ఈడీ నోటీసులను కోర్టులో సవాల్‌ చేసిన సచిన్ బన్సాల్ | Flipkart Co-Founder Sachin Bansal Challenges ED Probe in FDI Case | Sakshi
Sakshi News home page

ఈడీ నోటీసులను కోర్టులో సవాల్‌ చేసిన సచిన్ బన్సాల్

Published Sun, Sep 5 2021 5:53 PM | Last Updated on Sun, Sep 5 2021 6:24 PM

Flipkart Co-Founder Sachin Bansal Challenges ED Probe in FDI Case - Sakshi

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జారీ చేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 2009 - 2015 మధ్య విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించినందుకు 1.35 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 9,850 కోట్లు) జరిమానాను ఎందుకు విధించకూడదో వివరించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జూలైలో ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకులు, కొంతమంది పెట్టుబడిదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. (చదవండి: ఆన్‌లైన్‌లో ఐటీ రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?)

చాలా కాలం తర్వాత నోటీసులు జారీ చేశారని.. వాటిని రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. దీన్ని విచారిస్తున్న న్యాయమూర్తి ఆర్ మహదేవన్ ఈ పిటిషన్‌పై ప్రతిస్పందన దాఖలు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ను ఆదేశించారు. ఫ్లిప్‌కార్ట్‌ గతం నుంచి "భారతీయ చట్టాలు & నిబంధనలకు అనుగుణంగా" నడుచుకుంటుంది, అధికారులకు సహకరిస్తుందని సంస్థ తెలిపింది. గత కొన్ని ఏళ్లుగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైనా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ సంస్థలు విదేశీ పెట్టుబడుల సమీకరణలో నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ విషయంలోనే ఈడీ దర్యాప్తు చేస్తోంది. వాల్‌మార్ట్‌ 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను $16 బిలియన్లకు(సుమారు రూ.1,16,800 కోట్లు) కొనుగోలు చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఒప్పందం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement