
హెచ్ పీ కొత్త ల్యాపీ
హెచ్ పీ కొత్త క్రోమ్ బుక్ 11 జీ5 ను అందుబాటు ధరల్లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ.12,800 ధరకే ఈ ల్యాప్ టాప్ ను కంపెనీ ప్రవేశపెట్టింది. జూలై నుంచి ఆన్ లైన్ లో ఈ ల్యాపీ అందుబాటులోకి వస్తుండగా.. అక్టోబర్ నుంచి రిటైలర్లు ఈ ల్యాపీ అమ్మకాలు చేపట్టవచ్చు. రెండు డిస్ ప్లే వేరియంట్లలో ఈ క్రోమ్ బుక్ అందుబాటులోకి రానుంది.
ఒకటి 1366 X 768 పిక్సెల్స్ రెసుల్యూషన్ తో 11.6 అంగుళాల ఐపీఎస్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే, మరొకటి టచ్ స్క్రీన్ లేని డిస్ ప్లేగా ఈ వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్ తో టచ్ స్క్రీన్ డిస్ ప్లే ను కవర్ చేయనుంది. స్టూడెంట్లను, టీచర్లను టార్గెట్ గా ఈ కొత్త క్రోమ్ బుక్ ను ఆవిష్కరించినట్టు హెచ్ పీ వెల్లడించింది. సింగిల్ చార్జింగ్ తో టచ్ స్క్రీన్ వేరియంట్ 11 గంటలు పనిచేయగా.. స్టాండర్డ్ వేరియంట్ 12 గంటల 30 నిమిషాల బ్యాటరీ బ్యాక్ అప్ ను కలిగిఉందని కంపెనీ చెప్పింది.
క్రోమ్ బుక్ 11 జీ5 ఫీచర్లు...
డ్యూయల్ కోర్ ఇంటెల్ సెలెరాన్ ఎన్3060 ప్రాసెసర్
2 జీబీ లేదా 4 జీబీ ర్యామ్
16 జీబీ లేదా 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
రెండు యూఎస్ బీ 3.1 పోర్ట్స్
3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్
గూగుల్ క్రోమ్ ఓఎస్(ఆండ్రాయిడ్ యాప్స్ పనిచేసే సౌకర్యం)
హెచ్ డీ ట్రూవెర్షన్ హెచ్ డీ వెబ్ కామ్(720 పీ రెసూల్యూషన్ తో వీడియో తీయడం)
స్టాండర్డ్ క్రోమ్ బుక్ 2.61 కేజీల బరువు
టచ్ స్క్రీన్ మోడల్ 2.51 కేజీల బరువు