సచిన్ బన్సల్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ మాజీ సీఈఓ సచిన్ బన్సల్ కరోనా వైరస్, లాక్‌డౌన్ పరిస్థితులపై మరోసారి స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన అనంతరం ఆయన చిన్న వ్యాపారులు, వారి ఆర్థిక కష్టాలపై వరుస ట్వీట్లలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన బాల్యంలో కోవిడ్-19 లాక్‌డౌన్ పరిస్థితులు వచ్చి వుంటే చిన్న వ్యాపారం చేసుకునే తన తండ్రి సంక్షోభంలో చిక్కుకునే వారనీ పేర్కొన్నారు. అంతేకాదు ఈ కారణంగా తాను మధ్య తరగతి జీవిగా కాకుండా పేదరికంలోకి జారిపోయేవాడినని ట్వీట్ చేశారు. తాను అనుకున్నది సాధించలేకపోయేవాడినని, ప్రస్తుతం లక్షలాది మంది పిల్లలు సంకట పరిస్థితుల్లో కూరుకుపోయా రంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.(ఆర్థికమంత్రి ప్యాకేజీ మొత్తం వివరాలు ప్రకటిస్తారా?)
కరోనావైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రధాని మోదీ రూ .20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడం తోపాటు, నాలుగవ దశ లాక్‌డౌన్ వుంటుందనే సంకేతాలిచ్చిన తరువాత సచిన్ బన్సల్ వరుస ట్వీట్లు చేశారు. ప్రజలు వైరస్‌తో జీవించడం నేర్చుకోవలసి ఉంటుందని, టీకా కోసం ఎదురు చూస్తూ రెండు సంవత్సరాలు ఇళ్లలో బందీలుగా ఉండలేమంటూ గత నెలలో సచిన్ బన్సల్ ట్వీట్ చేసిన సంగతి విదితమే.
I wouldn't have managed to achieve a fraction of what I did without that enabling environment. THIS is actually happening to lakhs of kids today. (2/2)
— Sachin Bansal (@_sachinbansal) May 12, 2020
Comments
Please login to add a commentAdd a comment