Kunal Bahl
-
నేపాల్ విమానానికి రంద్రాలు..టిష్యూతో కవర్ చేసిన ఎయిర్‌హోస్ట్
నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో 70 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం నాటికి ఈ సంఘటనలో అయిదుగురు భారతీయులతో సహా 68 మంది మృత్యువాతపడ్డారు. This is really really sad. Few yrs ago on my flight to Pokhara, when I told the stewardess that airflow was coming from the corner of a window while airborne, she brought a tissue paper & stuffed the crevice. Decided to never fly to Pokhara again expecting the worst one day 😔 https://t.co/Mf8kBHqIWV — Kunal Bahl (@1kunalbahl) January 15, 2023 ఇక ఈ విమాన ప్రమాదంపై స్నాప్ డీల్ కో-ఫౌండర్ కునాల్ బహ్ల్ విచారం వ్యక్తం చేశారు. నేపాల్ విమాన ప్రమాద వార్తని ట్వీట్ చేశారు. గతంలో బిజినెస్ పనిమీద పొఖారాకు వెళ్లిన బహ్ల్‌కు విమానంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఇది నిజంగా విచారకరం. కొన్ని సంవత్సరాల క్రితం నేను పోఖారాకు వెళ్లాను. నేను ప్రయాణిస్తున్న విమానం కిటికీలకు ఏర్పడిన పగుళ్ల కారణంగా ఆకాశ మార్గంలో ఉండగా.. బయట నుంచి గాలి విమాన కిటికీల పగుళ్ల గుండా లోపలికి వస్తుంది. ఇదే విషయాన్ని గుర్తించిన నేను వెంటనే పక్కనే ఉన్న ఎయిర్ హోస్ట్‌కి సమాచారం అందించా. ఆమె ఓ టిష్యూ పేపర్‌ను అడ్డం పెట్టి గాలి లోపలికి రాకుండా ప్రయత్నించింది. నా దృష్టిలో అదే అంత్యత వరస్ట్ డే. నాటి నుంచి మళ్లీ పోఖారాకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను’ అని ట్వీట్లో తెలిపారు. -
నకిలీ సెగ : బుక్కైన స్నాప్‌డీల్ ఫౌండర్స్
కోటా : ఆన్లైన్ షాపింగ్ సైట్ స్నాప్‌డీల్ చిక్కుల్లో పడింది. నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందన్నఆరోపణల నేపథ్యంలో కంపెనీ ఫౌండర్స్ అడ్డంగా బుక్కయ్యారు. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త ఇందర్‌మోహన్ సింగ్ హనీ ఫిర్యాదు మేరకు స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బాల్, సీవోవో రోహిత్ బన్సల్ చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారవేత్త ఇంద్రమోహన్ సింగ్ హనీ జూలై 17న ఉడ్ ల్యాండ్ బెల్ట్, వాలెట్ లను స్నాప్‌డీల్‌లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేశాడు. ఈ బ్రాండెడ్ వస్తువులకు బదులుగా, నకిలీ వస్తువులు చేరడంతో, వాటిని ఉడ్‌ల్యాండ్ షోరూంకి వెళ్లి ఎంక్వయిరీ చేశాడు. అవి నకిలీవని ఉడ్‌ల్యాండ్ సిబ్బంది కూడా ధృవీకరించారు. దీంతో స్థానిక గుమన్‌పురా స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని ఆయన ఆరోపిస్తున్నారు. చేతి గడియారాన్ని ఆర్డర్ చేశా...డెలివరీ చేశామని కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది కానీ వాచ్ ఇంటికి చేరలేదని తెలిపారు. అయితే కంపెనీకి ఫిర్యాదు చేయడంతో తన డబ్బులను రిఫండ్ చేసిందంటూ గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఇంద్రమోహన్ ఫిర్యాదు ఆదారంగా సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి మనోజ్ సింగ్ సికార్వాల్ తెలిపారు. చదవండి : స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం -
'ఉద్యోగాల భద్రతే మాకు టాప్-ప్రియారిటీ'
బెంగళూరు : నిన్నమొన్నటిదాకా ఆన్ లైన్ షాపింగ్ లో మారుమోగిన స్మాప్ డీల్ పరిస్థితి ప్రస్తుతం అతలాకుతలంగా మారింది. ఆ నష్టాలను అధిగమించడానికి ప్రత్యర్థైన ఫ్లిప్ కార్ట్ కు స్నాప్ డీల్ ను అమ్మేస్తున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఇప్పటివరకు దానిపై స్నాప్ డీల్ ఎలాంటి కామెంట్ చేయనప్పటికీ, ఉద్యోగులు మాత్రం తమ ఉద్యోగాలపై ఆందోళన చెందుతున్నారు. అయితే ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ భరోసా ఇస్తున్నారు. కంపెనీ ఇన్వెస్టర్లు వివిధ రకాల ఆప్షన్లపై చర్చలు సాగిస్తున్నప్పటికీ.. తాము మాత్రం జాబ్ సెక్రురిటీకే టాప్-ప్రియారిటీ ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలకు భరోసా ఇస్తూ ఈ మేరకు ఓ ఈ-మెయిల్ ను ఆదివారం బహల్, స్నాప్ డీల్ ఉద్యోగులకు పంపారు. ''మేము చేయగలిగిందంతా చేస్తాం.. అంతకంటే ఎక్కువ చేయడానికైనా మేము సిద్ధమే. ఇన్వెస్టర్లతో కలిసి పనిచేసేటప్పుడు, ఎంప్లాయిమెంట్‌లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటాం'' అని ఈ-మెయిల్ లో తెలిపారు. గత రెండు నెలలుగా కంపెనీ భవితవ్యంపై ఉద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితిపై వ్యవస్థాపకులు భరోసా కల్పిస్తూ స్పందించడం ఇది మూడోసారి. వచ్చే రెండు వారాల్లో ఇంక్రిమెంట్లు ప్రకటించబోతున్నట్టు కూడా వ్యవస్థాపకులు పేర్కొన్నారు. శరవేగంగా దూసుకెళ్తున్న ఈ-కామర్స్ మార్కెట్లో స్నాప్ డీల్ తట్టుకోలేక, నెంబర్ -2 స్థానాన్ని కోల్పోయింది. మరోవైపు ఊహాగానాలను నిజం చేస్తూ ఫ్లిప్ కార్ట్ కు స్నాప్ డీల్ అమ్మే విషయాన్ని కంపెనీ ఈ నెలలోనే ప్రకటించబోతుందట. -
ట్విట్టర్లో దిగ్గజ కంపెనీ సీఈవోల వార్!
ఆన్లైన్ మార్కెట్ వచ్చాక భారత్ లో వ్యాపారం బాగా ఊపుకుంది. అదేవిధంగా కంపెనీల సీఈవోలు తమ మార్కెట్ విస్తరణ, వ్యాపారం లాభాల పంట పండించాలని ఆలోచిస్తారు. ప్రస్తుతం ఆన్ లైన్ మార్కెట్లో అవి రెండు పెద్ద మార్కెట్లు.. ఆ కంపెనీ సీఈవోలు మధ్య సహజంగానే పోటీ నెలకొని ఉంటుంది. అయితే ఆ పోటీ కాస్తా వాగ్వాదానికి దారితీయడం హాట్ టాపిక్ గా మారింది. ట్విటర్ వేదికగా చేసుకుని స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ సీఈవోలు ఒకరిపై మరొకరు వ్యాఖ్యలు చేసుకున్నారు. చైనాకు చెందిన ఆన్లైన్ దిగ్గజ సంస్థ అలీబాబా త్వరలో భారత్ మార్కెట్లలోకి నేరుగా ప్రవేశించనుంది. ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులలో ఒకరైన సచిన్ బన్సాల్ (ఎగ్జిక్యూటీవ్ చైర్మన్) తీవ్రంగా స్పందించారు. అలీబాబా కంపెనీ మన దేశీయ మార్కెట్లోకి నేరుగా రావాలని చూస్తుందంటే మన దగ్గర పెట్టుబడులు పెట్టిన ఆ సంస్థలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో అర్థం చేసుకోవచ్చునని బన్సాల్ ట్విట్టర్ ద్వారా మాటల యుద్ధానికి తెరలేపారు. స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బహల్ సీరియస్ అయ్యారు. 5 బిలియన్ డాలర్ల ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ క్యాపిటెల్‌ను మోర్గాన్ స్టాన్లీ ముంచేసిన విషయం మరిచిపోయావా అంటూ చురకలు అంటించారు. వ్యాఖ్యలు చేయడం ఆపి, ఎవరి వ్యాపారం వాళ్లు చూసుకుంటే మంచిదని ట్విటర్లోనే కునాల్ బహల్ ఘాటుగా జవాబిచ్చారు. Didn't Morgan Stanley just flush 5bn worth market cap in Flipkart down the -
స్నాప్‌డీల్ ఉద్యోగిని కిడ్నాప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ సంస్థ స్నాప్ డీల్‌కు చెందిన ఉద్యోగినిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన విధులను ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు స్నాప్ డీల్ ఫౌండర్ కునాల్ బాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియా వర్గాలు సంపాధించిన వివరాలు ప్రకారం దీప్తీ సార్నా అనే యువతి గూర్గావ్‌లోని స్నాప్ డీల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ప్రతి రోజు ఆఫీసు వేళలు ముగియగానే మెట్రో రైలు ద్వారా గజియాబాద్‌కు వెళుతుంది. అక్కడి రైల్వే స్టేషన్ నుంచి తన ఇంటికి ఆటోలో వెళుతుంది. రోజూ మాదిరిగానే ఇంటికి వెళుతున్న దీప్తి గత రాత్రి ఇంటికి వెళ్లలేదు. ఎక్కడ ప్రయత్నించినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సంస్థ వ్యవస్థాపకులే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
స్నాప్‌డీల్ చేతికి ఎక్స్క్లూజివ్లీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్ తాజాగా లగ్జరీ ఫ్యాషన్ పోర్టల్ ఎక్స్క్లూజివ్లీ డాట్‌కామ్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఇందుకు ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఫ్యాషన్ వ్యాపార విభాగం కింద 1 బిలియన్ డాలర్ల మేర స్నాప్‌డీల్ ద్వారా విక్రయాలు జరుగుతుండగా.. కొత్త డీల్‌తో ఇది 2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనా. 4 కోట్ల పైచిలుకు ఉన్న యూజర్లకు మరిన్ని లగ్జరీ ఉత్పత్తులు, సర్వీసులు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఎక్స్క్లూజిలివ్లీని కొనుగోలు చేసినట్లు స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ పేర్కొన్నారు. ఎక్స్క్లూజివ్లీ ఇకపై కూడా స్వతంత్ర వెబ్‌సైట్‌గానే పనిచేస్తుందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ వెబ్సైట్ మనీష్ మల్హోత్రా, తరుణ్ తహ్లియానీ, మనీష్ అరోరా, రోహిత్ బాల్, నీతా లుల్లా వంటి ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన డిజైన్స్‌ను విక్రయిస్తోంది. -
స్నాప్ డీల్ లో రతన్ టాటా భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: టాటా కంపెనీల గౌరవ అధ్యక్షుడు రతన్ టాటా తమ కంపెనీలో భారీ పెట్టుబడులు పెట్టారని ఆన్ లైన్ బిజినెస్ పోర్టల్ స్నాప్ డీల్.కామ్ సీఈవో కునాల్ బెహల్ తెలిపారు. అయితే ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టారనే విషయాన్ని స్నాప్ డీల్ గోప్యంగా ఉంచారు. గత నాలుగేళ్లలో తాము సాధించిన వ్యాపార అభివృద్ధికి రతన్ టాటా పెట్టుబడులే ఓ నిదర్శనం అని కునాల్ వ్యాఖ్యాలు చేశారు. ప్రారంభించిన కొద్ది రోజులకే తమ కంపెనీ 400 మిలియన్ అమెరికన్ డాలర్ల సంస్థగా అవతరించిందని ఆయన అన్నారు. వంద కోట్లు రూపాయలను వ్యాపార కార్యకలాపాల కోసం, మూడు బిలియన్ డాలర్లను ఈ కామర్స్ మార్కెటింగ్ కోసం పెట్టుబడిగా పెట్టామని కునాల్ తెలిపారు. గత రెండేళ్లలో స్నాప్ డీల్ 600 శాతం వృద్ధిని సాధించిందని కునాల్ తెలిపారు.