చిత్తూరు(గిరింపేట): జిల్లాలో అనుమతి లేని, నిబంధనలు పాటించని పాఠశాలలు 13 ఉన్నాయని, వాటిని ఎంఈవోలు సందర్శించి యాజమాన్యాల వివరణ తీసుకోవాలని డీఈవో నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది బదిలీలు పొంది రిలీవ్ కాని 560 మంది ఉపాధ్యాయులకు మూడు ఆప్షన్లు ఇచ్చి వారి కోరిక మేరకు బదిలీ చేయనున్నట్లు చెప్పారు.
ఈనెల 24 నుంచి జూన్ 12 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయని, 13న తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. జూన్‌లోపు జిల్లాలో 1,400 మంది టీచర్లను నియమిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.