ట్విట్టర్లో దిగ్గజ కంపెనీ సీఈవోల వార్!
ఆన్లైన్ మార్కెట్ వచ్చాక భారత్ లో వ్యాపారం బాగా ఊపుకుంది. అదేవిధంగా కంపెనీల సీఈవోలు తమ మార్కెట్ విస్తరణ, వ్యాపారం లాభాల పంట పండించాలని ఆలోచిస్తారు. ప్రస్తుతం ఆన్ లైన్ మార్కెట్లో అవి రెండు పెద్ద మార్కెట్లు.. ఆ కంపెనీ సీఈవోలు మధ్య సహజంగానే పోటీ నెలకొని ఉంటుంది. అయితే ఆ పోటీ కాస్తా వాగ్వాదానికి దారితీయడం హాట్ టాపిక్ గా మారింది. ట్విటర్ వేదికగా చేసుకుని స్నాప్‌డీల్, ఫ్లిప్కార్ట్ సీఈవోలు ఒకరిపై మరొకరు వ్యాఖ్యలు చేసుకున్నారు.
చైనాకు చెందిన ఆన్‌లైన్ దిగ్గజ సంస్థ అలీబాబా త్వరలో భారత్ మార్కెట్లలోకి నేరుగా ప్రవేశించనుంది. ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులలో ఒకరైన సచిన్ బన్సాల్ (ఎగ్జిక్యూటీవ్ చైర్మన్) తీవ్రంగా స్పందించారు. అలీబాబా కంపెనీ మన దేశీయ మార్కెట్లోకి నేరుగా రావాలని చూస్తుందంటే మన దగ్గర పెట్టుబడులు పెట్టిన ఆ సంస్థలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో అర్థం చేసుకోవచ్చునని బన్సాల్ ట్విట్టర్ ద్వారా మాటల యుద్ధానికి తెరలేపారు. స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బహల్ సీరియస్ అయ్యారు. 5 బిలియన్ డాలర్ల ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ క్యాపిటెల్‌ను మోర్గాన్ స్టాన్లీ ముంచేసిన విషయం మరిచిపోయావా అంటూ చురకలు అంటించారు. వ్యాఖ్యలు చేయడం ఆపి, ఎవరి వ్యాపారం వాళ్లు చూసుకుంటే మంచిదని ట్విటర్‌లోనే కునాల్ బహల్ ఘాటుగా జవాబిచ్చారు.
Didn't Morgan Stanley just flush 5bn worth market cap in Flipkart down the