స్నాప్‌డీల్ చేతికి ఎక్స్‌క్లూజివ్‌లీ | Snapdeal buys Exclusively.com | Sakshi
Sakshi News home page

స్నాప్‌డీల్ చేతికి ఎక్స్‌క్లూజివ్‌లీ

Published Thu, Feb 19 2015 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

స్నాప్‌డీల్ చేతికి ఎక్స్‌క్లూజివ్‌లీ

స్నాప్‌డీల్ చేతికి ఎక్స్‌క్లూజివ్‌లీ

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్ తాజాగా లగ్జరీ ఫ్యాషన్ పోర్టల్ ఎక్స్‌క్లూజివ్‌లీ డాట్‌కామ్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఇందుకు ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఫ్యాషన్ వ్యాపార విభాగం కింద 1 బిలియన్ డాలర్ల మేర స్నాప్‌డీల్ ద్వారా విక్రయాలు జరుగుతుండగా.. కొత్త డీల్‌తో ఇది 2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనా.

4 కోట్ల పైచిలుకు ఉన్న యూజర్లకు మరిన్ని లగ్జరీ ఉత్పత్తులు, సర్వీసులు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఎక్స్‌క్లూజిలివ్‌లీని కొనుగోలు చేసినట్లు స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ పేర్కొన్నారు. ఎక్స్‌క్లూజివ్‌లీ ఇకపై కూడా స్వతంత్ర వెబ్‌సైట్‌గానే పనిచేస్తుందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ మనీష్ మల్హోత్రా, తరుణ్ తహ్లియానీ, మనీష్ అరోరా, రోహిత్ బాల్, నీతా లుల్లా వంటి ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన డిజైన్స్‌ను విక్రయిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement