హెచ్‌పీ నుంచి కొత్త తరం ప్రింటర్లు | HP expands portfolio for SMBs, launches three new printers | Sakshi
Sakshi News home page

హెచ్‌పీ నుంచి కొత్త తరం ప్రింటర్లు

Published Wed, Oct 15 2014 1:14 AM | Last Updated on Sat, Sep 15 2018 3:43 PM

హెచ్‌పీ నుంచి కొత్త తరం ప్రింటర్లు - Sakshi

హెచ్‌పీ నుంచి కొత్త తరం ప్రింటర్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ హ్యూలెట్ ప్యాకర్డ్(హెచ్‌పీ) నూతన తరం లేజర్ జెట్ మల్టీఫంక్షన్ ప్రింటర్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మూడు రకాల సిరీస్‌లో తయారైన ఈ ప్రింటర్ల ధరలు రూ.10 వేల నుంచి ప్రారంభమై రూ.3.35 లక్షల వరకు ఉన్నాయి. చిన్న, మధ్యతరహా కంపెనీలు, వాణిజ్య సంస్థలను ల క్ష్యంగా చేసుకుని వీటిని రూపొందించామని హెచ్‌పీ ఇండియా ప్రింటింగ్ సిస్టమ్స్ కేటగిరీ లీడర్ పరీక్షత్ సింగ్ తోమర్ మంగళవారమిక్కడ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

స్కాన్ చేసిన పీడీఎఫ్ కాపీలను ఎడిట్ చేసుకునే వీలు, సెక్యూరిటీ పిన్ ఇచ్చాకే ముద్రణ రావడం వంటి ఫీచర్లను ప్రింటర్లలో పొందుపరిచారు. ఎం630 సిరీస్ ప్రింటర్ల ధర రూ.2.34-3.35 లక్షల మధ్య ఉంది. ఇందులోని నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్‌తో ఐఫోన్6, ఆన్‌డ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌తో రూపొందిన స్మార్ట్‌ఫోన్ల నుంచి డాక్యుమెంట్లను ప్రింట్ ఇవ్వొచ్చు. నకిలీ టోనర్ కార్‌ట్రిడ్జ్‌లకు అడ్డుకట్ట వేయడానికి కొత్త లేబుల్‌ను కంపెనీ పరిచయం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement