డ్రీమ్‌హాక్ ఇండియా 2024: హైదరాబాద్‌లో గ్రాండ్ ఫినాలే.. | DreamHack 2024 in Hyderabad Dates and Details | Sakshi
Sakshi News home page

డ్రీమ్‌హాక్ ఇండియా 2024: హైదరాబాద్‌లో గ్రాండ్ ఫినాలే..

Published Thu, Nov 14 2024 8:07 PM | Last Updated on Thu, Nov 14 2024 8:24 PM

DreamHack 2024 in Hyderabad Dates and Details

డ్రీమ్‌హాక్ ఇండియాలో ఒమెన్ ఇంటెల్ క్యాంపస్ క్వెస్ట్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేను హెచ్‌పీ ప్రకటించింది. గత మూడు నెలలుగా.. భారతదేశం అంతటా 1,600 జట్లకు చెందిన 8,000 మంది ప్లేయర్స్ వివిధ రౌండ్లలో పోరాడారు. కాగా ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగే గ్రాండ్ ఫినాలేలో టాప్ ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఇందులో విజేతకు రూ.5 లక్షల బహుమతిని అందజేస్తారు.

గ్రాండ్ ఫినాలే నవంబర్ 15 నుంచి 17వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో సందర్శకులు హెచ్‌పీ ఇంటరాక్టివ్ ప్రోడక్ట్ బూత్‌లలో బ్రాండ్ గేమింగ్ సొల్యూషన్‌లకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా పొందవచ్చు. ఆసక్తి కలిగిన సందర్శకులు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొనవచ్చు. దీనికోసం టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సందర్శకులు తమ అభిమాన ప్రో ప్లేయర్‌లు, గేమింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లను కలవడానికి కూడా ఓ మంచి అవకాశాన్ని పొందుతారు.

•తేదీ: 2024 నవంబర్ 15 నుంచి 17
•వేదిక: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్
•టిక్కెట్ ప్రారంభ ధర: రూ. 1,699

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement