
శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా క్రెడిట్ కార్డ్ సేవల్లోకి అడుగుపెట్టింది. ‘ఆపిల్ కార్డ్’ పేరుతో నూతనతరం ఆర్థిక సేవలకు శ్రీకారం చుట్టింది. తన సొంత వాలెట్ యాప్ ఆధారంగా సునాయాసంగా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలుకల్పిస్తోంది. కార్డు నెంబర్, సంతకం, సీవీవీ సెక్యూరిటీ కోడ్ వంటి సంప్రదాయ ఫిజికల్ క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగా వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. చిటికెలో చెల్లింపులు జరిగిపోయే అధునాతన డిజిటల్ కార్డును ఐఫోన్ వినియోగదారులకు అందిస్తోంది. ఎక్స్‌పైరీ డేట్ లేని ఈ కార్డు సహాయంతో అత్యంత సులువుగా షాపింగ్ పూర్తిచేయవచ్చని యాపిల్ ప్రకటించింది. ‘ఆపిల్ పే’ యాప్‌లో అభివృద్ధిచేసిన డిజిటల్ క్రెడిట్ కార్డు వినియోగంపై 3% వరకు క్యాష్‌బ్యాక్ అందుతుంది. ఇందుకు సంబంధించిన బ్యాంకింగ్ సేవలను గోల్డ్‌మన్ శాక్స్ అందిస్తుండగా.. అంతర్జాతీయ చెల్లింపుల నెట్‌వర్క్‌ను మాస్టర్‌కార్డ్ అందిస్తోంది. ‘ఐఫోన్‌లోని ఆపిల్ పే యాప్‌లో సైన్‌ఇన్ అయిన క్షణాల్లోనే ఈ క్రెడిట్ కార్డ్ సేవలను పొందవచ్చు. మెషీన్ లెర్నింగ్, ఆపిల్ మ్యాప్స్ ఆధారంగా చెల్లింపు జరిగిన స్థలం, మర్చెంట్ పేరు స్టోర్ అయి ఉంటాయి. కస్టమర్ల డేటాను ఇతరులకు విక్రయించేది లేదని గోల్డ్‌మన్ శాక్స్ స్పష్టంచేసింది. ఇందువల్ల కార్డు భద్రత విషయంలో ఎటువంటి అనుమానం అవసరం లేదఅని యాపిల్ పే వైస్ ప్రెసిడెంట్ జెన్నిఫర్ బైలీ పేర్కొన్నారు. ఈ వేసవి నుంచి అమెరికాలో క్రెడిట్ కార్డ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.
ఐఫోన్‌లో నెట్‌ఫ్లిక్స్ వార్తల సమాహారం
మ్యూజిక్ సేవల్లో సంచలనం సృష్టించిన యాపిల్.. నెట్‌ఫ్లిక్స్ సహాయంతో ఇక నుంచి తాజా వార్తలను సైతం అందించే ప్రయత్నంచేస్తోంది. ‘నెట్‌ఫ్లిక్స్ ఫర్ న్యూస్’ పేరుతో 300 పైగా మేగజైన్లలోని ఆర్టికల్స్‌ను అందుబాటులో ఉంచడంతో పాటు సమగ్ర వార్తలను అందిస్తోంది. నెలకు 10 డాలర్లను సబ్‌స్క్రిప్షన్ కింద చెల్లించడం ద్వారా యాపిల్ కస్టమర్లు ఈ సేవలు అందుకోవచ్చని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment