సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌పీ అత్యంత శక్తివంతమైన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఇండియాలో ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్‌లో ఒమెన్ 17 పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌లో సరికొత్త 13వ జెన్ ఇంటెల్ కోర్ i9 CPU ,Nvidia GeForce RTX 4080 ను జోడించింది.
హెచ్‌పీ ఒమన్ ధర రూ.2,69,990గా నిర్ణయించింది. ఇండియాలో ఒమెన్ ప్లేగ్రౌండ్ స్టోర్స్, HP వరల్డ్ స్టోర్స్ , HP ఆన్‌లైన్ స్టోర్ వంటి వివిధ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఒమెన్ టెంపెస్ట్ కూలింగ్ టెక్నాలజీతో ఒమెన్ 17 ఒమెన్ గేమింగ్ హబ్‌గా ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
గేమింగ్ ల్యాప్‌టాప్ హెచ్‌పీ ఒమెన్ 17 ఫీచర్లు
17.3-అంగుళాల IPS డిస్‌ప్లే
క్వాడ్ HD (2560 × 1440 పిక్సెల్‌లు) రిజల్యూషన్
24 కోర్ 13వ జెన్ ఇంటెల్ కోర్ i9 CPU
ప్యానెల్ 240Hz రిఫ్రెష్ రేట్
32 జీబీ DDR5 ర్యామ్, 1TB PCIe NVMe SSD నిల్వ
Nvidia RTX 4080 ల్యాప్‌టాప్ GPUతో వస్తుంది.
ఇంకా ఒమెన్ 17 బ్యాంగ్ & ఒలుఫ్‌సెన్ డ్యూయల్ స్పీకర్స్, 720p HD వెబ్‌క్యామ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ అర్రే డిజిటల్ మైక్రోఫోన్‌ల Wi-Fi 6E కనెక్టివిటీ, థండర్‌బోల్ట్ 4 టైప్-C పోర్ట్, మూడు USB టైప్-A పోర్ట్స్, HDMI పోర్ట్, మినీ డిస్‌ప్లే పోర్ట్, RJ-45 పోర్ట్ , RTX 40 సిరీస్ ల్యాప్‌టాప్ 330W ఛార్జింగ్‌కు మద్దతుతో 83 Wh Li-ion పాలిమర్ బ్యాటరీ మొదలైనవి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment