సూపర్ స్లిమ్గా హెచ్పీ క్రోమ్ బుక్13 | HP announces ultra-thin Chromebook 13 with Intel Core M CPU at $499 | Sakshi
Sakshi News home page

సూపర్ స్లిమ్గా హెచ్పీ క్రోమ్ బుక్13

Published Fri, Apr 29 2016 5:57 PM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

సూపర్ స్లిమ్గా హెచ్పీ క్రోమ్ బుక్13

సూపర్ స్లిమ్గా హెచ్పీ క్రోమ్ బుక్13

ఇప్పటివరకూ చాలా రకాలైన క్రోమ్ బుక్స్  ను మార్కెట్లోకి తీసుకొచ్చిన హ్యూలెట్ ప్యాకర్డ్(హెచ్ పీ), లేటెస్ట్ టెక్నాలజీతో మరో కొత్తరకం అల్ట్రా థిన్ క్రోమ్ బుక్13ను గురువారం విడుదల చేసింది. క్రోమ్ ఓఎస్ ఆధారంగా ఈ సూపర్ స్లిమ్ నోట్ బుక్ ను గూగుల్ తో కలిసి రూపొందించింది. దీని ధర 499 డాలర్లు(దాదాపు రూ.33,193)గా ఉండనుందని కంపెనీ తెలిపింది. ఈ నెల నుంచి దీన్ని అమ్మకాలు జరపనున్నట్టు ప్రకటించింది.

13.3 అంగుళాలు, ఎక్కువ రెసుల్యూషన్ డిస్ ప్లే 3,200x1,800 పిక్సెల్ డిస్ ప్లేతో దీన్ని రూపొందించారు. ఈ ప్రొడక్ట్ మొత్తం మెటల్ కేసింగ్ నే కలిగి ఉంటుంది. ఈ అందమైన, శక్తివంతమైన క్రోమ్ బుక్ లో ఆరవ తరం ఇంటెల్ కోర్ ఎమ్3 ప్రాసెసర్ ను వాడారు. 1.29 కిలోగ్రాముల బరువును కల్గి ఉన్న ఈ క్రోమ్ బుక్ , 11.5 గంటలపాటు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం ఉందని కంపెనీ హామీ ఇచ్చింది. 4జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, రెండు యూఎస్ బీ-టైప్ సీ పోర్ట్స్, యూఎస్బీ 3.0 పోర్ట్ , మైక్రో ఎస్డీ కార్డ్ రీడర్, హెడ్ ఫోన్ జాక్ లు దీనిలో ఉన్నాయి.

అయితే ఈ క్రోమ్ బుక్ 13 టాప్ ఎండ్ వర్షన్ చాలా స్పీడుగా ఉండే ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఎమ్7తో మార్కెట్లోకి వస్తుందని, 16జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్ నల్ స్టోరేజీని ఇది కలిగిఉంటుందని హెచీ పీ తెలిపింది. అన్నీ డివైజ్ లో కల్లా ఇది చాలా ఖరీదైన మోడల్ అని, దీని ధర 1,029 డాలర్లుగా ఉండబోతుందని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement