స్మార్ట్‌ఫోన్ కోసం మరీ 20, 30 వేల రూపాయలు ఖర్చు చేయడం దండగనుకునే వారికి జపనీస్ కంపెనీ పానసోనిక్ అందుబాటులోకి తెచ్చిన తాజా ఫోన్ ఈ పీ31. అయిదు అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, సంజ్ఞలతోనూ పనిచేసే అత్యాధునిక టెక్నాలజీల కలబోతగా ఉండే ఈ ఫోన్ ఖరీదు కేవలం రూ.11,990 మాత్రమే. ప్లే లైఫ్ ఫీచర్ గెస్చర్స్ కంట్రోల్, పాటల ఆర్గనైజేషన్ కోసం, మల్టీటాస్కింగ్, బ్యాటరీ పొదుపు కోసం పనికొస్తుంది. మధ్యమశ్రేణి ఫోన్ అయినప్పటికీ కనెక్టివిటీకి సంబంధించి త్రీజీతోపాటు వైఫై, ఏ-జీపీఎస్, వైఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ వంటి ఆప్షన్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. రెండు మైక్రోసిమ్ కార్డులను మాత్రమే సపోర్ట్ చేయడం కొంచెం ఇబ్బందికరమైన అంశం.
ప్రాసెసర్: 1.3 గిగాహెర్ట్జ్, క్వాడ్‌కోర్
ప్రధాన కెమెరా: 8 మెగాపిక్సెల్స్
ఫ్రంట్ కెమెరా: వీజీయే
ఆపరేటింగ్ సిస్టమ్: 4.2 జెల్లీబీన్
ర్యామ్: 1 జీబీ
మెమరీ: 4 జీబీ ఇంటర్నల్
(మైక్రోఎస్‌డీ కార్డుతో 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు)
బ్యాటరీ: 2000 ఎంఏహెచ్ ( 9 గంటల టాక్‌టైమ్, 600 గంటల స్టాండ్‌బై)
పానసోనిక్ పీ31
Published Wed, Mar 12 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
Advertisement
Advertisement