
ప్రదర్శనకు నోబెల్ వీలునామా
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ బహుమతి సృష్టికర్త ఆల్ప్రెడ్ నోబెల్ తాను మరణానికి ముందు రాసిన వీలునామాను త్వరలో ప్రదర్శనకు ఉంచనున్నారు. 1896 మరణించిన ఆయన సాహిత్యం, శాంతి, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్య రంగాల్లో అత్యున్నత కృషి చేసిన వ్యక్తులకు తన పేరు మీద అవార్డును అందించాలని, అందుకోసం తన మొత్తం ఆస్తిని కూడా ఈ అవార్డుల పేరు మీద రాసిపెట్టి చనిపోయారు. అయితే, ఆ వీలునామాను ఇంతవరకు బహిరంగంగా ఎవరూ చూడలేదు. దీంతో ఈ అవకాశాన్ని మార్చి 13 నుంచి స్టాక్ హోమ్లో 'లెకసీ' పేరుతో జరగనున్న ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నట్లు నోబెల్ ఫౌండేషన్ పేర్కొంది. చనిపోయే ముందు గొప్ప వ్యక్తులు రాయించిన వీలునామాలన్నీ ఇందులో ప్రదర్శనకు ఉంచనున్నారు.