స్నాప్డీల్ ఉద్యోగిని కిడ్నాప్ | Snapdeal Employee Kidnapped After Leaving Work, Says Founder Kunal Bahl | Sakshi
Sakshi News home page

స్నాప్డీల్ ఉద్యోగిని కిడ్నాప్

Published Thu, Feb 11 2016 3:40 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM

స్నాప్డీల్ ఉద్యోగిని కిడ్నాప్

స్నాప్డీల్ ఉద్యోగిని కిడ్నాప్

న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ సంస్థ స్నాప్ డీల్కు చెందిన ఉద్యోగినిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన విధులను ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు స్నాప్ డీల్ ఫౌండర్ కునాల్ బాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియా వర్గాలు సంపాధించిన వివరాలు ప్రకారం దీప్తీ సార్నా అనే యువతి గూర్గావ్లోని స్నాప్ డీల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తోంది.

ఆమె ప్రతి రోజు ఆఫీసు వేళలు ముగియగానే మెట్రో రైలు ద్వారా గజియాబాద్కు వెళుతుంది. అక్కడి రైల్వే స్టేషన్ నుంచి తన ఇంటికి ఆటోలో వెళుతుంది. రోజూ మాదిరిగానే ఇంటికి వెళుతున్న దీప్తి గత రాత్రి ఇంటికి వెళ్లలేదు. ఎక్కడ ప్రయత్నించినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సంస్థ వ్యవస్థాపకులే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement