హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ కుకర్ల విక్రయాల్లో 60 శాతం వ్యాపారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి నమోదవుతున్నట్లు ప్యానాసోనిక్ అప్లియెన్సెస్ వెల్లడించింది. దేశీయంగా నెలకు 7.5–8 లక్షల ఎలక్ట్రిక్ కుకర్లను విక్రయిస్తున్నామని కంపెనీ ఎండీ హిదెనోరి అసో తెలిపారు. కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.
‘భారత్‌లో ఏటా వివిధ కంపెనీలు 15 లక్షల ఎలక్ట్రిక్ కుకర్లను విక్రయిస్తున్నాయి. ఇందులో మాకు 55 శాతం మేర వాటా ఉంది. ఏటా 20 శాతం వృద్ధి చెందుతున్నాం. ప్రస్తుత ఏడాది 25 శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం 2.5–3 లక్షల యూనిట్లు అమెరికాతో సహా మొత్తం 43 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. భారత్‌లో ఎలక్ట్రిక్ కుకర్లను పూర్తి స్థాయిలో తయారు చేస్తున్న ఏకైక కంపెనీ ప్యానాసోనిక్’ అని హిదెనోరి వివరించారు. దేశంలో ఏటా సుమారు 50 లక్షల ప్రెషర్ కుకర్లు అమ్ముడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment