న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ ఈ–కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ వ్యవస్థాపకులపై కేసు నమోదయ్యింది. సంస్థ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ సహా ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటివ్స్ తనకు రూ.9.96 కోట్ల మేర మోసం చేశారంటూ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నవీన్ కుమార్ కేసు పెట్టారు. టాప్ ఎగ్జిక్యూటివ్స్‌లో సేల్స్ డైరెక్టర్ హరి, అకౌంట్స్ మేనేజర్లు సుమిత్ ఆనంద్, శారౌక్యు ఉన్నారు. ‘‘బిగ్ బిలియన్ డే సేల్‌కు 14,000 ల్యాప్‌టాప్‌లను సరఫరా చేశా. అందులో ఫ్లిప్‌కార్ట్ 1,482 యూనిట్లను వెనక్కు ఇచ్చింది. మిగిలిన వాటికి డబ్బుల్ని చెల్లించలేదు. చివరికి టీడీఎస్, షిప్పింగ్ చార్జీలు కూడా ఇవ్వలేదు. డబ్బుల్ని చెల్లించమని అడిగితే 3,901 యూనిట్లు వెనక్కు ఇచ్చినట్లు చెబుతున్నారు. నాకు రూ.9.96 కోట్లు చెల్లించకుండా మోసం చేశారు’‘ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ విషయమై ఫ్లిప్‌కార్ట్ నుంచి ఎటువంటి ప్రతిస్పందనా రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment