భారీ బ్యాటరీ, బడ్జెట్‌ ధర: ‘పీ55 మాక్స్‌’ | Panasonic unveils 'P55 Max' with massive 5,000mAh battery | Sakshi
Sakshi News home page

భారీ బ్యాటరీ, బడ్జెట్‌ ధర: ‘పీ55 మాక్స్‌’

Published Mon, Jul 17 2017 1:52 PM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM

భారీ బ్యాటరీ, బడ్జెట్‌ ధర: ‘పీ55 మాక్స్‌’

భారీ బ్యాటరీ, బడ్జెట్‌ ధర: ‘పీ55 మాక్స్‌’

న్యూఢిల్లీ:  పానసోనిక్ తన నూతన స్మార్ట్‌ఫోన్  పీ55 మాక్స్‌ను విడుదల చేసింది.  అతిపెద్ద బ్యాటరీతో   వస్తున్న  ఈ డివైస్‌ను బడ్జెట్‌ ధరలో సోమవారం లాంచ్‌ చేసింది.  రూ.8,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. జూలై 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ లోప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

 5000 ఎంఏహెచ్‌ సామర్ధ్యంతో లాంగ్‌ లాస్టింగ్‌ బ్యాటరీ ద్వారా   వాల్యూ  బేస్డ్‌ సెగ్మెంట్‌లో వినియోగదారులకు  నిరంతరాయ సేవలు అందుబాటులోకి తెచ్చామని పానసోనిక్  ఇండియా బిజినెస్ హెడ్(మొబిలిటీ డివిజన్)  పంకజ్ రాణా చెప్పారు.

పానసోనిక్ పీ55 మాక్స్‌ ఫీచర్లు...

 5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్‌ ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.0
3 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement