గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71పై శాంసంగ్ ఊహించని అద్భుత స్మార్ట్‌ఫోన్ ప్రైవసీ పాలసీని అందిస్తోంది. మీ ఫోన్‌ను ఎవరైనా చూస్తామని అడిగినప్పుడు మీరు కంగారు పడుతుంటారా? ఇక నుంచి అలాంటి ఆందోళన అవసరం లేదు. క్విక్ స్విచ్, ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ మీ ప్రైవసీని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఫీచర్ భాగస్వామి : హెచ్టీ బ్రాండ్ స్టూడియో
మిలీనియల్స్, జనరేషన్ జడ్ వినియోగించే ఒకే ఒక బహుళ ప్రయోజనకర పరికరం ఏదంటే అది స్మార్ట్‌ఫోన్ మాత్రమే. ఫ్రెండ్స్తో మెసేజింగ్ నుంచి టీమ్ వర్క్ను చక్కబెట్టడం, ఆన్‌లైన్ క్లాస్‌లకు హాజరవడం వరకూ ప్రతిఒక్కటీ స్మార్ట్‌ఫోన్ మీకు తోడుగా నిలుస్తుంది. అయితే మన స్మార్ట్‌ఫోన్లలో ప్రైవసీని కాపాడే విషయంలో మాత్రం మనం తరచూ నష్టపోతుంటాం. భారతీయ సంస్కృతికి అనుగుణంగా ప్రజలు సన్నిహితంగా మెలుగుతుంటారు. కుటుంబ సభ్యులు మన సంభాషణలను వినడం, మన స్మార్ట్‌ఫోన్‌ను వారి చేతుల్లోకి తీసుకోవడం అసాధారణ విషయాలేమీ కాదు. మనలో చాలా మందికి ప్రైవసీ అనేది ఆలోచనకు అందేది కాదు.
మరి మీ స్మార్ట్ ఫోన్‌ను మీరు ఎలా కాపాడుకుంటారు?
రెండంచెల వినూత్న ప్రైవసీ ఫీచర్లను ప్రవేశపెట్టడం ద్వారా శాంసంగ్ దీనికి ఓ మార్గం చూపింది. క్విక్ స్విచ్, ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్ పేరిట ఈ రెండు ఫీచర్లు మీ గోప్యతపై ఆందోళనలను పూర్తిగా తొలగించేందుకు సహాయపడతాయి. అత్యధికంగా అమ్ముడవుతున్న గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై ఈ ప్రైవసీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
క్విక్ స్విచ్ పేరుకు తగినట్టే చాలా సరళతరంగా ఉంటుంది. పవర్ బటన్ను రెండు సార్లు ప్రెస్ చేయడం ద్వారా ఇది యాక్టివేట్ అవుతుంది. ఇది గ్యాలరీ, బ్రౌజర్, వాట్సాప్ వంటి ఇతర యాప్లను ఇది క్షణాల్లోనే ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్‌లకు మార్చేస్తుంది. ఈ ఫీచర్ వివిధ సందర్భాల్లో మిమ్మల్ని ఎలా కాపాడుతుందో చూడవచ్చు.
గ్యాలరీ : మీరు విహార యాత్రకు వెళ్లి తిరిగి రాగానే నేరుగా కార్యాలయానికి వెళ్లారు. మీరు వెళ్లిన ప్రదేశంలో మెరుగ్గా ఉన్న ఫోటోలను మీ కొలీగ్స్‌కు చూపిస్తున్నారు. మీకు, మీ ఫ్రెండ్స్‌కు మాత్రమే ఉద్దేశించిన ఫోటోలను మీరు చూస్తుండగా అనూహ్యంగా మీ బాస్ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో పవర్ బటన్‌ను రెండుసార్లు ప్రెస్ చేసి మీ పని మీరు చేసుకోవచ్చు.
రాధికా మదన్ను ఆమె బాస్ నుంచి క్విక్ స్విచ్ ఎలా కాపాడిందో చూడండి
చాట్ : వాలెంటైన్స్ డే సందర్భంగా మీరు మీ బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేశారు. దీనిపై సలహాలు కోరుతూ మీ ఫ్రెండ్‌కు వాట్సాప్ మెసేజ్ చేశారు. ఆమె కొన్ని సజెషన్స్ చేశారు, వాటిలో ఒక దాన్ని మీరు ఇష్టపడ్డారు. ఈ ఉద్వేగంలో మీ బాయ్‌ఫ్రెండ్ మీ పక్కనే ఉన్న విషయం గమనించలేదు. ఏ క్షణంలోనైనా తను మీ ఫోన్ వైపు చూసి మీ ఉద్దేశాలను పసిగట్టవచ్చు. అయితే దీనిపై భయపడాల్సిన అవసరం లేదు. పవర్ బటన్ను రెండు సార్లు ప్రెస్ చేయడం ద్వారా వాట్పాప్ను ప్రైవేట్ వెర్షన్ నుంచి పబ్లిక్ వెర్షన్కు మార్చేయవచ్చు. రాధికా మదన్‌ను క్విక్ స్విచ్ ఫీచర్ ఎలా కాపాడిందో చూడండి.
బ్రౌజర్ : మీరు మీ సోదరికి బర్త్డే గిఫ్ట్ కోసం బ్రౌజింగ్ చేస్తున్నారు. గిఫ్ట్ మీ ఇంటికి వచ్చే వరకూ అదేంటో మీ సోదరి చూడకూడదని మీరు భావిస్తున్నారు. మీ సోదరి మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ వద్దకు చేరుకోకముందే మీరు బ్రౌజర్‌ను ప్రైవేట్ వెర్షన్ నుంచి పబ్లిక్ వెర్షన్‌ను మార్చవచ్చు. బర్త్‌డే గిఫ్ట్‌పై మీ సోదరికి ఎలాంటి క్లూ లేకుండా చేయడంతో పాటు ఆమెను సర్ప్రైజ్ చేయడం కొనసాగించేలా చూడొచ్చు. క్విక్ స్విచ్ ఫీచర్ రాధికా మదన్ను ఆమె సోదరిని సర్ప్రైజ్ చేసేలా ఎలా ఉపకరించిందో చూడండి.
ఇక ఇంటెలిజెంట్ కంటెంట్ సొల్యూషన్స్ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై డివైజ్ లోపల ఏఐ ఫీచర్‌గా స్మార్ట్‌ఫోన్‌పై మీకు పూర్తి గోప్యతను అందించేందుకు ఉపకరిస్తుంది.
ఏఐ ఆధారిత ఇంజన్ పబ్లిక్ గ్యాలరీ నుంచి ప్రైవేట్ గ్యాలరీకి తరలించే ఫోటోలను ఆటోమేటిక్‌గా సూచిస్తుంది. ప్రైవేట్‌గా ఉంచదల్చిన ఫోటోలు, ముఖాలను యూజర్ ఎంపిక చేసుకుంటే చాలు మిగిలిన పని ఇంటెలిజెంట్ కంటెంట్ సొల్యూషన్స్ చక్కబెడుతుంది. ఒకసారి మీరు ఆయా ఫోటోలు, ముఖాలను గుర్తిస్తే ఏఐ ఇంజన్ ఆయా ఇమేజ్‌లను గుర్తించి వాటిని ప్రైవేట్ గ్యాలరీకి తరలిస్తుంది.
ఈ అద్భుత ప్రైవసీ పాలసీని శాంసంగ్ గెలాక్సీ ఏ51, ఏ71 స్మార్ట్‌ఫోన్లపై ఎలా యాక్టివేట్ చేయాలో చూడండి.
అల్ట్ జడ్ లైఫ్ గురించి విన్నారా ?
క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్ అల్ట్ జడ్ లైప్‌ను పూర్తిగా ఆస్వాదించేలా మీకు సహకరిస్తాయి. మీ ప్రైవేట్ కంటెంట్ మీకు మాత్రమే అందుబాటులో ఉంటూ ఒత్తిడి రహిత, వినోదభరిత జీవితాన్ని మీరు ఆస్వాదించేలా ఇవి ఉపకరిస్తాయి. మీరు ఇంట్లో ఉన్నా, మెట్రోలో ఉన్నా ప్రైవసీ గురించి ఆందోళన లేని జీవితమే అల్ట్ జడ్ జీవితం మీకు అందిస్తుంది. ఫోటోలను తీసుకోవడంలో స్వేచ్ఛ, వాట్సప్‌పై నాన్‌స్టాప్ చాట్, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌ను స్క్రోల్ చేయడం ఇవన్నీ పూర్తి ప్రైవసీతో చేసుకోవచ్చు. వీటన్నింటిని మించి మెరుగైన అనుభూతిని మీకు అందించేందుకు గెలాక్సీ ఏ51, ఏ71 భరోసా ఇస్తున్నాయి.
ఇప్పుడే వెళ్లి శాంసంగ్ గెలాక్సీ ఏ51 లేదా గెలాక్సీ ఏ71 స్మార్ట్‌ఫోన్లను సొంతం చేసుకోండి ఇక మీరు ఎన్నడూ వెనక్కితిరిగి చూసుకోరు! (Advertorial)
Comments
Please login to add a commentAdd a comment