క్రిడ్స్‌లో సచిన్‌ బన్సాల్‌ 739 కోట్ల పెట్టుబడులు | Sachin Bansal Invests in CRIDS | Sakshi
Sakshi News home page

క్రిడ్స్‌లో సచిన్‌ బన్సాల్‌ 739 కోట్ల పెట్టుబడులు

Published Thu, Sep 26 2019 11:34 AM | Last Updated on Thu, Sep 26 2019 11:34 AM

Sachin Bansal Invests in CRIDS - Sakshi

న్యూఢిల్లీ: చైతన్య రూరల్‌ ఇంటర్మీడియేషన్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌(క్రిడ్స్‌)లో సచిన్‌ బన్సాల్‌ రూ.739 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతేకాకుండా ఈ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)కి ఆయన సీఈఓగా కూడా వ్యవహరించనున్నారు. బ్యాంకింగ్‌ సేవలందని వారికి క్రిడ్స్‌ రుణాలందిస్తోందని, ఈ సంస్థలో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక సేవల రంగంలోకి ప్రవేశిస్తున్నామని సచిన్‌ బన్సాల్‌ పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్‌ ఆ సంస్థలో తన వాటాను విక్రయించాక జోరుగా స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఓలా, బౌన్స్‌ తదితర స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement