స్నాప్ డీల్ లో రతన్ టాటా భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: టాటా కంపెనీల గౌరవ అధ్యక్షుడు రతన్ టాటా తమ కంపెనీలో భారీ పెట్టుబడులు పెట్టారని ఆన్ లైన్ బిజినెస్ పోర్టల్ స్నాప్ డీల్.కామ్ సీఈవో కునాల్ బెహల్ తెలిపారు. అయితే ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టారనే విషయాన్ని స్నాప్ డీల్ గోప్యంగా ఉంచారు. గత నాలుగేళ్లలో తాము సాధించిన వ్యాపార అభివృద్ధికి రతన్ టాటా పెట్టుబడులే ఓ నిదర్శనం అని కునాల్ వ్యాఖ్యాలు చేశారు.
ప్రారంభించిన కొద్ది రోజులకే తమ కంపెనీ 400 మిలియన్ అమెరికన్ డాలర్ల సంస్థగా అవతరించిందని ఆయన అన్నారు. వంద కోట్లు రూపాయలను వ్యాపార కార్యకలాపాల కోసం, మూడు బిలియన్ డాలర్లను ఈ కామర్స్ మార్కెటింగ్ కోసం పెట్టుబడిగా పెట్టామని కునాల్ తెలిపారు. గత రెండేళ్లలో స్నాప్ డీల్ 600 శాతం వృద్ధిని సాధించిందని కునాల్ తెలిపారు.