోటీసులు
ఈ కామర్స్ మార్కెట్లో అతిపెద్ద డీల్‌గా నిలిచిన వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందంపై ఆదాయపన్ను శాఖ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్‌లకు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. వాల్‌మార్ట్ ఒప్పందానికి సంబంధించి ఆదాయ వివరాలను వెల్లడించాల్సిందిగా కోరింది. అలాగే వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందంలో భాగంగా చేతులు మారిన నగదు వివరాలు అందించాలని కోరింది. నికర లాభం, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను కూడా ఐటీ శాఖ కోరినట్టు సమాచారం.వీరితోపాటు సంస్థలోని 35మంది వాటాదారులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం భారతీయులైన సచిన్,బిన్నీ బన్సల్ ద్వయం 20శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే వాటా అమ్మకం, పన్ను చెల్లింపులకు సంబంధించి ఐటీ శాఖ నుంచి కొన్ని నెలల క్రితమే నోటీసులు అందాయనీ, అయితే ఆ నోటీసులకు సంబంధించి మేము అప్పుడే వివరణ ఇచ్చామని కో ఫౌండర్ బిన్నీ బన్సల్ తెలిపారు. కాగా అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం వాల్‌మార్ట్, దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్టులో మేజర్ (77శాతం) వాటాను కొనుగోలు చేసింది. సెప్టెంబర్‌లో ప్రకటించిన ఈ డీల్ విలువు దాదాపు రూ.13750కోట్లు (16 బిలియన్ డార్లు). ఒప్పందంలో భాగంగా ఇప్పటికే సుమారు రూ.7439కోట్లు వాల్‌మార్ట్ చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను వెల్లడించాల్సిందిగా ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఈ డీల్ ముగిసిన అనంతరం ఫౌండర్లలో ఒకరైన సచిన్ బన్సల్ ఫ్లిప్‌కార్ట్‌లో తన 5-6శాతం వాటాను అమ్ముకొని సంస్థకు గుడ్ బై చెప్పారు. మరో ఫౌండర్ బిన్సీ బన్సల్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ నెలలో ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవికి రాజీనామా చేశారు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో అతిపెద్ద వాటాదారుడుగా కొనసాగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఓలాలో సచిన్ బన్సల్ భారీ పెట్టుబడులు
సాక్షి, ముంబై: క్యాబ్ అగ్రిగేటర్ ఓలాలో దేశీయంగా భారీ పెట్టుబడులను సాధించింది. ఫ్లిప్‌కార్ట్ కో ఫౌండర్ , మాజీ సీఈవో సచిన్ బన్సల్ ఓలాలో పెట్టుబడులకు సిద్ధపడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో 5.5శాతం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించిన అనంతరం సచిన్ ఓలాలో 100 మిలియన్ డాలర్లను (740కోట్ల రూపాయలను) ఇన్వెస్ట్ చేయనున్నారని సమచారం. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం సచిన్ బన్సల్ ఫ్లిప్కార్ట్నుంచి వైదొలగిన అనంతరం భారీ ఎత్తున వ్యక్తిగతంగా (10శాతం) పెట్టుబడులను పెట్టనున్నారు. ఓలా ఫౌండర్స్ భవిష అగర్వాల్, అంకిత్ అగర్వాల్‌కు సన్నిహితుడైన సచిన్ దాదాపు 10శాతం వాటాను కొనుగోలు చేయనున్నారు. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సాల్ తన మొత్తం 5.5 శాతం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించిన అనంతరం కంపెనీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఓలా వ్యవస్థాపకులకు జపాన్ ప్రధాన పెట్టుబడిదారు సాఫ్ట్‌బ్యాంకుతో ఉన్న స్వల్ప బోర్డు వివాదం బన్సల్ రాకతో సమసిపోనుందని భావిస్తున్నారు. -
నా భార్యను మాత్రం ఒప్పించలేకపోతున్నా : బిన్నీ
బెంగళూరు : దేశీయ ఈ- కామర్స్ దిగ్గజంగా పేరొందిన ఫ్లిప్‌కార్ట్, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సొంతమైన విషయం తెలిసిందే. 16 బిలియన్ డాలర్లతో కుదిరిన ఈ మెగా ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షేర్ల బదలాయింపు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలకు సంబంధించిన ప్రక్రియ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుందని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిన్నీ బన్సల్ తెలిపారు. ఎస్ఏపీ లాబ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బిన్నీ బన్సల్ ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ స్థాపించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. ఢిల్లీ ఐఐటీలో చదువుకున్న తాను మొదట సార్నాఫ్ కార్పొరేషన్‌లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేసినట్లు చెప్పారు. సాంకేతిక రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన గూగుల్‌లో పని చేయాలని తనకెంతో ఆసక్తిగా ఉండేదని, అక్కడ ఉద్యోగం సంపాదించుకునేందుకు రెండుసార్లు అప్లై చేసినట్లు పేర్కొన్నారు. కానీ అక్కడి నుంచి బదులు రాకపోవడంతో తన పనిలో నిమగ్నమయ్యానని చెప్పుకొచ్చారు. తర్వాత అమెజాన్ కంపెనీలో తన సహోద్యోగి సచిన్ బన్సల్‌తో కలిసి పదకొండేళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో డబుల్ బెడ్రూం అపార్ట్మెంట్లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 8.3 లక్షల చదరపు అడుగులకు విస్తరించిందని పేర్కొన్నారు. నా భార్యను మాత్రం ఒప్పించలేకపోతున్నాను.. ఈ కామర్స్ రంగంలో పోటీ విపరీతంగా పెరిగిందన్న బిన్నీ.. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో వినియోగదారులను ఆకట్టుకోవాల్సి ఉంటుందన్నారు. వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా ఫీచర్లు డెవలప్ చేస్తేనే ఎక్కువ రోజులు మనుగడ సాధించగలమని పేర్కొన్నారు. కానీ అది చాలా సవాలుతో కూడుకున్న పని అంటూ.. ‘ నా భార్య దాదాపు ప్రతిరోజూ ఆన్లైన్ షాపింగ్ చేస్తుంది. బిగ్‌బాస్కెట్(ఆన్లైన్ కంపెనీ)లోనే కూరగాయలు కొంటుంది. అదేంటి మన కంపెనీ(ఫ్లిప్‌కార్ట్) నుంచే ఆర్డర్ చేయొచ్చుగా అంటే కొత్త ఫీచర్లు తీసుకురండి అప్పుడు చూద్దాం ఆలోచిస్తా అని చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా ఆమెను ఒప్పించలేకపోతున్నా. అలా ఉంటుంది మన పరిస్థితి’ అంటూ ఆన్లైన్ కంపెనీల మధ్య ఉన్న పోటీ గురించి చెప్పుకొచ్చారు. కాగా వాల్‌మార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సచిన్ బన్సాల్ కంపెనీ నుంచి వైదొలుగుతున్నప్పటికీ, బిన్నీ బన్సాల్ మాత్రం గ్రూప్ సీఈవోగా కంపెనీలోనే కొనసాగనున్న విషయం తెలిసిందే. -
మెగా డీల్‌తో సచిన్‌కు రూ.6700 కోట్లు
ముంబై : ఈ-కామర్స్ మార్కెట్ అతిపెద్ద డీల్ నేడు ఖరారైంది. గత ఎన్నో రోజులుగా చక్కర్లు కొడుతున్న ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ వశమైపోయింది. అమెరికాకు చెందినరిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 16 బిలియన డాలర్లకు కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లలో ఇదే అతిపెద్దది కావడం విశేషం. ఈ డీల్ నేపథ్యంలో 11ఏళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించిన వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సాల్ కంపెనీ నుంచి పూర్తిగా వైదొలిగారు. ఫ్లిప్‌కార్ట్‌లో తనకున్న 5.5 శాతం వాటాను అమ్మేశారు. దీంతో సచిన్ బన్సాల్ రూ.6700 కోట్లకు పైగా(1బిలియన్ డాలర్లు) పొందారు. అంతేకాక సచిన్ మరోసారి తన బిలీనియర్ స్టేటస్‌ను పొందగలిగారు. మరో వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ కూడా ఈ డీల్‌లో భాగంగా ప్రస్తుతం తను కలిగి ఉన్న వాటాలో 10 శాతం అమ్మేశారు. దీంతో బిన్నీ బన్సాల్ వాటా 5.1 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. ఈ వాటా విక్రయంతో బిన్నీ బన్సాల్ కూడా బిలీనియర్ అయ్యారు. సచిన్ బన్సాల్ కంపెనీ నుంచి వైదొలుగుతున్నప్పటికీ, బిన్నీ బన్సాల్ మాత్రం గ్రూప్ సీఈవోగా కంపెనీలోనే ఉండనున్నారు. మరోవైపు కంపెనీ బోర్డుపై వాల్‌మార్ట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. టెన్సెంట్, టైగర్ గ్లోబల్ ఫ్లిప్‌కార్ట్ బోర్డులో కొనసాగనున్నాయని, కొత్త సభ్యులు వాల్‌మార్ట్ నుంచి వచ్చి చేరతారని తెలుస్తోంది. -
ఫ్లిప్‌కార్ట్ జర్నీ ఇలా సాగింది...
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజంగా పేరున్న ఫ్లిప్‌కార్ట్, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సొంతమైపోయింది. మెగా డీల్ ఖరారు కావడంతో, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా వాల్‌మార్ట్ ఆధీనంలోకి వచ్చేసినట్టు సాఫ్ట్‌బ్యాంకు సీఈవో మయవోషి సన్ ధృవీకరించేశారు. ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ జర్నీ ఎలా సాగిందో ఓ సారి తెలుసుకుందాం.... ఫ్లిప్‌కార్ట్ ప్రారంభం.... వ్యాపారవేత్తలుగా ఎదగాలనే కలలతో ఉన్న ఓ ఇద్దరు ఐఐటీ-ఢిల్లీ గ్రాడ్యుయేట్లు, అమెజాన్‌లో తమకున్న ఉద్యోగాన్ని వదిలేసి ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం అంటే 2007లో బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో డబుల్ బెడ్రూం అపార్ట్మెంట్లో ఈ సంస్థకు అంకురార్పణ చేశారు. వారే బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్‌లు. వీరిద్దరూ ఛండీఘర్‌కు చెందిన వారు. చివరి పేరు ఒకటే అయిన తెలిసిన వాళ్లేమీ కాదు. ఐఐటీ-ఢిల్లీలో చదువుకునే రోజుల నుంచే పరిచయం. అమెజాన్‌లో చేరిన తర్వాత ఈ ఇద్దరూ స్నేహితులుగా మారారు. ఫ్లిప్‌కార్ట్ విస్తరణ.... 2008లో బెంగళూరుతో తమ తొలి ఆఫీసును ప్రారంభించి అనంతరం, ఢిల్లీ, ముంబైలలో కూడా 2009లో ఫ్లిప్‌కార్ట్ ఆఫీసులను ఏర్పాటు చేశారు. డబుల్-బెడ్రూం అపార్ట్మెంట్లో ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం 8.3 లక్షల చదరపు అడుగులకు విస్తరించింది. ఇటీవలే బెంగళూరులో ఓ పెద్ద క్యాంపస్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. బెంగళూరులో ఉన్న ఆఫీసులన్నింటిన్నీ ఒకే గూటికి కిందకి అంటే ఆ క్యాంపస్‌లోకి తరలించింది. ఫ్లిప్‌కార్ట్ నాయకత్వ మార్పులు.... ప్రారంభించినప్పటి నుంచి తొమ్మిదేళ్ల పాటు ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా సచిన్ బన్సాల్నే ఉన్నారు. 2016లో తొలిసారి సచిన్ బన్సాల్ నుంచి బిన్నీ బన్సాల్ సీఈవో పదవిని అలంకరించారు. అనంతరం సచిన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవిని కల్యాణ్ కృష్ణమూర్తికి అప్పజెప్పారు. ప్రస్తుతం బిన్నీ బన్సాల్ మొత్తం గ్రూప్‌కు సీఈవోగా బాధ్యతలు చేపడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో ఫ్యాషన్ పోర్టల్స్ మింత్రా జబాంగ్, పేమెంట్స్ యూనిట్ ఫోన్‌పే, లాజిస్టిక్ ఆర్మ్ ఈకార్ట్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లు... 2014లో ఫ్లిప్‌కార్ట్, ఆన్లైన్ అప్పీరల్ రిటైలర్ మింత్రాను 300 మిలియన్ డాలర్లకు తన సొంతం చేసుకుంది. అనంతరం జబాంగ్ను 2016లో 70 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఫోన్‌పేను 2016లోనే తన సొంతం చేసుకుంది. ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడిదారులు... వాల్‌మార్ట్ సొంతం చేసుకోక ముందు ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద పెట్టుబడిదారుగా జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు ఉండేది. 23-24 శాతం వాటాను కలిగి ఉంది. కానీ వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయడంతో, పూర్తిగా ఆ కంపెనీ నుంచి సాఫ్ట్‌బ్యాంక్ వైదొలుగుతోంది. ఇంటర్నెట్ దిగ్గజం నాస్సర్స్ కూడా 13 శాతం వాటాను కలిగి ఉండేది. ఇది కూడా తన వాటాను విక్రయించేస్తోంది. ఇతర పెట్టుబడిదారులు న్యూయార్క్‌కు చెందిన హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్, అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అస్సెల్ పార్టనర్స్, చైనాకు చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఈబే ఇంక్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్లు ఉన్నాయి. -
ఫ్లిప్‌కార్ట్‌కు సచిన్ బన్సాల్ గుడ్‌బై..?
బెంగళూరు : సచిన్ బన్సాల్ దాదాపు అందరికీ ఈ పేరు సుపరిచితమే. భారత్ ఈ-కామర్స్ దిగ్గజంగా ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించిన వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. అయితే ఈయన ఇప్పుడు తన సొంత సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు గుడ్‌బై చెబుతున్నారట. ఫ్లిప్‌కార్ట్‌ను, అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తన సొంతం చేసుకుంటుండగా... ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సచిన్ బన్సాల్ వైదొలుగుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. దశాబ్దం క్రితం నుంచి అన్ని తానే అనుకుని ఫ్లిప్‌కార్ట్‌ను మార్కెట్లో అగ్రగామిగా ఉంచుతున్న సచిన్ బన్సాల్ కంపెనీని నుంచి బయటికి వచ్చేస్తుండటం గమనార్హంగా మారింది. ఫ్లిప్‌కార్ట్‌కు ఎక్కువ కాలం సీఈవోగా పనిచేసిన ఘనత కూడా ఇతనిదే. అయితే ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌కు అప్పగించిన తర్వాత మరో స్టార్టప్‌ను ఆయన ప్రారంభించబోతున్నట్టు, అంతేకాక పారిశ్రామిక వేత్తలకు మెంటర్‌గా నిర్వహించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాల్‌మార్ట్ డీల్‌తో, సచిన్ వైదొలిగే చర్చలు గత మూడు నాలుగు రోజుల నుంచి జరుగుతున్నాయని ఒకరు పేర్కొన్నారు. వచ్చే వారంలో ఫ్లిప్‌కార్ట్ నుంచి సచిన్ వెళ్లిపోయే నిర్ణయం వెలువడుతుందని, వాల్‌మార్టే బోర్డు ఆకృతులను నిర్ణయిస్తుందని మరో సంబంధిత వ్యక్తి పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్ నుంచి వెళ్లే సచిన్ బయటికి వెళ్లే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓగా ఉన్న బిన్నీ బన్సాల్, ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తిలను రోజువారీ కార్యకలాపాలను చూసుకోవాలనుకుంటున్నట్టు వాల్‌మార్ట్ చెప్పింది. ప్రస్తుతం 10 మంది సభ్యులున్న ఫ్లిప్‌కార్ట్ బోర్డులో సచిన్, బిన్నీ బన్సాల్‌లు కూడా సభ్యులే. కల్యాణ్ బోర్డులో సభ్యుడు కాదు. అయితే ఈ విషయంపై మాత్రం స్పందించడానికి సచిన్ బన్సాల్ నిరాకరించారు. వాల్‌మార్ట్ డీల్‌లో భాగంగా బిన్నీ బన్సాల్ తనకున్న షేర్లలో పదోవంతు అమ్మేస్తున్నారు. సచిన్ బన్సాల్ ఎంత విక్రయిస్తున్నారో ఇంకా తెలియరాలేదు. ఒకవేళ ఈ డీల్ కుదిరితే సచిన్ బన్సాల్ ఫ్లిప్‌కార్ట్‌లో 5.5 శాతం స్టేక్‌ను కలిగి ఉండనున్నారు. మరోవైపు ఆశ్చర్యకరంగా వాల్‌మార్ట్ డీల్‌కు బ్రేక్ వేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌ను కొనేందుకు అమెజాన్ కూడా భారీ ఆఫర్‌ను ప్రకటిస్తోంది. అయితే అమెజాన్‌కు అమ్మేందుకు సంసిద్ధంగా లేని ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ టాప్ మేనేజ్మెంట్ మార్పులు పెద్ద కొత్త విషయమేమీ కాదని, కానీ వ్యవస్థాపకుల్లో ఒకరు వైదొలగడం కీలక పరిణామమే అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అమెజాన్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లైన బన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్‌లు కలిసి 2007లో ఈ కంపెనీని ప్రారంభించారు. 2016 జనవరి వరకు ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా సచిన్ బన్సాల్నే ఉన్నారు. -
ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులపై కేసు!!
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ ఈ–కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ వ్యవస్థాపకులపై కేసు నమోదయ్యింది. సంస్థ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ సహా ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటివ్స్ తనకు రూ.9.96 కోట్ల మేర మోసం చేశారంటూ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నవీన్ కుమార్ కేసు పెట్టారు. టాప్ ఎగ్జిక్యూటివ్స్లో సేల్స్ డైరెక్టర్ హరి, అకౌంట్స్ మేనేజర్లు సుమిత్ ఆనంద్, శారౌక్యు ఉన్నారు. ‘‘బిగ్ బిలియన్ డే సేల్కు 14,000 ల్యాప్‌టాప్‌లను సరఫరా చేశా. అందులో ఫ్లిప్‌కార్ట్ 1,482 యూనిట్లను వెనక్కు ఇచ్చింది. మిగిలిన వాటికి డబ్బుల్ని చెల్లించలేదు. చివరికి టీడీఎస్, షిప్పింగ్ చార్జీలు కూడా ఇవ్వలేదు. డబ్బుల్ని చెల్లించమని అడిగితే 3,901 యూనిట్లు వెనక్కు ఇచ్చినట్లు చెబుతున్నారు. నాకు రూ.9.96 కోట్లు చెల్లించకుండా మోసం చేశారు’‘ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ విషయమై ఫ్లిప్‌కార్ట్ నుంచి ఎటువంటి ప్రతిస్పందనా రాలేదు. -
ఫ్లిప్‌కార్ట్‌కు మరో షాక్!
-
ఫ్లిప్‌కార్ట్‌కు మరో షాక్!
మరో ముఖ్య అధికారి ఔట్ కొనసాగుతున్న మేధో వలస కీలకమైన పండుగల సీజన్లో దేశంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్సైట్ అయిన ఫ్లిప్‌కార్ట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ నుంచి ఉన్నతస్థాయి మేధో అధికారుల వలస కొనసాగుతున్నది. ఈ ఏడాది చివరినాటికి సంస్థ ప్రధాన ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) సంజయ్ బవేజా ఫ్లిప్‌కార్ట్‌ను వీడి వెళ్లనున్నారు. ఆయన రాజీనామా విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. కీలకమైన పండుగల సీజన్ ఉండటం, ఈ నేపథ్యంలో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ నుంచి బిలియన్ డాలర్ల (రూ. 6600 కోట్ల) పెట్టుబడులు రాబట్టేందుకు ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. టాటా కమ్యూనికేషన్ సంస్థను వీడి 2014 సెప్టెంబర్‌లో బవేజా ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. రాబోయే డిసెంబర్ 31 ఆయన సంస్థలో పనిచేసే చివరిరోజని, ఆయన స్థానంలో కొత్త సీఎఫ్‌వోను నియమించే ప్రయత్నాలు మొదలయ్యాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇటీవలికాలంలో ఫ్లిప్‌కార్ట్ నుంచి కీలకమైన ముఖ్య అధికారులు వెళ్లిపోవడం గమనార్హం. సంస్థ కామర్స్, అడ్వర్టైజింగ్ చీఫ్‌గా ఉన్న ముఖేష్ బన్సల్ ఇప్పటికే రాజీనామా చేశారు. ఆయన బాటలోనే చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి కూడా నడిచారు. అయితే, నగోరి క్రీడారంగంలో సొంత వెంచర్‌ను స్థాపించేందుకు ఫ్లిప్‌కార్ట్ కు రాజీనామా చేయగా.. ఆయన సంస్థలో ఫ్లిప్‌కార్ట్ సహా స్థాపకులైన సచిన్, బిన్నీ బన్సల్ పెట్టుబడులు పెట్టడం గమనార్హం. ఇక, ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునిత్ సోనీ, వైస్ ప్రెసిడెంట్ మనీష్ మహేశ్వరీ గత ఏప్రిల్‌లో సంస్థకు రాజీనామా చేసి.. తమ దారి తాము చూసుకున్నారు. -
ట్విట్టర్లో దిగ్గజ కంపెనీ సీఈవోల వార్!
ఆన్లైన్ మార్కెట్ వచ్చాక భారత్ లో వ్యాపారం బాగా ఊపుకుంది. అదేవిధంగా కంపెనీల సీఈవోలు తమ మార్కెట్ విస్తరణ, వ్యాపారం లాభాల పంట పండించాలని ఆలోచిస్తారు. ప్రస్తుతం ఆన్ లైన్ మార్కెట్లో అవి రెండు పెద్ద మార్కెట్లు.. ఆ కంపెనీ సీఈవోలు మధ్య సహజంగానే పోటీ నెలకొని ఉంటుంది. అయితే ఆ పోటీ కాస్తా వాగ్వాదానికి దారితీయడం హాట్ టాపిక్ గా మారింది. ట్విటర్ వేదికగా చేసుకుని స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ సీఈవోలు ఒకరిపై మరొకరు వ్యాఖ్యలు చేసుకున్నారు. చైనాకు చెందిన ఆన్లైన్ దిగ్గజ సంస్థ అలీబాబా త్వరలో భారత్ మార్కెట్లలోకి నేరుగా ప్రవేశించనుంది. ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులలో ఒకరైన సచిన్ బన్సాల్ (ఎగ్జిక్యూటీవ్ చైర్మన్) తీవ్రంగా స్పందించారు. అలీబాబా కంపెనీ మన దేశీయ మార్కెట్లోకి నేరుగా రావాలని చూస్తుందంటే మన దగ్గర పెట్టుబడులు పెట్టిన ఆ సంస్థలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో అర్థం చేసుకోవచ్చునని బన్సాల్ ట్విట్టర్ ద్వారా మాటల యుద్ధానికి తెరలేపారు. స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బహల్ సీరియస్ అయ్యారు. 5 బిలియన్ డాలర్ల ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ క్యాపిటెల్‌ను మోర్గాన్ స్టాన్లీ ముంచేసిన విషయం మరిచిపోయావా అంటూ చురకలు అంటించారు. వ్యాఖ్యలు చేయడం ఆపి, ఎవరి వ్యాపారం వాళ్లు చూసుకుంటే మంచిదని ట్విటర్లోనే కునాల్ బహల్ ఘాటుగా జవాబిచ్చారు. Didn't Morgan Stanley just flush 5bn worth market cap in Flipkart down the -
ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా బిన్నీ బన్సల్
ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సచిన్ బన్సల్ న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా టాప్ మేనేజ్మెంటులో మార్పులు చేపట్టింది. వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్నీ బన్సల్ కొత్త సీఈవోగా వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా ఆ స్థానంలో ఉన్న మరో వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ ఇకపై సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. బిన్నీ ఇప్పటిదాకా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా (సీవోవో) ఉన్నారు. ఈకార్ట్, కామర్స్, మింత్రా తదితర వ్యాపార విభాగాలన్నీ కూడా ఇక నుంచి బిన్నీ బన్సల్ పర్యవేక్షణలో ఉంటాయి. అలాగే కార్పొరేట్ కమ్యూనికేషన్స్, మానవ వనరులు, ఫైనాన్స్ మొదలైన విభాగాలు ఆయన పరిధిలోకి వస్తాయని ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో సచిన్ బన్సల్.. కంపెనీకి వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తారని వివరించింది. అటు ఫ్లిప్‌కార్ట్‌లో భాగమైన ఆన్లైన్ ఫ్యాషన్ రిటైల్ సంస్థ మింత్రా చైర్మన్ ముకేశ్ బన్సల్ ఇకపై కూడా అదే హోదాలో కొనసాగుతారు. అలాగే ఫ్లిప్‌కార్ట్ వాణిజ్య కార్యకలాపాలతో పాటు ప్రకటనల విభాగాన్ని కూడా పర్యవేక్షిస్తారు. దేశీయంగా ఈ-కామర్స్‌ను మరింత ప్రాచుర్యంలోకి తేవడంలో ఫ్లిప్‌కార్ట్ కీలక పాత్ర పోషించగలదని సచిన్ బన్సల్ పేర్కొన్నారు. -
ఫ్లిప్‘కార్ట్’లోకి 6 వేల కోట్లు
దేశీ ఈ-కామర్స్ రంగంలో అతిపెద్ద నిధుల సమీకరణగా రికార్డు వ్యాపార విస్తరణ, మొబైల్ కామర్స్‌కు వినియోగిస్తామంటున్న కంపెనీ ఐపీఓ ఆలోచనలేదని స్పష్టీకరణ... తాజా డీల్‌తో కంపెనీ విలువ రూ. 42,000 కోట్లుగా అంచనా బెంగళూరు: దేశీ ఈ-కామర్స్ అగ్రగామి ఫ్లిప్‌కార్ట్ అమ్మకాల్లోనేకాదు.. నిధుల సమీకరణలోనూ బిలియన్ డాలర్ల రికార్డును నమోదు చేసింది. ఇన్వెస్టర్ల నుంచి తాజాగా బిలియన్ డాలర్ల(సుమారు రూ.6,000 కోట్లు) నిధులను సమీకరించినట్లు మంగళవారం ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇప్పటివరకూ భారత్‌లోని ఆన్లైన్ షాపింగ్ రంగంలో ఇదే అతిపెద్ద నిధుల సమీకరణ కావడం గమనార్హం. ఇప్పటికే కంపెనీలో పలు వెంచర్ క్యాపిటల్(వీసీ), ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. తాజాగా ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో ప్రస్తుత వాటాదారులైన టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, నాస్పర్స్‌తో పాటు సింగపూర్‌కు చెందిన సావరీన్ వెల్త్ ఫండ్, జీఐసీ, యాక్సెల్ పార్ట్నర్స్, డీఎస్టీ గ్లోబల్, ఐకానిక్ క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంటల్, సోఫ్నియాలు ఉన్నాయి. కాగా, తాజా పెట్టుబడులతో ఎవరికి ఎంత వాటాలున్నాయన్న వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. ఇదిలాఉండగా.. ఈ భారీ నిధుల సమీకరణ నేపథ్యంలో కంపెనీ మార్కెట్ విలువ(వేల్యుయేషన్) దాదాపు రూ.42,000 కోట్లకు ఎగబాకినట్లు పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలే డీఎస్టీ గ్లోబల్ 21 కోట్ల డాలర్లను(సుమారు రూ.1,260 కోట్లు) ఫిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేయడం తెలిసిందే. తాజా పెట్టుబడులను కలిపితే కంపెనీ ఇప్పటిదాకా వివిధ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం 1.7 బిలియన్ డాలర్లకు పైగానే ఉంటుందని అంచనా. ఐపీఓ ప్రణాళికలేవీ లేవు... విక్రేతల సంఖ్యను పెంచుకోవడం, కస్టమర్లకు మరింత మెరుగైన సదుపాయాలు, పరిశోధన- అభివృద్ధి(ఆర్అండ్డీ), ఆన్లైన్-మొబైల్ సేవల విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. భవిష్యత్‌లో తమ కంపెనీని మొబైల్ ఈ-కామర్స్‌లో దూసుకెళ్లేలా చేయడం... ఉత్పత్తులు, టెక్నాలజీలకు సంబంధించి వినూత్న ఒరవడులు తీసుకొచ్చేలా పెట్టుబడులు చేయనున్నామని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సచిన్ బన్సల్ పేర్కొన్నారు. తాము దీనిపై దృష్టిని కేంద్రీకరించేందుకు 2020కల్లా దేశంలో మొబైల్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 50 కోట్లకు ఎగబాకనుండటమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మారేందుకు తాజా నిధులు ఉపయోగపడనున్నాయన్నారు. పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ) కి వచ్చే ప్రణాళికలు, ఆలోచనలేవీ లేవని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. ప్రజల నుంచి నిధులు సమీకరించేంత స్థాయికి ఇంకా తమ బిజినెస్ మోడల్ చేరుకోలేదన్నారు. అమెరికాలో ఫ్లిప్‌కార్ట్‌ను లిస్టింగ్ చేయనున్నారన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో బన్సల్ ఈవిధంగా స్పందించారు. అనతికాలంలోనే.... 2007లో బెంగళూరు కేంద్రంగా సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్‌లు ఫ్లిప్‌కార్ట్‌ను నెలకొల్పారు. ఆన్లైన్ బుక్‌స్టోర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఫ్యాషన్ యాక్సెసరీస్, దుస్తులు ఇలా సమస్త ఉత్పత్తుల అమ్మకానికి వేదికగా నిలుస్తోంది. కంపెనీలో 14,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 2.2 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లను సంపాదించింది. రోజుకు 40 లక్షలకుపైగా విజిట్స్(వెబ్సైట్లో సెర్చ్) నమోదవుతున్నాయి. నెలకు 50 లక్షల మేర ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. గతేడాదిలోనే బిలియన్ డాలర్ల ఆదాయ మార్కును అందుకుంది కూడా. విదేశీ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఈబేలతోపాటు స్నాప్‌డీల్ ఇతరత్రా దేశీ కంపెనీల నుంచి విపరీతమైన పోటీని తట్టుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఈ ఏడాది మే నెలలో ఆన్లైన్ ఫ్యాషన్ రిటైలర్ ‘మింత్రా’ను రూ.2,000 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేయడం తెలిసిందే. -
మార్కెట్లోకి మోటో జీ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల విరామం అనంతరం మోటరోలా తమ కొత్త హ్యాండ్‌సెట్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 8 జీబీ వెర్షన్ ధరను రూ. 12,499గాను, అలాగే 16 జీబీ వెర్షన్ రేటును రూ. 13,999గాను నిర్ణయించింది. గురువారం నుంచి ఆన్లైన్ రిటైలింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి లభ్యమవుతాయని మోటరోలా మొబిలిటీ జీఎం మాగ్నస్ అల్క్విస్ట్ తెలిపారు. అమెరికాలో టెలికం సంస్థలతో కాంట్రాక్టు లేకుండా 8జీబీ ఫోన్ 179 డాలర్లకు (దాదాపు రూ. 11,200), 16 జీబీ ఫోన్ 199 డాలర్లకు (సుమారు రూ. 12,400) లభిస్తోంది. మోటో-జీ లో 4.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, డ్యుయల్ సిమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్‌తో పనిచేసే వీటిని 4.4 కిట్క్యాట్కి అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నీరు చిందినా కూడా ఫోన్ పాడవకుండా ప్రత్యేకంగా కోర్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో మోటో జీని రూపొం దించారు. ఇతర ఫీచర్స్ విషయానికొస్తే.. ఎల్ఈడీ ఫ్లాష్‌తో 5 మెగాపిక్సెల్ కెమెరా, 1.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50 జీబీమేర ఉచితంగా గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ మొదలైనవి ఉన్నాయి. 2012లో గూగుల్ చేతికి వెళ్లినప్పట్నుంచి మోటరోలా భారత్‌లో కొత్త ఉత్పత్తులేవీ ప్రవేశపెట్టలేదు. -
ఇకమొబైల్ కామర్స్ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే రోజుల్లో మొబైల్ కామర్స్ (ఎం-కామర్స్) భారీగా పెరుగుతుందని ఆన్లైన్ రిటైలింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సహ-వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ తెలిపారు. ల్యాప్‌టాప్‌లు వంటి సాధనాల ద్వారా ఈ-కామర్స్ లావాదేవీలు జరపడం కన్నా మొబైల్ యాప్స్ వంటి వాటి ద్వారా షాపింగ్ చేయడం పెరుగుతుందన్నారు. దీంతో, ప్రస్తుతం సుమారు పది శాతంగా ఉన్న ఎం-కామర్స్ వాటా రాబోయే రెండేళ్లలో యాభై శాతానికి పెరగగలదని పేర్కొన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకోగలిగిన కంపెనీలే మనుగడ సాగించగలవని చెప్పారు. శుక్రవారం ఏఐఈఎస్ఈసీ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన యూత్ టు బిజినెస్ ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా సచిన్ బన్సల్ మీడి యాకు ఈ వివరాలు తెలిపారు. దేశీయంగా ఈ-కామర్స్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే కంపెనీలు కేవలం రిటైలింగ్కి మాత్రమే పరిమితం కాకుండా రవాణా తదితర అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక దృష్టితో సర్వీసులను పెద్ద స్థాయిలో విస్తరించేందుకు మౌలిక సదుపాయాలు (గిడ్డంగులు మొదలైనవి), టెక్నాలజీపైన భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నామని ఆయన చెప్పారు. మారు మూల ప్రాంతాలకు కూడా ఈ-కామర్స్ విస్తరించేలా చూడటం ధ్యేయంగా పనిచేస్తున్నామని బన్సల్ వివరించారు. వృద్ధిపైనే దృష్టి.. ఈ-కామర్స్‌లో మార్జిన్లు చాలా స్వల్పంగా ఉంటాయని, అయితే ప్రస్తుతం లాభదాయకత గురించి ఆలోచించడం కన్నా వేగంగా వృద్ధి సాధించడంపైనే దృష్టి పెట్టినట్లు బన్సల్ వివరించారు. ప్రస్తుతం బిలియన్ డాలర్ల స్థాయికి ఎదిగే దిశగా కంపెనీ అడుగులు వేస్తోందని, త్వరలోనే దీన్ని సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే లావాదేవీల విషయానికొస్తే ట్యాబ్లెట్స్ మొదలైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు అత్యధికంగా అమ్ముడవుతున్నట్లు బన్సల్ చెప్పారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 1,000 పైగా విక్రేతలు ఉన్నారని, ఈ సంఖ్యను మరింత పెంచే విధంగా టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అంతకు ముందు.. యువతలో నాయకత్వ ధోరణి పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఏఐఈఎస్ఈసీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బన్సల్ల్తో పాటు టాటా సన్స్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ ముకుంద్ గోవింద్ రాజన్, కోకకోలా ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ జోలీ, మైక్రోసాఫ్ట్ ఇండియా డెరైక్టర్ రజనీష్ మీనన్ వ్యాపార రంగంలో తమ అనుభవాలను వివరించారు.