నజీమాఖాన్ (ఫైల్)
బంజారాహిల్స్: దత్తత తీసుకున్న కుమార్తెను సరిగ్గా చూడడంలేదని మందలించినందుకు ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. బంజారాహిల్స్ రోడ్డు నెం.10 లోని సింగాడీకుంట బస్తీలో నివసించే నజీమాఖాన్ (29)కు 2009లో జమీల్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి నలుగురు మగపిల్లలు కాగా, ఏడాదిక్రితం నజీమాఖాన్‌కు సమీపంలో నివసించే రియాజ్ అహ్మద్‌తో పరిచయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో ఆరు నెలలక్రితం ఇద్దరూ విడిపోయారు. కాగా పిల్లలను జమీల్ తనతో పాటే ఉంచుకున్నాడు. దీంతో నజీమా ఐదు నెలలక్రితం రెండున్నర ఏళ్ల వయస్సున్న ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంటూ చిన్నారికి ఉమేద అని పేరుపెట్టింది. ఇదిలాఉండగా నజీమా ఇటీవల తన భర్త వద్ద ఉన్న పిల్లలకు తిరిగి దగ్గరై వారందర్నీ చూసుకుంటోంది. ఈ క్రమంలోనే జమీల్ దత్తత తీసుకున్న కుమార్తెను సరిగ్గా చూడడంలేదంటూ మందలించాడు. గురువారం రాత్రి శుభకార్యానికి వెళ్లివచ్చిన వీరు అర్ధరాత్రి 12 గంటల వరకు గొడవపడ్డారు. శుక్రవారం ఉదయం జమీల్ ఎప్పటిలాగే విధులకు వెళ్లిన కొద్దిసేపటికే నజీమా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కలవారు గమనించి జమీల్‌కు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment