గెలాక్సీ ఏ71, ఏ51.. వినూత్న ఫీచర్లు | Samsung Introduced New Privacy Feature | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ క్విక్‌ స్విచ్‌తో గోప్యత పదిలం

Published Thu, Sep 10 2020 4:35 PM | Last Updated on Thu, Jul 28 2022 7:27 PM

Samsung Introduced New Privacy Feature  - Sakshi

గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ వంటి పరిశ్రమలో తొలి వినూత్న ప్రైవసీ ఫీచర్లతో శాంసంగ్ నూతన ప్రమాణాలను నెలకొల్పింది. శాంసంగ్ ప్రైవసీ ఇన్నోవేషన్స్ క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ గెలాక్సీ ఏ51, ఏ 71లపై అందుబాటులోకి వచ్చాయి.

మీ ప్రైవేట్ యాప్స్, కంటెంట్ భద్రతపై ఎలాంటి ఒత్తిడి, విచారం లేకుండా మీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుతూనే అల‍్ట్‌జడ్ లైఫ్ మీకు వినోదం అందిస్తుంది.

ఫీచర్ భాగస్వామి, హెచ్‌టీ బ్రాండ్ స్టూడియో మిలీనియల్స్, జడ్ జనరేషన్ వారి స్మార్ట్‌ ఫోన్‌లను ఫోటోలు తీసుకోవడం నుంచి గేమ్స్ ఆడటం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండటం, గూగుల్ సమాచారం వెతకడం సహా అన్ని విషయాల్లోనూ వాడుతున్నారు.

ఫోన్ మీ చేతిలో ఉన్నంతవరకూ సురక్షితంగా భావిస్తుంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ స్మార్ట్‌ ఫోన్‌ వైపు చూస్తే మీరు నిజంగా వారికి ఇచ్చేందుకు తిరస్కరిస్తారా..? మీ ఫోన్‌ను వారు చేతుల్లోకి తీసుకుని కెమెరాతో ఫోటోలు తీసేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తే మీ ప్రైవేట్ కంటెంట్ బయటకు వచ్చే అవకాశాలు అధికం.

అల్ట్‌జడ్ లైఫ్‌లో చేరడం ద్వారా మీ వ్యక్తిగత జీవితం వ్యక్తిగతంగానే నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది. క్విక్‌ స్విచ్ పేరుతో పరిశ్రమలోనే తొలి ప్రైవసీ ఫీచర్‌ను శాంసంగ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ స్మార్ట్‌ ఫోన్‌ మరొకరికి ఇచ్చినప్పుడు మీకుండే యాంగ్జైటీని ఇది నివారిస్తుంది. పవర్ కీని డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది. శాంసంగ్ ‘మేక్ ఫర్ ఇండియా’ కార్యక్రమం కింద క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్‌ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫీచర్లు గెలాక్సీ ఏ71, గెలాక్సీ ఏ51లపై అందుబాటులో ఉంటాయి. (Advertorial)

ఫీచర్లపై మరిన్ని వివరాలు..
క్విక్ స్విచ్ : మీ ప్రైవసీని కాపాడుకునేందుకు వేగవంతమైన మార్గం

లంచ్, టీ బ్రేక్ సమయాల్లో స్మార్ట్‌ ఫోన్‌ను వర్క్ డెస్క్‌ల వద్ద వదిలేసి వెళ్లే వారిలో మీరూ ఒకరా? వారి ఫోన్లలో ఇతరులు వ్యాసాలు/ డాక్యుమెంట్లను చదివేందుకు అనుమతించే వారిలో మీరూ ఉన్నారా? అందుకు చింతించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత సమాచారాన్ని వ్యక్తిగతంగా ఉంచేందుకు క్విక్ స్విచ్ ఫీచర్ అందుబాటులో ఉంది

అల్ట్‌ జడ్ లైఫ్‌లో నివసించేందుకు ప్రతిఒక్కరి అవసరాలను క్విక్‌ స్విచ్ తీర్చేస్తుంది. ఇది సౌకర్యవంతంగా ఉండటంతో పాటు అవరోధాలు లేకుండా ఉంటుంది. మీ స్మార్ట్‌ ఫోన్‌ను ఇతరులతో పంచుకునే సమయంలో పవర్ కీని డబుల్ టాప్ చేస్తే సరిపోతుంది.

ప్రైవేట్, పబ్లిక్ మోడ‍్స్‌లోకి వేగంగా మారే వెసులుబాటును క్విక్ స్విచ్ ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ ఫీచర్‌ను గ్యాలరీకే కాకుండా వెబ్ బ్రౌజర్, వాట్సాప్ వంటి ఇతర యాప్స్  ప్రైవసీకి వాడవచ్చు. మీరు స్విచ్ ఆఫ్ మోడ్‌లో ఉంటే ఏ ఒక్కరూ పసిగట్టలేరు. మీ స్మార్ట్‌ ఫోన్‌ గ్యాలరీని చూడాలని ఎవరైనా అనుకుంటే మీరు వారికి పబ్లిక్ వెర్షన్‌ చూపవచ్చు. సెక్యూర్ ఫోల్డర్‌లో దాచిన ప్రైవేట్ కంటెంట్ మీ ఒక్కరే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇతరులతో పంచదలుచుకోలేని ఫోటోలను డిఫెన్స్ గ్రేడ్ శాంసంగ్ నాక్స్‌తో  భద్రమైన సెక్యూర్డ్ ఫోల్డర్‌లో మీరు సురక్షితంగా భద్రపరుచుకోవచ్చు.

కంటెంట్ సజెషన్స్ : ప్రైవేట్, వ్యక్తిగత కంటెంట్ ఏదో నిర్ధారించేందుకు తెలివైన మార్గం

కంటెంట్ సజెషన్స్ సెక్యూర్ ఫోల్డర్ లోపల ‘ఆన్ డివైజ్ ఏఐ’ ఫీచర్‌గా అందుబాటులో ఉంటుంది. కంటెంట్ సజెషన్స్ స్మార్ట్‌ ఫోన్‌లో నిక్షిప్తమైన ఏఐ ఆధారిత ఇంజిన్ ద్వారా నిర్ధిష్ట ఫోటోలను సెక్యూర్ ఫోల్డర్‌కు తరలించాల్సిందిగా సూచిస్తుంది.

ఎలాంటి ఫోటోలు, ముఖాలు, ఏ తరహా ఫోటోలను ప్రైవేట్‌గా ట్యాగ్ చేయాలో యూజర్ నిర్ణయించుకోవచ్చు. ఆపై ఏ ఒక్కరూ వాటిని యాక్సెస్ చేయలేని విధంగా కంటెంట్ సజెషన్స్ తెలివిగా ఏయే ఫోటోలను ప్రైవేట్ గ్యాలరీకి పంపాలో సూచిస్తుంది.

యూజర్ ప్రైవసీని పెంచేందుకు స్మార్ట్‌ ఫోన్‌ లోపలే ఏఐ సొల్యూషన్ ఈ పనులను చక్కబెడుతుంది. సర్వర్, క్లౌడ్‌తో ఎలాంటి ఇంటరాక్షన్ లేకుండానే ఏఐ సొల్యూషన్ ఈ ప్రక్రియను చేపడుతుంది.

శాంసంగ్ తొలిసారిగా ఈ ఫీచర్లను మధ్య శ్రేణి సెగ్మెంట్‌కు అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. జడ్ జనరేషన్, మిలీనియల్స్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ ఫీచర్లు యూజర్ల గోప్యత, ప్రశాంతతను కాపాడతాయి.

నాక్స్ సెక్యూరిటీ
గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌పై యూఐ సాఫ్ట్‌వేర్ ద్వారా నిర్మితిమైన డిఫెన్స్ గ్రేడ్ సెక్యూరిటీ ఫ్లాట్‌ఫాం శాంసంగ్ నాక్స్ భద్రతతో గెలాక్సీ ఏ 51, గెలాక్సీ ఏ71 స్మార్ట్‌ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సైనిక తరహా గోప్యతా విధానం మీ స్మార్ట్‌ ఫోన్‌లో డేటా అంతటినీ పూర్తిగా కాపాడుతుంది.

యూజర్ల గోప్యతపై ఇంతగా ఏ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్ ఆలోచించని రీతిలో పరిశ్రమలోనే తొలి గోప్యతా ప్రమాణాలను పాటిస్తూ శాంసంగ్ తనదైన లీగ్‌లో చేరింది.

అల్ట్‌జడ్‌ లైఫ్‌లో నివసించేందుకు గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లు మెరుగైన ఎంపికలు.

(Advertorial)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement