ఇకపై నిశ్చింతగా ఉండవచ్చు.. (స్పాన్సర్డ్‌) | Samsung Galaxy A51 A71 New Privacy Features Sponsored | Sakshi
Sakshi News home page

పవర్‌ కీని రెండుసార్లు క్లిక్‌ చేస్తే చాలు (స్పాన్సర్డ్‌)

Published Sat, Sep 26 2020 2:01 PM | Last Updated on Mon, Dec 21 2020 11:49 AM

Samsung Galaxy A51 A71 New Privacy Features Sponsored - Sakshi

శాంసంగ్‌ గలాక్సీ ఏ 51, గలాక్సీ ఏ71 స్మార్ట్‌ఫోన్లలో ప్రవేశపెట్టిన ప్రైవసీ ఫీచర్‌ను జెడ్‌ జనరేషన్‌, మిలీనియల్స్‌ అత్యధికంగా ఇష్టపడుతున్నారు. క్విక్‌ స్విచ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫీచర్‌ ద్వారా గ్యాలరీ, వెబ్‌ బ్రౌజర్‌, వాట్సాప్‌ తదితర యాప్స్‌ వినియోగంలో ప్రైవేట్‌ నుంచి వేగంగా పబ్లిక్‌ వెర్షన్‌కు మారేందుకు వీలుంటుంది. ఇందుకు పవర్‌ కీని రెండుసార్లు క్లిక్‌ చేస్తే సరిపోతుంది! 

ఫీచర్ భాగస్వామి, హెచ్‌టీ బ్రాండ్‌ స్టూడియో
జెడ్‌ జనరేషన్‌, మిలీనియల్స్‌ తమ స్మార్ట్‌ఫోన్లపై అత్యధిక సమయాన్ని గడుపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ లేదా స్నాప్‌చాట్‌లో ఫొటోలను అప్‌లోడ్‌ చేయడం, లేకుంటే.. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, వాట్సాప్‌లలో చాట్ ‌చేయడం కోసం అధిక సమయాన్ని వినియోగిస్తున్నారు. రోజువారీ జీవనంలో మరే ఇతర గాడ్జెట్‌కంటే స్మార్ట్‌ఫోన్‌పైనే అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు.

ఆధునిక శాంసంగ్‌ గలాక్సీ ఏ 51, గలాక్సీ ఏ71 స్మార్ట్‌ఫోన్ల ద్వారా జెడ్‌ జనరేషన్‌, మిలీనియల్స్‌కు సరికొత్త ప్రపంచం పరిచయమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు అమోలెడ్‌ డిస్‌ప్లేలతోపాటు.. క్యాడ్‌ కెమెరా సెటప్‌, అధిక సమయం నిలిచే బ్యాటరీ శక్తితో లభిస్తాయి. ఎలాంటి టాస్క్‌నైనా సులభంగా నిర్వహించుకోవచ్చు.

ఆల్ట్‌ జెడ్‌ జీవితంలో శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లతో ఒత్తిడిని దూరం(స్ట్రెస్‌ ఫ్రీ) చేసుకోవచ్చు. మీ జీవితంలో ప్రైవేట్‌ మొమెంట్స్‌ను ప్రైవేట్‌గానే ఉంచుకోవచ్చు. మీరు మినహా ఎవరూ వీటిని పొందలేరు. క్విక్‌ స్విచ్‌, ఇంటెలిజెంట్‌ కంటెంట్‌ సజెషన్స్‌ పేరుతో పరిశ్రమలోనే తొలిసారి రెండు ఆధునిక ప్రైవసీ ఫీచర్స్‌ను ప్రవేశపెట్టింది. వీటితో వెనుదిరిగి చూడవలసిన అవసరం ఉండదు.

ప్రైవసీ ఫస్ట్‌
స్మార్ట్‌ఫోన్లను రోజువారీ వినియోగించేందుకు ఇష్టపడేవారైతే.. అన్ని వేళలా మీ ప్రైవసీ రక్షణను కోరుకుంటారు. ఇతరులు ఫోటోలు తీసుకునేందుకు మీ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించుకోవడాన్ని చాలా సందర్భాలలో ఎదుర్కొనే ఉంటారు. తద్వారా మీకు సంబంధించిన ఫొటోలు తదితరాలను చూడటం జరుగుతూ ఉంటుంది. అయితే మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిశీలించడం ద్వారా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఎవరైనా మీకు వచ్చిన మెసేజ్‌ను చదివే అవకాశముండవచ్చు. ఇలాంటి సందర్భంలో మనకు సంబంధించిన వ్యక్తిగత, ప్రైవేట్‌ డేటాను ఇతరులు చూస్తారన్న ఆందోళన కలుగుతుంది. ఇలాంటప్పుడు పవర్‌ బటన్‌ను డబుల్‌ క్లిక్‌ చేయడం ద్వారా ఆందోళనకు చెక్‌ పెట్టవచ్చు. క్విక్‌ స్విచ్‌గా పిలిచే ఈ విశిష్ట ఫీచర్‌.. శాంసంగ్‌ గలాక్సీ ఏ51, గలాక్సీ ఏ 71 స్మార్ట్‌ఫోన్లకు ప్రత్యేకం. 

నటి రాధికా మదన్‌ జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. ఈ ఫీచర్‌ను సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఈ వీడియోలో తన బాయ్‌ఫ్రెండ్‌(సన్నీ సింగ్‌ నటించారు)కు పుట్టిన రోజు పార్టీతో సర్‌ప్రైజ్‌ చేయాలనుకుంటుంది. అయితే ఊహించని విధంగా సన్నీ వచ్చాడు. అయితే రాధిక ఎలాంటి పరిస్థితుల్లోనూ సర్‌ప్రైజ్‌ పార్టీ ఆలోచనకు విఘాతం కలగకూడదనుకుంది. ఇందువల్ల ఆమె క్విక్‌ స్విచ్‌ను వినియోగించడం ద్వారా సీక్రెట్‌ను సేఫ్‌గా ఉంచగలిగింది.

క్విక్‌ స్విచ్‌ ఫీచర్‌ కారణంగా ఎవరైనా తమ స్మార్ట్‌ఫోన్‌ను ఫొటో తీసేందుకు మరొకరికి సంకోచం లేకుండా ఇవ్వవచ్చు. లేదంటే యూట్యూబ్‌లో వైరల్‌ అవుతున్న వీడియోను వీక్షించేందుకు ఇవ్వవచ్చు. ఫోన్‌ పవర్‌ బటన్‌ను డబుల్‌ క్లిక్‌ చేయడం ద్వారా ఫోన్‌లోని యాప్స్‌- గ్యాలరీ, బ్రౌజర్‌, వాట్సాప్‌ వంటివన్నీ ప్రైవేట్‌ నుంచి పబ్లిక్‌ మోడ్‌కు మారిపోతాయి.  

అంతేకాకుండా మీరు ప్రైవసీ కోరుకునే ఇమేజ్‌లను ప్రైవేట్‌ చేయమంటూ ఏఐ ఆధారిత కంటెంట్‌ సజెషన్స్‌ సూచిస్తుంది. ఈ ఫీచర్‌ సులభంగా సెట్‌ చేసుకోవచ్చు. కొన్ని ముఖాలు లేదా ఇమేజిలను ఎంపిక చేసుకోవాలి. వీటిని ప్రైవేట్‌ ఫోల్టర్‌లోకి బదిలీ చేయాలి. శాంసంగ్‌ నాక్స్‌(Knox)ద్వారా కంటెంట్‌ సజెషన్స్‌కు డిఫెన్స్‌ ప్రమాణాల స్థాయిలో భద్రత ఉంటుంది. దీంతో మీ ప్రైవసీకి గతంలో ఎన్నడూలేని విధంగా రక్షణ లభిస్తుంది. 

ఇక కెమెరా విశిష్టతలను పరిశీలిస్తే..

సింగిల్‌ టేక్‌
కెమెరా ఫీచర్లలో మొదటిగా చెప్పుకోవలసింది సింగిల్‌ టేక్‌. ఫొటోలు తీసుకోవడంలో పెర్‌ఫెక్ట్‌ ఫ్రేమ్‌ను ఎంచుకునేందుకు వీలుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో సింగిల్‌ టేక్‌ ఫీచర్‌ను ఎంపిక చేసుకుంటే చాలు. మిగతా పని ఫోన్‌ చూసుకుంటుంది. ఈ ఫీచర్‌ ద్వారా 10 రకాల ఫొటోలు, వీడియోలను ఫోన్‌ క్యాప్చర్‌ చేస్తుంది. వీటిలో 7 ఫొటోలు, 3 వీడియోలు నమోదవుతాయి. ఇవి గ్యాలరీలో వెనువెంటనే లభ్యమవుతాయి. ఉత్తమ షాట్స్‌ను తీయడం ద్వారా సింగిల్‌ టేక్‌ ఒకే ఆల్బమ్‌కింద రూపొందిస్తుంది. ఏఐ సహకారంతో కెమెరా సాఫ్ట్‌వేర్‌.. షార్ట్‌ మూవీ, జిఫ్‌ యానిమేషన్స్‌, స్టైలిష్‌ ఇమేజెస్‌ తదితరాలను ఆటోమాటిక్‌గా తీయగలుగుతుంది. 

సింగిల్‌ టేక్‌ ఫీచర్‌తో అత్యుత్తమ ఫొటోను పొందగలుగుతారు. తద్వారా వీటిని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా షేర్‌ చేసుకోవచ్చు. సింగిల్‌ క్లిక్‌తో షేర్‌ చేయగలగడంతో సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది.

నైట్‌ హైపర్‌ల్యాప్స్‌
సింగిల్‌ క్లిక్‌ తదుపరి నైట్‌ హైపర్‌ల్యాప్స్‌ను ప్రస్తావించాలి. సోషల్‌ మీడియా ఫీడ్స్‌ను గమనిస్తే జెడ్‌ జనరేషన్‌, మిలీనియల్స్ ప్రతి రోజూ మరిన్ని ఫొటోలను తీసుకుంటూ ఉంటారంటే అతిశయోక్తి కాదు. భోజనానికి ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లినా లేదా పార్క్‌లో కూర్చున్నా ఆ సమయాన్ని హైపర్‌ల్యాప్స్‌గా పిలవవచ్చు. మూవింగ్‌ టైమ్‌ ల్యాప్స్‌గా పేర్కొనే ఈ సమయంలో శాంసంగ్‌ నైట్‌ హైపర్‌లాప్స్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. దీంతో తక్కువ లైటింగ్‌ పరిస్థితుల్లోనూ అందమైన ఫొటోలను తీసుకునేందుకు వీలుంటుంది. 

కెమెరాలో గల ఇతర ఫీచర్ల విషయానికివస్తే.. కస్టమ్‌ ఫిల్టర్‌, క్విక్‌ వీడియో రికార్డింగ్, స్విచ్‌ కెమెరా వైల్‌ రికార్డింగ్‌(ప్రస్తుతం ఏ51లో లభ్యం), ఏఐ గ్యాలరీ జూమ్‌, స్మార్ట్‌ సెల్ఫీ యాంగిల్‌ను ప్రస్తావించవచ్చు.

ఆల్ట్‌ జెడ్‌ లైఫ్‌లో రిలీఫ్‌
శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఇతరులకు ఫోన్‌ ఇచ్చే సమయంలో ఆందోళనలకు చెక్‌ పెట్టవచ్చు. ఈ విషయంలో ఇకపై నిశ్చింతగా ఉండవచ్చు.

గలాక్సీ ఏ51, గలాక్సీ ఏ71 స్మార్ట్‌ఫోన్లను సరికొత్త ఆవిష్కరణలుగా చెప్పవచ్చు. క్వాడ్‌ కెమెరా సెటప్‌తో సులభంగా ఫొటోలను తీయవచ్చు. దీనికితోడు అత్యుత్తమ డిస్‌ప్లే, అధిక సమయం నిలిచే బ్యాటరీ అండగా ఉంటాయి. ఇంతకంటే ఆశించడానికి ఇంకేముంటుంది? 
ఈ ఫీచర్లతో గలాక్సీ ఏ51, గలాక్సీ ఏ71 స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఆల్ట్‌ జెడ్‌ జీవితాన్ని ఆనందించండి. 
మరింకెందుకు ఆలస్యం? (Advertorial)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement